Virat Kohli Farm House: ఖరీదైన ఫామ్‌ హౌజ్‌ కొన్న విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ-virat kohli farm house in alibaug cost around 20 crores ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Farm House: ఖరీదైన ఫామ్‌ హౌజ్‌ కొన్న విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ

Virat Kohli Farm House: ఖరీదైన ఫామ్‌ హౌజ్‌ కొన్న విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ

Hari Prasad S HT Telugu
Sep 02, 2022 10:40 AM IST

Virat Kohli Farm House: ఖరీదైన ఫామ్‌ హౌజ్‌ కొన్నారు సెలబ్రిటీ జంట విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ. దీనికోసం వాళ్లు ఖర్చు చేసిన మొత్తం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

<p>విరాట్ కోహ్లి, అనుష్క శర్మ</p>
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ (Twitter)

Virat Kohli Farm House: మహారాష్ట్రలోని అలీబాగ్‌ తెలుసు కదా. సముద్ర తీరంలో ఉండే చిన్న టౌన్‌ ఇది. కానీ దీని చుట్టు పక్కల మొత్తం బాలీవుడ్‌ సెలబ్రిటీల ఫామ్‌ హౌజ్‌లే కనిపిస్తాయి. తాజాగా ఆ సెలబ్రిటీల లిస్ట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ కూడా చేరారు. వీళ్లు కూడా ఈ మధ్యే అలీబాగ్‌లో ఓ ఫామ్‌ హౌజ్‌ కొన్నారు.

yearly horoscope entry point

ఈటైమ్స్‌లో వచ్చిన రిపోర్ట్‌ ప్రకారం.. గణేష్ చతుర్థి సందర్భంగా ఈ సెలబ్రిటీ జంట ఖరీదైన ఫామ్‌ హౌజ్‌ను సొంతం చేసుకుంది. అలీబాగ్‌ దగ్గర్లోని జిరాద్ అనే గ్రామంలో 8 ఎకరాల భూమిని వీళ్లు కొన్నారు. దీని కోసం విరాట్‌, అనుష్క ఖర్చు చేసిన మొత్తం రూ.19.24 కోట్లు కావడం విశేషం. ఇది కాకుండా ప్రభుత్వానికి రూ.1.15 కోట్ల డిపాజిట్‌, రూ.3.35 లక్షల స్టాంప్‌ డ్యూటీ చెల్లించారు.

విరాట్‌ ప్రస్తుతం ఆసియా కప్‌ కోసం దుబాయ్‌లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ కొనుగోలు ప్రక్రియను అతని సోదరుడు వికాస్‌ కోహ్లి పూర్తి చేశాడు. ఇప్పుడీ స్థలంలో సముద్రాన్ని ఫేస్‌ చేస్తూ ఓ అందమైన బిల్డింగ్‌ నిర్మించనున్నారు. దీనికోసం కూడా ఈ జంట భారీగానే ఖర్చు చేయనుంది. ఈ బిల్డింగ్‌ అనుష్క టేస్ట్‌కు తగినట్లు ఉండనుంది.

గత నెలలో బాలీవుడ్‌ జంట రణ్‌వీర్‌, దీపికా కూడా అలీబాగ్‌లోనే ఇలాంటి ఫామ్‌ హౌజ్‌ కొని గృహప్రవేశం కూడా చేశారు. ఈ జంట ఫామ్‌హౌజ్‌ ఉన్నది మాప్‌గావ్‌ అనే ఓ ఊరికి దగ్గర్లో. ఇందులో 9 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఇల్లు కట్టుకున్నారు. ఈ అలీబాగ్‌లోనే షారుక్‌కు కూడా అందమైన ఫామ్‌ హౌజ్‌ ఉంది. ఇప్పుడు విరుష్క జోడీ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయింది.

అనుష్క శర్మ ప్రస్తుతం ఝులన్‌ గోస్వామి బయోపిక్‌ చక్డా ఎక్స్‌ప్రెస్‌లో నటిస్తోంది. దీనికోసం ఆమె ప్రత్యేకంగా క్రికెట్‌ ట్రైనింగ్‌ కూడా తీసుకుంటోంది. మెటర్నిటీ బ్రేక్‌ తీసుకున్న అనుష్క మూడేళ్ల తర్వాత ఈ మూవీతోనే సిల్వర్‌ స్క్రీన్‌పై మెరవనుంది. అటు ఝులన్‌ గోస్వామి ప్రస్తుతం ఇంగ్లండ్‌ టూర్‌లో ఉంది. ఈ టూర్‌ తర్వాత ఆమె క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనుంది.

Whats_app_banner