తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Feng Shui: పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఏవి ఎదురైతే శుభం కలుగుతుంది, ఏవి ఎదురైతే అశుభంగా భావించాలి?

Feng Shui: పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఏవి ఎదురైతే శుభం కలుగుతుంది, ఏవి ఎదురైతే అశుభంగా భావించాలి?

Ramya Sri Marka HT Telugu

25 November 2024, 7:25 IST

google News
    • Feng Shui: ఫెంగ్ షూయి ప్రకారం బయటకు వెళ్లేటప్పుడు కొన్ని ఎదురవడం శుభ సూచకం.పని మీద వెళుతున్నప్పుడు ఇవి ఎదురైతే వెళ్లిన పని కచ్చితంగా జరుగుతుందని, అదృష్టం కలిసి వస్తుందని అర్థం.
పని మీద బయటకు వెళుతున్నప్పుడు ఏం ఎదురైతే మంచిది
పని మీద బయటకు వెళుతున్నప్పుడు ఏం ఎదురైతే మంచిది

పని మీద బయటకు వెళుతున్నప్పుడు ఏం ఎదురైతే మంచిది

హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు శుభ సమయం కోసం వేచి చూడాలి. పూర్వకాలంలో కూడా వీటిని పాటిస్తూ వస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు మనకు ఎదురయ్యే కొన్ని సంకేతాలు మనకు శుభ, అశుభ ఫలితాలు కలిగిస్తాయని పెద్దలు చెబుతుంటారు. ఫెంగ్ షూయి ప్రకారం కూడా ఇది నిజమేనట శకునాలను మనం హెచ్చరికలుగా భావించాలట. మనం పని మీద బయటకు వెళ్తున్నప్పడు మన భవిష్యత్తు గురించి, పరిస్థితుల గురించి ప్రకృతి మనకు కొన్ని సంకేతాలను అందిస్తుందట. దైనందిన జీవితం గురించి ప్రకృతి ఇచ్చిన కొన్ని సందేశాలను బట్టి శుభ, అశుభ శకునాలను గుర్తించవచ్చనీ, బయటకు వెళ్తున్నప్పుడు కొన్ని ఎదురవడం అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని, మరి కొన్నింటిని చూడటం ప్రమాదానికి సంకేతమని శకున శాస్త్రం కూడా చెబుతోంది.

మంచి చెడు, శకునాలకు సూచించడానికి మన చుట్టూ ఉండే వ్యక్తులు, జంతువులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. బయటకు వెళ్తున్నప్పడు మనకు ఎదురయ్యే పరిస్థితులు, సంఘటనలు ఆకస్మికంగా మాత్రమే జరగవు. ప్రతి ఒక్కటి లోతైన అర్థాలను కలిగి ఉంటాయి. కొన్ని సార్లు ఇవి ప్రకృతి మనకు ఇచ్చే సంకేతంగా, హెచ్చరికగా భావించాల్సి ఉంటుందని ఫెంగ్ షూయి వివరిస్తోంది. పని మీద బయటకు వెళ్తున్నప్పడు ఏవి ఎదురైతే శుభం, ఏవి ఎదురైతే హెచ్చరికగా భావించాలో తెలుసుకుందాం.

* ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు వివాహిత స్త్రీ కనిపిస్తే శుభసూచకం.ఇది రాబోయే విజయాన్ని మీకు సూచిస్తుందని అర్థం.

* బయటకు వెళుతున్నప్పుడు ఆవు ఎదురుగా వచ్చినా కూడా అది శుభసూచకమేనని పురాణాలు చెబుతున్నాయి. ఫెంగ్ షూయి ప్రకారం ఇది కూడా మీరు వెళ్లిన పని విజయవంతంగా పూర్తవుతుందని సూచిస్తున్నట్టే.

*బయటకు వెళ్లేందుకు బయలుదేరుతున్నప్పుడు డబ్బు కింద పడిపోతే అది అశుభ సూచకంగా భావించాలి. ఇలా జరగడం ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది.

* బయటకు రాగానే ఇంటి ముందుకు బిచ్చగాడు రావడం కూడా శుభ సూచకమే అని ఫెంగ్ షూయి వివరిస్తుంది. ఇది రాబోయే ఆర్థిక లాభాలు, అప్పుల చెల్లింపును సూచిస్తుంది.

* ఉదయాన్నే లేవగానే ముంగీస కనిపించడం కూడా శుభ సూచకమే. ఇది సంపద సముపార్జనకు సంకేతంగా పరిగణించాలి.

* బయటకు వెళ్లేటప్పుడు బెల్లం లేదా స్వీట్లను తీసుకెళ్లడం కూడా మీరు ఊహించని లాభాలను వస్తాయని సూచిస్తుంది.

* పెళ్లి చూపులు లేదా పెళ్లి సంబంధాల విషయంలో బయటకు వెళుతున్నప్పడు నలుగురు కన్య స్త్రీలు మీకు ఎదురవడం కూడా మంచి శకునమే. ఇలా జరిగితే మీ కొడుకు లేదా కుమార్తెకు వివాహం జరుగుతుందనీ, వారి వైవాహిక జీవితం బాగుటుందని అర్థం.

* ఆర్థిక కష్టాల సమయంలో పక్షులు మీపై రెట్ట వేస్తాయి. ఇది రాబోయే ఆర్థిక పతనాన్ని సూచిస్తుంది. అలాగే ఇది మీ అదృష్టాన్ని మలుపు తిప్పుతుందని అర్థం.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం