IPL 2022 | రాహుల్ క్లీన్‌బౌల్డ్.. గర్ల్‌ఫ్రెండ్ అతియా హార్ట్‌బ్రేక్!
11 April 2022, 15:29 IST
- గర్ల్‌ఫ్రెండ్ ఎంతో ముచ్చటపడి మ్యాచ్ చూడటానికి వస్తే.. రాహుల్ మాత్రం తుస్సుమనిపించాడు. అతను ఔటైన తర్వాత అతియా ఎక్స్‌ప్రెషన్‌కు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.
రాహుల్ ఫస్ట్ బాల్ కే క్లీన్ బౌల్డ్ కావడంతో అతియా నిరాశ
ముంబై: ఐపీఎల్లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో తలపడింది లక్నో సూపర్ జెయింట్స్. ఈ మ్యాచ్‌లో చివరి బంతి వరకూ పోరాడినా.. చివరికి 3 పరుగుల తేడాతో లక్నో ఓడింది. దీంతో ఆ టీమ్ హ్యాట్రిక్ విజయాల దూకుడుకు బ్రేక్ పడింది. ఓడితే ఓడాం కానీ.. చివరి వరకూ ఫైట్ చేశామన్న సంతృప్తి ఉన్నదని మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ అన్నాడు.
మ్యాచ్ ఓటమి అంతగా బాధించలేదేమో కానీ.. తన గర్ల్‌ఫ్రెండ్ ముందు డకౌట్ కావడం మాత్రం రాహుల్‌ను కచ్చితంగా డిసప్పాయింట్ చేసే ఉంటుంది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ తొలి బంతికే తమ కెప్టెన్ రాహుల్ వికెట్ కోల్పోయింది. బౌల్ట్ వేసిన అద్భుతమైన ఇన్‌స్వింగర్ రాహుల్‌ను క్లీన్‌బౌల్డ్ చేసింది. తొలి బంతికే రాహుల్ ఔట్ కావడంతో లక్నో ఫ్యాన్స్ షాక్ తిన్నారు.
ఆ ఫ్యాన్స్‌లో అతని గర్ల్‌ఫ్రెండ్ అతియా శెట్టి, ఆమె తండ్రి సునీల్ శెట్టి కూడా ఉన్నారు. తన బాయ్‌ఫ్రెండ్ ఆడుతుంటే చూడాలని ఎంతో ముచ్చటపడి వచ్చిన అతియా.. రాహుల్ ఇలా తొలి బాల్కే ఔటవడంతో బాగా నిరాశగా కనిపించింది. అతను ఔటవ్వగానే అతియాతోపాటు సునీల్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాహుల్ ఔట్ కాగానే కెమెరాల కళ్లన్నీ అతియా వైపే వెళ్లాయి.
నిజానికి ఈ సీజన్లో రాహుల్ ఇలా తొలి బంతికే ఔటవడం ఇది రెండోసారి. లక్నో కెప్టెన్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లోనే రాహుల్ తొలి బంతికే ఔటయ్యాడు. గుజరాత్ టైటన్స్‌తో మ్యాచ్‌లో షమి బౌలింగ్‌లో రాహుల్ గోల్డెన్ డకౌటయ్యాడు. మూడు మ్యాచ్‌ల తర్వాత అతడు మరోసారి అదే రిపీట్ చేశాడు.
టాపిక్