తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  పూజలో నూనె దీపం కన్నా నెయ్యి దీపం వెలిగిస్తే మంచిదని ఎందుకంటారు- నెయ్యి దీపానికి, నూనె దీపానికి తేడా ఏంటి?

పూజలో నూనె దీపం కన్నా నెయ్యి దీపం వెలిగిస్తే మంచిదని ఎందుకంటారు- నెయ్యి దీపానికి, నూనె దీపానికి తేడా ఏంటి?

Ramya Sri Marka HT Telugu

14 November 2024, 13:48 IST

google News
    • పూజలో దీపానికి ప్రత్యేక స్థానం ఉంది. నూనెతో వెలిగించే దీపం కన్నా నెయ్యితో వెలిగించే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందని నమ్ముతారు. అలా ఎందుకంటారు? నూనె దీపానికి, నెయ్యి దీపానికి ఉన్నా తేడా ఏంటి?
నెయ్యి దీపం ప్రాముఖ్యత
నెయ్యి దీపం ప్రాముఖ్యత

నెయ్యి దీపం ప్రాముఖ్యత

హిందూ ధర్మం ప్రకారం పూజలో దీపం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. దీపం అంటే వెలుతురికి రూపం. ఇది సంపూర్ణ అగ్నికి చిహ్నంగా చెబుతారు. 'తమసోమా జ్యోతిర్గమయ' అంటే దీపం మనల్ని చీకటి నుంచి వెలుగు వైపు నడిపిస్తుంది అని అర్థం. దీపం వెలిగించడం వల్ల శాంతిని కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇది దీపానికున్న గొప్పతనం. దీపం గురంచి పురాణాలు గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే దీపం వెలిగించే నూనె లేదా నెయ్యిని బట్టి కూడా దాని విశిష్టత పెరుగుతుంది. దీపం వెలిగించేందుకు నూనె లేదా నెయ్యిని మాత్రమే ఉపయోగించాలని అగ్ని పురాణం స్పష్టంగా పేర్కొంది. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం నూనెతో వెలిగించే దీపంతో పోలిస్తే నెయ్యితో వెలిగించే దీపం మంచిదని అంటారు. ఇలా ఎందుకంటారు? నూనె దీపానికి నెయ్యి దీపానికి ఉన్న తేడా ఏంటి తెలుసుకుందాం.

1. సాధారణంగా చాలా మంది దీపం

వెలిగించడానికి నూనెనే ఎక్కువగా వాడుతుంటారు. నూనెతో వెలిగించే దీపం ఎక్కువ సేపు వెలుగుతుంది. నెయ్యితో వెలిగించిన దీపం కొద్దిసేపు మాత్రమే వెలుగుతుంది.

2. నూనె దీపంతో పోలిస్తే చుట్టు పక్కల వాతావరణంలో ఉన్న సాత్విక ప్రకంపనలను ఆకర్షించే గుణాలు నెయ్యి దీపానికి ఎక్కువగా ఉంటాయి. నూనె దీపపు ప్రకంపనలు గరిష్టంగా 1 మీటరు వరకూ వ్యాపిస్తే నెయ్యి దీపపు ప్రకంపనలు స్వర్గం వరకూ ప్రాప్తిస్తాయని ఆధ్యాత్మిక శాస్రం చెబుతోంది.

3. దీపం వెలిగించనప్పడు నూనె దీపం నాసిరకం నాణ్యతతో కూడిన సూక్ష్మ కవచాన్ని ఉత్పత్తి చేస్తుంది. నెయ్యి దీపం నాణ్యతతో కూడిన కవచాన్ని ఏర్పరుస్తుంది.

4. నూనె దీపం నుంచి వెలువడే సూక్ష్మ పవనపుణ్యాలు ఆరాధకుడి మన: శక్తిని పెంపొందిస్తాయి. అదే నెయ్యి దీపం నుంచే వెలువడే పవనపుణ్యాలు ఆత్మ శక్తిని చైతన్యవంతం చేస్తాయి.

5. నూనె దీపపు సాత్వికత అది నిండుకున్న తర్వాత అరగంట మాత్రమే ఉంటుంది. నెయ్యి దీపం నుంచి వెలువడే సాత్వికత అది నిండుకున్న తర్వాత దాదాపు నాలుగు గంటలకు పైగా ప్రభావం చూపిస్తుంది.

6. కుండలి యోగ మార్గం ప్రకారం మానవుడిలలో ఏడు సూత్ర చక్కాలు లేదా శక్తి కేంద్రాలు ఉంటాయి. ఇవి శరీరం, మనస్సు, బుద్ధి సహా మనిషిలోకి ప్రతి అంశాన్ని ఆచరణాత్మకంగా ప్రభావితం చేస్తాయి. నూనె దీపం మూలాధార చక్రాన్ని, స్వాధిష్టాన చక్రాన్ని శుద్ధీకరణ చేస్తుంది. అలాగే నెయ్యి దీపం మణిపూర చక్రాన్ని, అనాహత చక్రాన్ని గణనీయంగా శుద్ధి చేస్తుంది.

7. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం మనిషిలో అన్నమయం కోశం( శరీరం), ప్రాణమయ కోశం(పంచప్రాణాలకు కీలకమైన గాలి మూలకం), మనోమయ కోశం(మనస్సు), విజ్ఞానమయ కోశం(బుద్ది), అనే కోశాలు ఉంటాయి. వీటిని మనిషిని రక్షించే సూక్ష్మ కోశాలుగా చెబుతుంటారు. మనం పూజలో వెలిగించే దీపాలు వీటిని కూడా ప్రభావితం చేస్తాయి. నూనెతో వెలిగించిన దీపం ప్రాణమయ కోశంలోని ప్రతికూల శక్తులను పెంచుతుంది. ఇది వ్యక్తిని నిర్వీర్యం చేస్తుంది. నెయ్యి దీపం సత్వ కణాలను బలపరుస్తుంది. ఫలితంగా వ్యక్తిలో శాంతి, స్థిరత్వం, సంతోషం వంటివి ఉత్పన్నమవుతాయి.

కనుక నూనె దీపం కన్నా నెయ్యి దీపం వెలిగిస్తే మంచదని పురాణాలు చెబుతున్నాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

టాపిక్

తదుపరి వ్యాసం