Temple flag: దేవాలయాల మీద జెండా ఎందుకు ఉంటుందో తెలుసా?
29 January 2024, 17:02 IST
- ఎక్కడ చూసినా దేవాలయం మీద కాషాయ రంగు జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంది. అసలు గుడి మీద జెండా ఎందుకు పెడతారో తెలుసా? దీన్ని ఎగురవేయడం వెనుక కారణం ఏమిటంటే..
ఆలయం మీద జెండా ఎందుకు ఎగురవేస్తారు?
మనం గుడికి వెళ్ళినప్పుడు గోపురం మీద జెండా కనిపిస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. అది చిన్న గుడి అయినా గొప్ప పుణ్య క్షేత్రం అయినా కూడా తప్పనిసరిగా జెండా ఉంటుంది. అయితే అది అక్కడ ఎందుకు పెడతారు అనే విషయం చాలా మందికి తెలియదు. దీన్ని కొందరు ధ్వజ అనుకుంటే మరికొందరు మత జెండా అనుకుంటారు. ఆలయం పై భాగంలో ఇలా జెండా ఎందుకు ఎగురవేస్తారు అనే తెలుసుకుందాం.
దేవతకి ప్రాతినిథ్యం
దేవాలయం పైభాగంలో జెండా లేదా ధ్వజాన్ని కలిగి ఉండటానికి ప్రధాన కారణాలలో ఒకటి నిర్ధిష్ట ఆలయంలో పూజించబడే దేవుని ఉనికిని సూచిస్తుంది. జెండా ఆలయ పవిత్రతను చాటుతుంది. ఇది ఆలయంలోని దేవుడు ఎవరో భక్తులకి తెలియజేయడమే కాకుండా ఆ ఆలయంలోని దైవిక, ఆధ్యాత్మిక శక్తులని కూడా సూచిస్తుంది. జెండాపై రంగులు, చిహ్నాలు గర్భగుడిలో ఉన్న దేవతతో సమానంగా చూస్తారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులకి ఆ జెండాను చూడగానే లోపల ఉన్న దివ్య శక్తి గుర్తుకు వస్తుంది. ఆర్జనుడు తన రథంపై కపి ధ్వజాన్ని పెట్టాడు. అది హనుమంతుని శక్తి, ఆశీర్వాదాలని సూచిస్తుంది.
విజయానికి చిహ్నం
భారతదేశంలోని హిందూ మతంలో మాత్రమే కాదు అనేక సంస్కృతులలో జెండాను ఎగురవేయడం విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఎగువన ఉన్న జెండా కేవలం అలంకార వస్తువు మాత్రమే కాదు విజయానికి చిహ్నం. ఆలయం పైన జెండా రెపరెపలాడటం అనేది అజ్ఞానం, అహంకారం, అసూయ, కోరికలకు వ్యతిరేకంగా ఆధ్యాత్మిక పోరాటాలు గెలిచిన పవిత్ర స్థలానికి ప్రతీకగా నమ్ముతారు. రెపరెపలాడే ఈ జెండా భక్తులకి పవిత్రమైన స్థలాలు, ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడు పరధ్యానాలని ఎలా అధిగమించాలో తెలుపుతుంది.
కాషాయ రంగు జెండా ప్రాముఖ్యత
చాలా దేవాలయాల మీద ఎక్కువగా కాషాయ రంగు జెండా కనిపిస్తుంది. ఈ రంగు జెండా పరిత్యాగానికి చిహ్నం. నారింజ రంగు తరచుగా సాధువులు, రుషులు, ప్రాపంచిక కోరికలు త్యజించిన వ్యక్తులతో ముడి పడి ఉంటుంది. కాషాయ రంగు జెండా దీనికి గుర్తుగా ఉంటుంది. అహాన్ని దైవానికి సమర్పించుకోవడానికి చిహ్నంగా మారుతుంది. ఎగురుతున్న కాషాయ రంగు జెండా మానవుల వ్యక్తిగత కోరికలు, అహంకారాన్ని అధిగమించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. నిస్వార్థమైన జీవిత మార్గంలో నడవాలని సూచిస్తుంది.
భక్తులకి అనుసంధానం
దేవాలయంపై ఉన్న జెండా, ధ్వజ స్తంభం పై ఉండే జెండా భూమికి, విశ్వాసానికి మధ్య ఉన్న సంబంధాన్ని చెబుతుంది. ధ్వజ స్తంభం అక్షం ముండిని సూచిస్తుంది. ఇది భూసంబంధమైన, పాతాళానికి సంబంధించిన వివిధ రంగాలని కలిగే విశ్వ అక్షం. స్వర్గం నుంచి భూమి మీద నివసించే భక్తుల మీద దైవక శక్తిని ఆశీర్వాదాలని ఇస్తుంది.
దిశని సూచిస్తుంది
కొంతమంది పెద్దలు చెప్పే దాని ప్రకారం ఆలయంపైన ఉన్న ధ్వజ స్తంభాలు ముందు ఆలయానికి సూచీకలుగా పని చేస్తాయి. పురాతన కాలంలో దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఈ జెండాలే దిశానిర్దేశం చేసేవి. దేవాలయాలు చాలా దూరంగా ఉన్నాయని వాటిని గుర్తించేందుకు వీలుగా ఈ జెండాలు ఆలయం పైన ఎగురవేసేవారు.