తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Venus Transit: ఏడాది తర్వాత కుంభరాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకి జాక్ పాట్ తగిలినట్టే

Venus transit: ఏడాది తర్వాత కుంభరాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకి జాక్ పాట్ తగిలినట్టే

Gunti Soundarya HT Telugu

27 January 2024, 7:00 IST

google News
    • venus transit: శని అధిపతిగా ఉండే కుంభ రాశిలోకి శుక్ర గ్రహం సంచరించబోతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా మారనుంది. 
శని రాశిలోకి శుక్రుడు
శని రాశిలోకి శుక్రుడు

శని రాశిలోకి శుక్రుడు

Venus transit: నవగ్రహాలలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్ర గ్రహం. రాక్షసులకి అధిపతిగా శుక్రుడిని పరిగణిస్తారు. సూర్యునికి అతి దగ్గరగా ఉండే గ్రహం ఇది. శుక్రుడు కదలిక ఎప్పటికప్పుడు మారుతుంది. శుక్ర గ్రహ స్థానం బలంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు.

ఆనందం, శ్రేయస్సు, విలాసం, ప్రేమ, సంతోషానికి శుక్రుడు ప్రతీకగా ఉంటాడని చెప్తారు. శుక్ర స్థానం బలంగా ఉంటే దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది. శుక్రుడు మార్చి నెలలో శని అధిపతిగా ఉండే కుంభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అప్పటికే సూర్యుడు కూడా కుంభ రాశిలోకి కూర్చుని ఉంటాడు. దీని వల్ల సూర్యుడు, శని, శుక్రుడు ఒకే రాశిలోకి రావడం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది.

దాదాపు సంవత్సరం తర్వాత శుక్రుడు శని ఉంటున్న కుంభ రాశిలో సంచరించబోతున్నాడు. ఇది కొన్ని రాశులకి లాభదాయకంగా ఉంటుంది. మరికొన్ని రాశులకి మాత్రం కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. కుంభ రాశిలో శుక్ర శని కలయిక జరగనుంది. దీని ప్రభావం అన్ని రాశుల మీద పడబోతుంది. శుక్రుడు కుంభ రాశిలోకి వెళ్ళడం వల్ల ఏ రాశి జాతకులు లాభం పొందుతారో తెలుసుకుందాం.

తులా రాశి

శని సంచరిస్తున్న కుంభ రాశిలోకి శుక్రుడు వెళ్ళడం వల్ల తులా రాశి వారికి అదృష్టం తీసుకురాబోతుంది. శుక్రుడు తులా రరాశి నుంచి నాల్గవ ఇంట్లో సంచరిస్తాడు. దీని వల్ల ఈ రాశి వాళ్ళు పూర్వీకుల నుంచి ఆస్తిని పొందే అవకాశం ఉంది. అది మాత్రమే కాకుండా శుక్రుడు తులా రాశికి అధిపతి. ఫలితంగా వీరి మీద శుక్ర సంచారం శుభ ఫలితాలు ఇస్తుంది. శుక్రుడి ప్రభావంతో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలలో ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉంటారు.

వృషభ రాశి

కుంభ రాశిలో శుక్ర సంచారం వృషభ రాశి ప్రజలకి చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. వ్యాపారస్థులకి సమయం చఅనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆకస్మిక ధన లాభం పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. వ్యాపారస్తులు, కళలు, మీడియా, సినీ రంగానికి సంబంధించిన వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

కుంభ రాశి

శుక్రుడు ఈ రాశిలోకే ప్రవేశించడం వల్ల వీరికి అద్భుతమైన ప్రయోజనాలు పొందబోతున్నారు. విద్యార్థులకి ఇది మంచి సమయం. పరీక్షలు రాసే విద్యార్థులు మంచి మార్కులతో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం శృంగారభరితంగా ఉంటుంది. మీరు చాలా ఆత్మవిశ్వాసంతో మేలుగుతారు. ఒంటరిగా ఉంటున్న వ్యక్తులకి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. దైవ భక్తి పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వాళ్ళు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం