AB de Villiers on Kohli century: కోహ్లి సెంచరీపై డివిలియర్స్ పోస్ట్ వైరల్.. అనుష్క రియాక్షన్ ఇదీ
09 September 2022, 11:40 IST
- AB de Villiers on Kohli century: కోహ్లి సెంచరీపై అతని బెస్ట్ ఫ్రెండ్ డివిలియర్స్ చేసిన పోస్ట్.. దానికి విరాట్, అనుష్క రియాక్షన్ వైరల్‌గా మారాయి. ఇంతకీ అతనేమన్నాడు?
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, ఏబీ డివిలియర్స్
AB de Villiers on Kohli century: విరాట్ కోహ్లి ఆసియాకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై చేసిన సెంచరీ క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. సుమారు మూడేళ్ల తర్వాత విరాట్ మూడంకెల స్కోరు అందుకున్నాడు. అయితే ఈ సెంచరీపై ఎవరి రియాక్షన్ ఎలా ఉన్నా.. అతని బెస్ట్ ఫ్రెండ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ చేసిన పోస్ట్.. దానికి విరాట్, అనుష్క ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది.
ఐపీఎల్‌లో పదేళ్ల పాటు కలిసి ఆడిన కోహ్లి, డివిలియర్స్ స్కూల్ ఫ్రెండ్స్‌లాగా మారిపోయారు. ఎప్పుడూ ఒకరి సక్సెస్‌ను మరొకరు ఎంజాయ్ చేస్తారు. తాజాగా కోహ్లి 1020 రోజుల నిరీక్షణకు తెరదించుతూ చేసిన సెంచరీపై ఏబీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. ఇందులో అతను షేర్ చేసిన ఫొటో ఫ్యాన్స్‌తోపాటు విరాట్, అనుష్క జోడీని కూడా బాగా ఆకర్షించింది.
ఏబీ, విరాట్.. స్కూటర్‌పై రయ్.. రయ్..
ఈ పోస్ట్ కోసం ఏబీ ఎప్పటిదో ఫొటోషూట్‌కు సంబంధించిన ఓ పిక్‌ను షేర్ చేశాడు. ఇద్దరూ కలిసి ఆర్సీబీకి ఆడుతున్న రోజుల్లో ఫొటోషూట్ కోసం స్కూటర్‌పై కూర్చున్న ఫొటో అది. డివిలియర్స్ రైడర్ సీట్లో, విరాట్ కోహ్లి సైడ్‌కారులో కూర్చోవడం ఇందులో చూడొచ్చు.
ఇప్పటి వరకూ ఈ ఫొటో ఉన్నట్లు చాలా మందికి తెలియదు. ఈ ఫొటోను షేర్ చేస్తూ ఏబీ పెట్టిన క్యాప్షన్ కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. "ఇవాళ చేసిన ఈ సెంచరీతో ఈ మెమరీని మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నా. బాగా ఆడావు మై ఫ్రెండ్. ఇంకా చాలా రాబోతున్నాయి" అని డివిలియర్స్ ఆ ఫొటోకు క్యాప్షన్ ఉంచాడు.
విరాట్, అనుష్క రియాక్షన్ ఇదీ
ఏబీ చేసిన ఈ పోస్ట్‌కు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ రియాక్టయ్యారు. విరాట్ రెండు కామెంట్స్ చేశాడు. మొదటి దాంట్లో తాను బిగ్గరగా నవ్వుతున్నట్లుగా హ.. హ.. హ అంటూ కామెంట్ చేయగా.. మరో దాంట్లో థ్యాంక్స్ బిస్కెట్.. లవ్ యూ అని అనడం విశేషం. అటు అనుష్క మాత్రం ఈ పోస్ట్ చేసి షాక్ తిన్నట్లు కనిపిస్తోంది. ఆమె ఓ మై గాడ్ అంటూ కామెంట్ చేసింది.
ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి చెలరేగిపోయిన విషయం తెలిసిందే. అతడు కేవలం 53 బాల్స్‌లోనే సెంచరీ చేశాడు. అంతేకాదు కేవలం 61 బాల్స్‌లో 122 రన్స్‌తో టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఇండియన్ ప్లేయర్‌గా రోహిత్ రికార్డును బ్రేక్ చేశాడు. టీ20ల్లో విరాట్‌కు ఇదే తొలి సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 71వ ఇంటర్నేషనల్ సెంచరీ. దీంతో అత్యధిక సెంచరీల్లో రికీ పాంటింగ్ రికార్డును సమం చేస్తూ.. సచిన్ (100 సెంచరీలు) తర్వాత రెండోస్థానంలో నిలిచాడు.