తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sourav Ganguly Trolled: వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌పై ట్వీట్‌.. గంగూలీని దారుణంగా ట్రోల్‌ చేస్తున్న ఫ్యాన్స్‌

Sourav Ganguly Trolled: వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌పై ట్వీట్‌.. గంగూలీని దారుణంగా ట్రోల్‌ చేస్తున్న ఫ్యాన్స్‌

Hari Prasad S HT Telugu

09 August 2022, 16:52 IST

google News
    • Sourav Ganguly Trolled: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీని దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు క్రికెటర్‌ ఫ్యాన్స్‌. కామన్వెల్త్ గేమ్స్‌లో వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ మెడల్‌పై ఆయన చేసిన ట్వీట్‌పై వాళ్లు సీరియస్‌ అవుతున్నారు.
వుమెన్స్ టీమ్ పై గంగూలీ చేసిన ట్వీట్ పై దుమారం
వుమెన్స్ టీమ్ పై గంగూలీ చేసిన ట్వీట్ పై దుమారం

వుమెన్స్ టీమ్ పై గంగూలీ చేసిన ట్వీట్ పై దుమారం

న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన వుమెన్స్‌ టీ20 క్రికెట్‌లో ఫైనల్‌ వరకూ చేరి స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన చేసింది ఇండియన్‌ టీమ్‌. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయి సిల్వర్‌తో సరిపెట్టుకుంది. కేవలం 9 పరుగుల తేడాతో గోల్డ్‌ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. అయినా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీలోని ఇండియన్‌ వుమెన్స్‌ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిసింది.

అటు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా టీమ్‌ను ప్రశంసిస్తూనే ఓ ట్వీట్‌ చేశారు. అయితే ఇందులోనే ఆయన చేసిన ఓ కామెంట్‌ ఫ్యాన్స్‌కు నచ్చలేదు. సిల్వర్‌ గెలిచినందుకు కంగ్రాచులేషన్స్‌.. అయితే వాళ్లు మాత్రం ఇంటికి అసంతృప్తిగానే వస్తారు. ఎందుకంటే మ్యాచ్‌ వాళ్ల చేతుల్లోనే ఉండింది అని గంగూలీ ట్వీట్‌ చేశారు. దీనిపైనే అభిమానులు మండిపడుతున్నారు.

అసలు మీ ట్వీటే అతిపెద్ద అసంతృప్తి కలిగిస్తోందంటూ నెటిజన్లు ట్వీట్లు చేశారు. వాళ్లు సిల్వర్‌ గెలిచినందుకు గర్వంగానే ఉంటారు.. కానీ ఫైనల్స్‌ గురించి మీరు మాట్లాడమేంటని ఓ యూజర్‌ ప్రశ్నించాడు. ఇలాంటి వ్యక్తి బోర్డు ప్రెసిడెంట్‌గా ఉండటం దురదృష్టకరమని మరో వ్యక్తి కామెంట్‌ చేశారు. సిగ్గులేదా అని మరో వ్యక్తి కాస్త ఘాటుగానే ట్వీట్‌ చేయడం గమనార్హం.

కామన్వెల్త్ గేమ్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 161 రన్స్‌ చేసింది. తర్వాత చేజింగ్‌లో తొలి మూడు ఓవర్లలోనే ఓపెనర్లు స్మృతి మంధానా, షెఫాలీ వర్మ ఔటయ్యారు. అయినా కూడా జెమీమా, హర్మన్‌ప్రీత్‌ మూడో వికెట్‌కు 96 రన్స్‌ జోడించి మ్యాచ్‌పై ఆశలు రేపారు. అయితే చివరి 5 వికెట్లు కేవలం 13 పరుగుల తేడాతో పడిపోవడంతో ఇండియా టార్గెట్‌ చేజ్‌ చేయలేకపోయింది.

తదుపరి వ్యాసం