తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Trigrahi Yogam: శని రాశిలో మూడు గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్, పట్టిందల్లా బంగారమే

Trigrahi yogam: శని రాశిలో మూడు గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్, పట్టిందల్లా బంగారమే

Gunti Soundarya HT Telugu

16 February 2024, 12:57 IST

google News
    • Trigrahi yogam: శనికి అధిపతిగా ఉన్న కుంభ రాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు. ఫలితంగా ఒకే రాశిలో మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది. దీని వల్ల మేష రాశి నుంచి మీన రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. 
కుంభ రాశిలో మూడు గ్రహాల కలయిక
కుంభ రాశిలో మూడు గ్రహాల కలయిక (freepik)

కుంభ రాశిలో మూడు గ్రహాల కలయిక

Trigrahi yogam: ఫిబ్రవరిలో అనేక గ్రహాల కదలికలు కీలకంగా మారనున్నాయి. మాఘ శుక్ల పక్ష దశమి తిథి నాడు గ్రహాల రాకుమారుడు బుధుడు శని దేవుడి తొలి స్వక్షేత్రమైన మకరం నుంచి రెండవ స్వక్షేత్ర రాశి కుంభంలోకి ప్రవేశించబోతున్నాడు. మేథస్సు, తెలివితేటలు, జ్ఞానం, రచనా శక్తి, జర్నలిజం వంటి వాటికి బుధుడు కారకుడిగా భావిస్తారు. మార్చి 6వ తేదీ వరకు బుధుడు ఈ రాశిలోనే ఉంటాడు.

కుంభ రాశిలో ఇప్పటికే శని, గ్రహాల రాజు సూర్యుడు ఉన్నారు. సూర్యుడు, బుధుడు కలయికతో బుధాదిత్య రాజ యోగం ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలతో శని కూడా ఉండటం వల్ల శుభ ఫలితాలు కలగబోతున్నాయి. ఒకే రాశిలో మూడు గ్రహాలు కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఫలితంగా మేధో సామర్థ్యం విస్తరిస్తుంది. పత్రికా రంగానికి చెందిన వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి. పత్రిగా రంగ పరిశ్రమకి ఇది అనుకూలమైన సమయం. ఒకే రాశిలో మూడు గ్రహాల సంయోగం వల్ల మేష రాశి నుంచి మీన రాశి వరకు విస్తృత ప్రభావం పడుతుంది. ఎవరికి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూద్దాం.

మేష రాశి

ఆదాయ వనరులలో పురోగతి ఉంటుంది. అధ్యయన బోధనలో వృద్ధి కనిపిస్తుంది. తోబుట్టువులు, స్నేహితుల వల్ల కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య కారణాలు ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. సంపద, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

వృషభ రాశి

త్రిగ్రాహి యోగం ప్రభావంతో వృషభ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగాలు చేసే వారి పనికి ప్రశంసలు దక్కుతాయి. డబ్బుకు సంబంధించిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. కుటుంబ పనుల పట్ల ఆసక్తిగా ఉంటారు. వాహన సౌఖ్యం ఉంటుంది.

మిథునం

ఒకే రాశిలో శని, బుధుడు, సూర్యుడి వల్ల మిథున రాశి వారి మనో ధైర్యం మెరుగవుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. అధికారం, సమాజంలో గౌరవం పెరుగుతుంది. పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది. తోబుట్టువులు, స్నేహితుల సహకారం లభిస్తుంది.

కర్కాటకం

కుటుంబ పనులకు సంబంధించి మనసులో ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు చేసే వారికి ఇది అనుకూల సమయం. మూత్ర విసర్జన సంబంధించిన సమస్యల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలకు డబ్బు అధికంగాఖర్చు చేస్తారు.

సింహం

ఆర్థికంగా పురోభివృద్ది ఉంటుంది. రోజువారీ ఆదాయంలో మార్పులు ఉంటాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మేధో సామర్థ్యం పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ కార్యకలాపాలు సంతోషంగా నిర్వహించుకుంటారు.

కన్యా రాశి

అకస్మాత్తుగా మనోధైర్యం తగ్గుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలర్జీల వల్ల ఒత్తిడి ఎదుర్కొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో సన్నిహితులతో విభేదాలు తలెత్తుతాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

తులా రాశి

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మేథో శక్తి ఆధారంగా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సంతానం వైపు నుంచి శుభ వార్తలు వింటారు. దూర ప్రయాణాల ఖర్చులు పెరుగుతాయి.

వృశ్చికం

గృహంలో ఆనందం పెరుగుతుంది. స్థిరాస్తి పెరిగే అవకాశం ఉంది. నూతన ఆదాయ మార్గాలు తారసపడతాయి. వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ ఛాతీ లో అసౌకర్యంగా ఉంటుంది.

ధనుస్సు రాశి

జీవిత భాగస్వామి సహకారం పెరుగుతుంది. పనుల్లో అదృష్టం వెంటే ఉంటుంది. కష్టపడి పని చేస్తే ఫలితం పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోభివృద్ధి ఉంటుంది. రోజువారీ ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది.

మకరం

వాక్కు, వ్యాపార రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పనుల్లో పురోగతి కనిపిస్తుంది. దంత సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆర్థికంగా లాభపడతారు. మూత్ర సంబంధ వ్యాధులు ఒత్తిడిని కలిగిస్తాయి.

కుంభం

కుంభ రాశిలోనే మూడు గ్రహాల కలయిక జరగబోతుంది. ఫలితంగా ఈ రాశి వారికి మూడు గ్రహాల శుభ ప్రభావం పడుతుంది. చదువులో రాణిస్తారు. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. దాంపత్య సుఖం పొందుతారు. ఆరోగ్య కారణాల వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు.

మీనం

ఇల్లు వాహనంతో పాటు సంతోషంగా ఉండేందుకు అధికంగా ఖర్చు చేసే పరిస్థితులు తలెత్తుతాయి. చర్మ సంబంధిత సమస్యల వల్ల ఒత్తిడి ఉంటుంది. ప్రేమ సంబంధాలు కొద్దిగా సమస్యలు కలుగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడుతుంది.

తదుపరి వ్యాసం