Deepika Padukone: దీపికా ప‌డుకోణ్‌ రివాల్వర్ గురిపెట్టింది ఎవరిపై - పఠాన్ ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌-deepika padukone first look unveiled in pathaan movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Deepika Padukone First Look Unveiled In Pathaan Movie

Deepika Padukone: దీపికా ప‌డుకోణ్‌ రివాల్వర్ గురిపెట్టింది ఎవరిపై - పఠాన్ ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌

HT Telugu Desk HT Telugu
Jul 25, 2022 01:41 PM IST

దాదాపు ఎనిమిదేళ్ల విరామం త‌ర్వాత షారుఖ్‌ఖాన్‌(shahrukh khan),దీపికా ప‌డుకోణ్( Deepika Padukone) జంట‌గా న‌టిస్తున్న బాలీవుడ్ చిత్రం ప‌ఠాన్‌(pathaan movie). యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో దీపికా ప‌డుకోణ్ ఫ‌స్ట్‌లుక్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు...

దీపికా ప‌డుకోణ్
దీపికా ప‌డుకోణ్ (twitter)

బాలీవుడ్‌లో షారుఖ్‌ఖాన్‌,దీపికా ప‌డుకోణ్ ల‌ది సూప‌ర్‌హిట్ కాంబినేష‌న్‌గా చెబుతుంటారు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఓం శాంతి ఓం,చెన్నైఎక్స్‌ప్రెస్‌,హ్యాపీ న్యూ ఇయ‌ర్ సినిమాలు భారీ వ‌సూళ్ల‌ను సాధించాయి. 2014లో విడుదలైన హ్యాపీ న్యూ ఇయర్ తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి సినిమా చేయలేదు.

లాంగ్ గ్యాప్ తర్వాత షారుఖ్ ఖాన్, దీపికా పడుకోణ్ కలయికలో చేస్తున్న చిత్రం ప‌ఠాన్‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి వార్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా ప‌డుకోణ్ ఫ‌స్ట్‌లుక్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. ఇందులో రివాల్వ‌ర్ గురిపెడుతూ సీరియ‌స్ లుక్‌లో దీపికా ప‌డుకోణ్ క‌నిపిస్తోంది. ఆమె నుదిటిపై ర‌క్తం చిందుతుండటం ఆస‌క్తిని పంచుతోంది.

ఈ సినిమాలో షారుఖ్‌ఖాన్ రా ఏంజెట్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. దీపికా ప‌డుకోణ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తుంద‌ని అంటున్నారు. యాక్ష‌న్ ప్ర‌ధానంగా ఆమె క్యారెక్ట‌ర్ డిఫ‌రెంట్‌గా సాగుతుందని తెలిసింది. ప‌ఠాన్‌లో జాన్ అబ్ర‌హ‌మ్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో స‌ల్మాన్‌ఖాన్ కీల‌క అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. జ‌న‌వ‌రి 25 2023న బాలీవుడ్ తో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమా రిలీజ్‌కానుంది. ప‌ఠాన్‌తో పాటు జ‌వాన్ సినిమాలో న‌టిస్తున్నాడు షారుఖ్‌ఖాన్‌. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్