Sourav Ganguly: టీమ్ ఇండియాపై గంగూలీ ప్ర‌శంస‌లు...ట్వీట్‌లో కోహ్లి పేరును ప్ర‌స్తావించిన బీసీసీఐ ప్రెసిడెంట్‌-sourav ganguly s tweet praising kohli after england series win goes viral ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sourav Ganguly: టీమ్ ఇండియాపై గంగూలీ ప్ర‌శంస‌లు...ట్వీట్‌లో కోహ్లి పేరును ప్ర‌స్తావించిన బీసీసీఐ ప్రెసిడెంట్‌

Sourav Ganguly: టీమ్ ఇండియాపై గంగూలీ ప్ర‌శంస‌లు...ట్వీట్‌లో కోహ్లి పేరును ప్ర‌స్తావించిన బీసీసీఐ ప్రెసిడెంట్‌

HT Telugu Desk HT Telugu
Jul 18, 2022 12:17 PM IST

ఇంగ్లాండ్ గడ్డపై టీ20, వన్డే సిరీస్ ను గెలుచుకొని టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. ఈ అద్భుత విజయాల్ని అందుకున్న ప్లేయర్స్ పై బీసీసీఐ చైర్మన్ గంగూలీ ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్ లో అతడు చేసిన పోస్ట్ లో కోహ్లి పేరును పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది.

<p>సౌరభ్ గంగూలీ</p>
సౌరభ్ గంగూలీ (twitter)

ఇంగ్లాండ్ పై వన్డే, టీ20 సిరీస్ లలో విజయాల్ని అందుకున్న టీమ్ ఇండియాపై బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. టెస్ట్ సిరీస్ ను 2 2 తో సమంగా ముగించిన టీమ్ ఇండియా వన్డే, టీ20 సిరీస్ లను 2 1 తేడాతో గెలుచుకొంది. హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, భువనేశ్వర్, బుమ్రాతో పాటు పలువురు ఆటగాళ్లు ఈ సిరీస్ లో రాణించారు.

ఆదివారం మూడో వన్డేలో టీమ్ ఇండియా విజయాన్ని సాధించిన అనంతరం క్రికెటర్లను అభినందిస్తూ బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఇంగ్లాండ్ ను వారి సొంత గడ్డపై ఓడించడం సులభం కాదని పేర్కొన్నాడు. అసమాన ఆటతో టీమ్ ఇండియా ప్లేయర్స్ అసాధారణ విజయాన్ని అందుకున్నారని చెప్పాడు.

టెస్ట్ సిరీస్ లో 2 2 తో సమంగా ముగించడమే కాకుండా వన్డే, టీ20లలో గెలుపును సాధించడం ఆనందంగా గంగూలీ తెలిపాడు. ప్రస్తుతం కోచ్ రాహుల్ ద్రావిడ్ తో పాటు మాజీ కోచ్ రవిశాస్త్రిని అభినందించారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లిని పేరును ఈ ట్వీట్ లో ప్రస్తావించారు. మూడో వన్డేలో సెంచరీతో చెలరేగిన పంత్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు.

గత ఏడాది జరగాల్సిన టెస్ట్ కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. అప్పుడు టీమ్ ఇండియాకు రవిశాస్త్రి కోచ్ గా ఉన్నారు. అందుకే అతడి పేరును ట్వీట్ లో గంగూలీ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ట్వీట్ లో కోహ్లి పేరును అతడు ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సిరీస్ లో కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడు. టెస్ట్, టీ20లతో పాటు వన్డే సిరీస్ లో రాణించలేదు. ఈ సిరీస్ లో రాణించిన హార్దిక్, బుమ్రాతో పాటు పలువురు ఇతర క్రికెటర్లను విస్మరించి ప్రత్యేకంగా కోహ్లి పేరును పేర్కొనడం తో గంగూలీ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Whats_app_banner

సంబంధిత కథనం