తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Diwali 2023 : మీ రాశి ఏంటి? దీపావళికి మీరు ఏ రంగు దుస్తులు ధరించాలి?

Diwali 2023 : మీ రాశి ఏంటి? దీపావళికి మీరు ఏ రంగు దుస్తులు ధరించాలి?

Anand Sai HT Telugu

11 November 2023, 14:37 IST

google News
    • Deepavali Colours : దీపావళి పండుగను అత్యంత పవిత్రంగా నిర్వహిస్తారు. ఈరోజున మీరు వేసుకునే బట్టలు కూడా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఏ రంగు దుస్తులను ఏ రాశి వారు ధరించాలో చూడండి.
దీపావళి
దీపావళి

దీపావళి

దీపావళి అంటే కొత్త వెలుగులు. దీపాల పండుగ రోజు ఇళ్లు అంతా దీపాలతో అలంకరించి కొత్త బట్టలు వేసుకుని పూజలు చేస్తారు. మన దేశంలో ఎక్కువ మంది సెలబ్రేట్‌ చేసుకునే పండుగ దీపావళి. ఈ పండుగకు కొత్త బట్టలు వేసుకోవడం మన ఆచారం. పండుగ రోజు కొత్త బట్టలు ఎవరైనా వేసుకుంటారు, కానీ ఆ పండుగకు మీ రాశి బలం ఎలా ఉంటుంది, ఏ రంగు దుస్తులు ధరిస్తే మీకు కలిసి వస్తుందని తెలుసుకోవాలి. దాని ప్రభావం మీ భవిష్యత్తుపై ఎలా ఉంటుంది. ఇవన్నీ చూసుకుని మన పండుగకు బట్టలు ధరిస్తే.. మీ జీవితంలోకి కూడా కొత్త వెలుగులు వస్తాయని పండితులు అంటున్నారు. ఈ దీపాల పండుగకు ముఖ్యంగా మహిళలు వారి రాశిని బట్టి ఎలాంటి దుస్తులు ధరించాలో చూద్దాం.

లేటెస్ట్ ఫోటోలు

ఈ నెలంతా ఈ రాశుల వారికి శుభప్రదం.. మెండుగా డబ్బు, పురోగతి, సంతోషం!

Dec 03, 2024, 04:46 PM

ఈ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం- ఇతరులు ఈర్ష పడే విధంగా ఎదుగుతారు! డబ్బుతో పాటు సంతోషం..

Dec 03, 2024, 05:35 AM

మరో 10 రోజులు ఈ మూడు రాశుల వారికి ఎక్కువగా లక్.. ధనలాభం, గౌరవం దక్కుతాయి!

Dec 02, 2024, 09:49 PM

శని సంచారంతో వీరి ఊహలు నిజమవుతాయి, అతిగా ఆలోచించడం మానుకోండి!

Dec 02, 2024, 01:11 PM

Nava Panchama Yogam: నవపంచమ యోగం.. ఈ మూడు రాశుల వారికి అధిక ధన లాభం

Dec 02, 2024, 12:02 PM

గజలక్ష్మీ రాజయోగంతో వచ్చే ఏడాది ఈ రాశులవారి అప్పులు తీరిపోతాయి, ఆర్థిక కష్టాలు దూరం!

Dec 02, 2024, 10:27 AM

మేషం : మేషరాశి వ్యక్తులకు ధైర్యం, శక్తివంతమైన స్వభావం ఉంటుంది. వారి వ్యక్తిత్వాన్ని హైలైట్ చేసే ముదురు ఎరుపు, బంగారు రంగు అనార్కలి సూట్ ధరించడం మంచిది.

వృషభం : వృషభ రాశి వారు సుఖం, విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. ఈ రాశి మహిళలు పచ్చ లేదా మెరూన్ వంటి రంగులలో క్లాసిక్ సిల్క్ చీరను ధరించడం శుభప్రదం. బంగారు హారము మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.

మిథునం : ఈ రాశి వ్యక్తులు విభిన్నత, కమ్యూనికేషన్‌ను ఆనందిస్తారు. రంగురంగుల లెహంగా చోలీ వారికి సరైనది. ఇది ఆ స్త్రీ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.

కర్కాటకం : కర్కాటక రాశివారు ఇంటికి, కుటుంబానికి ప్రాధాన్యతనిస్తారు. చిన్న మోటిఫ్‌లు, మ్యాచింగ్ బ్లౌజ్‌తో కూడిన అందమైన బనారసీ సిల్క్ చీరను ధరించండి. సరిపోలే లాకెట్ ధరించడం మర్చిపోవద్దు.

సింహం : ఈ రాశి వాళ్లు గొప్పతనాన్ని, విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడుతారు. రాయల్ బ్లూ లేదా డార్క్ మెరూన్‌లో రాయల్ వెల్వెట్ సూట్ ధరించండి.

కన్య : కన్య రాశివారు సూక్ష్మంగా, వివరాలకు ప్రాధాన్యతనిస్తారు. మృదువైన పాస్టెల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చికంకారి చీరను ధరించండి. వెండి నగలు దీనికి బాగా సరిపోతాయి.

తుల : తుల రాశి వారు సమతుల్యత, అందాన్ని ఆస్వాదిస్తారు. పింక్, లావెండర్ షేడ్స్‌తో కూడిన అందమైన, ఆకర్షణీయమైన అనార్కలి గౌను ధరించడం మంచిది.

వృశ్చికం : వృశ్చికరాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ముదురు ఎరుపు లేదా నలుపు రంగుతో అలంకరించబడిన చీరను ఎంచుకోండి. ఆకర్షణీయమైన లుక్ కోసం ముక్కు ఉంగరం ధరించండి.

ధనుస్సు : అన్వేషణను ఇష్టపడే వ్యక్తులు ధనుస్సు రాశివారు. ప్రింట్ లెహంగా ఈ రాశి మహిళల వ్యక్తిత్వానికి సరిపోతుంది.

మకరం : వీరు సంప్రదాయాలను ఇష్టపడే వ్యక్తులు. ఆకుపచ్చ లేదా మెరూన్ రంగులో ఉన్న రిచ్, టైమ్‌లెస్ కంజీవరం చీర వారికి సరిపోతుంది.

కుంభం : మీరు కుంభ రాశికి చెందినవారైతే, మీరు ప్రత్యేకమైన, సృజనాత్మక ఫ్యాషన్‌ను ఇష్టపడతారు. సాంప్రదాయేతర రంగులు, ఇంకా కళాత్మకమైన ధోతీ శైలి దుస్తులను ధరించండి.

మీనం : మీన రాశివారు కళాత్మక స్వభావం కలిగి ఉంటారు. సీ గ్రీన్ లేదా లైట్ బ్లూ కలర్ అనార్కలి సూట్ వారికి సూట్ అవుతుంది.

తదుపరి వ్యాసం