Asia Cup 2022: ఆసియాకప్‌ ఎక్కువసార్లు గెలిచిన టీమ్‌ ఏదో తెలుసా?-india dominated asia cup with seven win in 14 tournaments ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  India Dominated Asia Cup With Seven Win In 14 Tournaments

Asia Cup 2022: ఆసియాకప్‌ ఎక్కువసార్లు గెలిచిన టీమ్‌ ఏదో తెలుసా?

Hari Prasad S HT Telugu
Aug 17, 2022 02:47 PM IST

Aisa Cup 2022: జెంటిల్మన్‌ గేమ్‌ క్రికెట్‌కు కేరాఫ్‌గా నిలిచే ఆసియాలో అసలు సిసలు ఛాంపియన్‌ ఎవరో తేల్చే ఆసియాకప్‌కు టైమ్‌ దగ్గరపడుతోంది. ఆగస్ట్‌ 27 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

2018లో జరిగిన ఆసియా కప్ తో టీమిండియా
2018లో జరిగిన ఆసియా కప్ తో టీమిండియా (Twitter)

దుబాయ్‌: ఆసియా ఖండంలో ఉన్న ఇండియా, పాకిస్థాన్‌, శ్రీలంక క్రికెట్‌పై ఎంత ఆధిపత్యం చెలాయించాయో మనకు తెలిసిందే. ఈ మూడు టీమ్స్‌ కలిపి మొత్తంగా నాలుగుసార్లు విశ్వవిజేతలుగా నిలిచాయి. ఇండియాలో రెండుసార్లు వరల్డ్‌కప్‌ గెలవగా.. శ్రీలంక, పాకిస్థాన్‌ చెరొకసారి ట్రోఫీ అందుకున్నాయి. ఈ మూడు టీమ్స్‌ కాకుండా బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌లాంటి టీమ్స్‌ కూడా అంతర్జాతీయ వేదికపై అప్పుడప్పుడూ మెరుపులు మెరిపిస్తూనే ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

పెద్ద టీమ్స్‌కు తరచూ షాకివ్వడం అలవాటుగా మార్చుకుంది బంగ్లాదేశ్‌. 2012 నుంచి ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌ మూడుసార్లు ఫైనల్‌ రావడం విశేషం. ఇప్పుడీ ఐదు టీమ్స్‌తోపాటు మరో క్వాలిఫయర్‌ కలిసి ఆసియా కప్‌ కోసం పోటీ పడనున్నాయి. ఈ నెల 27 నుంచి యూఏఈలో ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈసారి టోర్నీలో ఇండియా, పాకిస్థాన్‌లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. మరి ఇప్పటి వరకూ జరిగిన టోర్నీల్లో ఆధిపత్యం ఎవరిదో ఓసారి చూద్దాం.

ఆసియాలో ఆధిపత్యం ఎవరిది?

ఈ ఏడాది జరగబోతున్న ఆసియాకప్‌ 15వది. అంటే 2018 వరకూ 14 టోర్నీలు జరిగాయి. మొదటిసారి ఆసియాకప్‌ 1984లో జరిగింది. 2016లో తొలిసారి ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరిగింది. అందులో ఇండియా విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2018లో చివరిసారి వన్డే ఫార్మాట్ లో ఆసియాకప్‌ జరిగిన సమయంలోనూ ఇండియానే గెలిచింది. యూఏఈలోనే జరిగిన ఆ టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది.

అంటే ఈసారి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో టీమిండియా బరిలోకి దిగబోతోంది. అంతేకాదు ఆసియాకప్‌లో మన టీమ్‌దే పూర్తి ఆధిపత్యం కూడా. ఇప్పటి వరకూ 14 టోర్నీలు జరగగా.. అందులో 7 సార్లు ఇండియానే కప్పు గెలవడం విశేషం. చివరి రెండుసార్లు కూడా ఇండియానే విజేత. ఇక ఇండియా తర్వాత శ్రీలంక ఐదుసార్లు గెలిచి రెండోస్థానంలో నిలవగా.. పాకిస్థాన్‌ రెండుసార్లు మాత్రమే ఆసియాకప్‌ విజేతగా నిలిచింది.

ఏ ఏడాది? విజేత ఎవరు?

1984 (ఆతిథ్యం: యూఏఈ): విజేత-ఇండియా, రన్నరప్‌-శ్రీలంక

1986 (శ్రీలంక): విజేత-శ్రీలంక, రన్నరప్‌ - పాకిస్థాన్‌

1988 (బంగ్లాదేశ్‌): విజేత-ఇండియా, రన్నరప్‌-శ్రీలంక

1990/91 (ఇండియా): విజేత - ఇండియా, రన్నరప్‌- శ్రీలంక

1995(యూఏఈ): విజేత- ఇండియా, రన్నరప్‌-శ్రీలంక

1997(శ్రీలంక): విజేత - శ్రీలంక, రన్నరప్‌ -ఇండియా

2000 (బంగ్లాదేశ్‌): విజేత- పాకిస్థాన్‌, రన్నరప్‌-శ్రీలంక

2004(శ్రీలంక): విజేత - శ్రీలంక, రన్నరప్‌-ఇండియా

2008(పాకిస్థాన్‌): విజేత-శ్రీలంక, రన్నరప్‌-ఇండియా

2010(శ్రీలంక): విజేత-ఇండియా, రన్నరప్‌-శ్రీలంక

2012(బంగ్లాదేశ్‌): విజేత-పాకిస్థాన్‌, రన్నరప్‌- బంగ్లాదేశ్‌

2014(బంగ్లాదేశ్‌): విజేత-శ్రీలంక, రన్నరప్‌-పాకిస్థాన్‌

2016(బంగ్లాదేశ్‌): విజేత-ఇండియా, రన్నరప్‌-బంగ్లాదేశ్‌

2018(యూఏఈ): విజేత-ఇండియా, రన్నరప్‌-బంగ్లాదేశ్‌

WhatsApp channel

సంబంధిత కథనం