Telugu News  /  Entertainment  /  Ranveer Singh May Go Nude Again In Front Of Camera This Time For Peta
న్యూడ్ ఫొటో షూట్ లో రణ్‌వీర్‌ సింగ్‌
న్యూడ్ ఫొటో షూట్ లో రణ్‌వీర్‌ సింగ్‌

Ranveer Singh Nude Photoshoot: మళ్లీ న్యూడ్‌ ఫొటోషూట్‌ చేయనున్న రణ్‌వీర్‌!

05 August 2022, 15:16 ISTHT Telugu Desk
05 August 2022, 15:16 IST

Ranveer Singh Nude Photoshoot: బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ఒకసారి న్యూడ్‌ ఫొటోషూట్‌ చేసే విమర్శల పాలయ్యాడు. అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినా సరే ఇప్పుడతను మరో న్యూడ్‌ ఫొటోషూట్‌ చేయబోతున్నాడా?

బాలీవుడ్‌ నటుడు, దీపికా పదుకోన్‌ భర్త రణ్‌వీర్‌ సింగ్‌ ఈ మధ్య పేపర్‌ అనే ఇంటర్నేషనల్ మ్యాగజైన్‌ కోసం పూర్తి నగ్నంగా ఓ ఫొటోషూట్‌ చేసిన సంగతి తెలుసు కదా. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఫొటోలను అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా.. కొంతమంది అతని బోల్డ్‌నెస్‌ను మెచ్చుకున్నారు. చాలా మంది విమర్శించారు. ఇంకొందరు పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదులు కూడా చేశారు. మరికొందరు అతనికి బట్టలు దానం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ న్యూడ్‌ ఫొటోషూట్‌ దుమారమే ఇంకా పూర్తిగా తగ్గలేదు. అప్పుడే రణ్‌వీర్‌ మరోసారి ఒంటిపై నూలిపోగు లేకుండా కెమెరా ముందు నిలబడటానికి రెడీ అవుతున్నాడని సమాచారం. ఈసారి ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆప్ యానిమల్‌ (పెటా) ఇండియా తమకోసం న్యూడ్‌ ఫొటోషూట్‌ చేయాలని రణ్‌వీర్‌కు లేఖ రాసింది. శాకాహారాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో తాము చేపట్టబోయే ప్రచారం కోసం నగ్నంగా ఫొటోషూట్‌ చేయాలని కోరింది.

"పెటా ఇండియా నుంచి మీకు గ్రీటింగ్స్‌. పెటా దేశంలో అందరికీ తెలిసిన యానిమల్‌ రైట్స్‌ గ్రూప్‌. 20 లక్షల మంది సభ్యులు, సపోర్టర్లు ఉన్నారు. మేము నీ పేపర్‌ మ్యాగజైన్‌ ఫొటోషూట్‌ చూశాము. మాకోసం కూడా నువ్వు ఇలాగే చేస్తావని ఆశిస్తున్నాము" అని ఆ లేఖలో రణ్‌వీర్‌ను పెటా కోరింది. అన్ని జంతువులకూ ఒకే విధమైన భాగాలు ఉంటాయి.. శాకాహారిగా మారండి అన్న నినాదంతో మేము చేస్తున్న ప్రచారానికి న్యూడ్‌ ఫొటోషూట్‌ చేయాలని విజ్ఞప్తి చేసింది.

దీనిపై రణ్‌వీర్ సింగ్‌ ఇంకా స్పందించలేదు. ఇప్పటికే పేపర్‌ మ్యాగజైన్‌ కోసం చేసిన న్యూడ్‌ ఫొటోషూట్‌కు సంబంధించిన కేసులు నడుస్తున్నాయి. విమర్శలూ కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రణ్‌వీర్‌ మరోసారి కెమెరా ముందు తన ప్యాంట్‌ విప్పడానికి సాహసిస్తాడా అన్నది చూడాలి.