Kanya puja: కన్యా పూజ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి
08 October 2024, 14:00 IST
- Kanya puja: నవరాత్రులలో చాలా మంది తప్పనిసరిగా కన్యా పూజ చేస్తారు. బాలికలను ఇంటికి పిలిచి వారిని పూజించి దక్షిణ ఇస్తారు. ఇలా చేయడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఐశ్వర్యం, ధనం, కీర్తికి కొదువ ఉండదు. ఈ ఏడాది కన్యా పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం.
కన్యా పూజ నియమాలు
నవరాత్రి అష్టమి, నవమి తిథిలలో కన్యా పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఆడపిల్లలను గౌరవంగా పిలిచి పూజలు చేసి వారికి భోజనం పెడతారు. కన్యా పూజ తర్వాతనే నవరాత్రి పూజలు లేదా ఉపవాసం పూర్తవుతుందని నమ్ముతారు.
నవరాత్రులలో చేసే కన్యా పూజ ద్వారా దుర్గాదేవి సంతోషిస్తుందని విశ్వసిస్తారు. హిందూ మతం విశ్వాసాల ప్రకారం నవరాత్రులలో కన్యాను పూజించడం ద్వారా, దుర్గామాత అనుగ్రహం లభిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. కన్యా పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు లేదా విషయాలను గుర్తుంచుకోవాలి. అమ్మాయిని పూజించేటప్పుడు మీరు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి అనేది తెలుసుకుందాం.
1. కన్యాపూజ సమయంలో అమ్మాయిలకు పువ్వులు ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. అమ్మాయిలకు గులాబీ, చంపా, మొగ్రా, బంతి పూలు, మందారం మొదలైన పూలను ఇవ్వవచ్చు.
2. బాలికలకు పూజ చేసే ముందు వారి పాదాలు కడిగి తుడిచి ఒక పీట మీద కూర్చోబెట్టాలి. ఆచారానుసారం పూజ చేసి వారికి బొట్టు పెట్టాలి. ఆడపిల్లలకు పండ్లు ఇచ్చి పూజించాలి. పండు పుల్లగా ఉండకూడదని గుర్తుంచుకోండి.
3. కన్యా పూజ సమయంలో ఆడపిల్లలకు ఖీర్ లేదా హల్వా వంటివి తినిపించాలి. ఇలా చేయడం వల్ల దుర్గామాత ప్రసన్నురాలవుతారని నమ్మకం. అష్టమి నాడు ఇంట్లో కూర్చొని మహాగౌరి ప్రత్యేక మహాపూజ చేయండి. నవమి నాడు ఇంట్లో కూర్చొని సిద్ధిధాత్రికి ప్రత్యేక మహాపూజ చేయండి.
4. ఆడపిల్లలకు బట్టలు కానుకగా ఇవ్వడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మీరు మీ సామర్థ్యం ప్రకారం కాగితం లేదా రిబ్బన్ మొదలైనవి కూడా ఇవ్వవచ్చు. బాలికలను పూజించే ముందు వారికి ఎరుపు రంగు దుస్తులు బహుకరించాలి. లేదంటే ఎరుపు రంగు చునారి వారికి అందించాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన రంగు ఇది. అందుకే దుర్గాదేవి ఆశీస్సులు కోరుతూ చేసే కన్యా పూజలో బాలికలకు వీటిని ఇవ్వడం చాలా మంచిది.
5. అమ్మాయిలకు మేకప్ వస్తువులు ఇవ్వడం చాలా శుభప్రదంగా భావిస్తారు. నవరాత్రులలో ఆడపిల్లలను తల్లి దుర్గా స్వరూపంగా భావిస్తారు.
6. కన్యాపూజ సమయంలో ఆడపిల్లకు భోజనం పెట్టి మీ సామర్థ్యం మేరకు దక్షిణ ఇవ్వాలి. నవరాత్రులలో కన్యను పూజించిన వారికి ధనం, జ్ఞానం, విద్య, ఐశ్వర్యం, కీర్తి, సంపద కలుగుతుందని నమ్ముతారు. చిన్న పిల్లలను పూజించడం వల్ల అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయని నమ్ముతారు.
7. కన్యాపూజ ఎల్లప్పుడూ శుభ సమయంలో మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి. రాహుకాలం, భద్ర పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
8. బాలికలను పూజించేటప్పుడు, బాలికల వయస్సు 2-10 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే వారి సంఖ్య 9 ఉండాలని గుర్తుంచుకోండి. అమ్మాయిలతో పాటు ఒక అబ్బాయిని కూడా ఆహ్వానించాలి. పిల్లవాడిని భైరవ రూపంగా భావిస్తారు. పూజ తర్వాత తప్పనిసరిగా వారి ఆశీర్వాదం తీసుకోవాలి.
అష్టమి, నవమి ఎప్పుడు?
జ్యోతిషశాస్త్ర గణనల ప్రకారం 11 అక్టోబర్ 2024న నవరాత్రి సమయంలో అష్టమి, నవమి ఒకే రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది నవమి తిథి తగ్గి చతుర్థి తిథి పెరిగింది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.