Asia Cup 2022 Schedule: ఆసియా కప్ 2022 షెడ్యూల్ ఇదే.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
26 August 2022, 10:32 IST
- Asia Cup 2022 Schedule: ఆసియా కప్ 2022 శనివారం (ఆగస్ట్ 27) నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ కాంటినెంటల్ మెగా టోర్నీ షెడ్యూల్ ఏంటి? ఇండియా మ్యాచ్‌లు ఎప్పుడున్నాయో ఒకసారి చూద్దాం.
ఆసియాకప్ 2022 విజేత అందుకోబోయే ట్రోఫీ ఇదే
Asia Cup 2022 Schedule: ఆసియా కప్ 2022 ప్రారంభానికి సమయం దగ్గర పడింది. 2018లో చివరిసారి జరిగిన ఈ టోర్నీ మళ్లీ నాలుగేళ్ల తర్వాత వస్తోంది. 2020లో టోర్నీ జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా సాధ్యం కాలేదు. 2016, 2018లలో ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈసారి టోర్నీలో అడుగుపెడుతోంది.
ఆసియా కప్ క్వాలిఫయర్స్ 20వ తేదీని ప్రారంభమై 24న ముగిసింది. ఇందులో మూడు విజయాలతో హాంకాంగ్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. ఈ టీమ్ ఇండియా, పాకిస్థాన్‌లతో కలిసి గ్రూప్ ఎలో ఉంటుంది. ఇక గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉంటాయి. గ్రూప్ స్టేజ్‌లో టాప్ 2లో నిలిచిన టీమ్స్ సూపర్ ఫోర్‌కు అర్హత సాధిస్తాయి. అక్కడి నుంచి రెండు టీమ్స్ ఫైనల్ చేరతాయి. ఈసారి సెమీఫైనల్స్ బదులుగా సూపర్ 4 కాన్సెప్ట్ తీసుకొచ్చారు.
ఆగస్ట్ 27 నుంచి సెప్టెంబర్ 11 వరకూ ఆసియాకప్ జరుగుతుంది. గ్రూప్ స్టేజ్ సెప్టెంబర్ 2న ముగుస్తుంది. ఇక సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 9 వరకూ సూపర్ 4 స్టేజ్ మ్యాచ్‌లు జరుగుతాయి. సెప్టెంబర్ 11న ఫైనల్ ఉంటుంది. ఈసారి ఆసియా కప్ శ్రీలంకలో జరగాల్సి ఉన్నా.. అక్కడి పరిస్థితుల కారణంగా యూఏఈకి తరలించారు. అయితే టోర్నీ ఆతిథ్య హక్కులు మాత్రం శ్రీలంక దగ్గరే ఉన్నాయి.
గ్రూప్ స్టేజ్ షెడ్యూల్ ఇదీ
ఆగస్ట్ 27 - శ్రీలంక vs ఆఫ్ఘనిస్థాన్ (దుబాయ్‌లో రాత్రి 7.30 గంటల నుంచి)
ఆగస్ట్ 28 - ఇండియా vs పాకిస్థాన్ (దుబాయ్‌లో రాత్రి 7.30 గంటల నుంచి)
ఆగస్ట్ 30 - బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్థాన్ (షార్జాలో రాత్రి 7.30 గంటల నుంచి)
ఆగస్ట్ 31 - ఇండియా vs హాంకాంగ్ (దుబాయ్‌లో రాత్రి 7.30 గంటల నుంచి)
సెప్టెంబర్ 1 - శ్రీలంక vs బంగ్లాదేశ్ (దుబాయ్‌లో రాత్రి 7.30 గంటల నుంచి)
సెప్టెంబర్ 2 - పాకిస్థాన్ vs హాంకాంగ్ (షార్జాలో రాత్రి 7.30 గంటల నుంచి)
సూపర్ 4 షెడ్యూల్ ఇదీ
సెప్టెంబర్ 3 - బీ1 vs బీ2 (షార్జాలో రాత్రి 7.30 గంటల నుంచి)
సెప్టెంబర్ 4 - ఎ1 vs ఎ2 (దుబాయ్‌లో రాత్రి 7.30 గంటల నుంచి)
సెప్టెంబర్ 6 - ఎ1 vs బీ1 (దుబాయ్‌లో రాత్రి 7.30 గంటల నుంచి)
సెప్టెంబర్ 7 - ఎ2 vs బీ2 (దుబాయ్‌లో రాత్రి 7.30 గంటల నుంచి)
సెప్టెంబర్ 8 - ఎ1 vs బీ2 (దుబాయ్‌లో రాత్రి 7.30 గంటల నుంచి)
సెప్టెంబర్ 9 - బీ1 vs ఎ2 (దుబాయ్‌లో రాత్రి 7.30 గంటల నుంచి)
ఫైనల్
సెప్టెంబర్ 11 - సూపర్ ఫోర్ 1 vs సూపర్ ఫోర్ 2 (దుబాయ్‌లో రాత్రి 7.30 గంటల నుంచి)
ఆసియా కప్ 2022 ప్రైజ్‌మనీ
ఆసియా కప్ 2022 ప్రైజ్‌మనీ విషయానికి వస్తే విజేతకు 2 లక్షల డాలర్లు (సుమారు రూ.కోటి 60 లక్షలు), రన్నరప్‌కు లక్ష డాలర్లు (సుమారు రూ.80 లక్షలు) ఇస్తారు. 2018తో పోలిస్తే ప్రైజ్‌మనీ భారీగానే పెరిగింది. ఆ ఏడాది విజేతకు 60 వేల డాలర్లు మాత్రమే ఇచ్చారు. ఆ లెక్కన ఈసారి మూడు రెట్లకుపైగానే పెరిగింది. అయితే చివరిసారి వన్డే ఫార్మాట్‌లో జరిగిన టోర్నీ ఈసారి టీ20 ఫార్మాట్‌లో జరుగుతోంది.