మీ ఇంట్లో సంపద పెరగాలంటే భోజనం తిన్నాక ఈ తప్పులు చేయకండి-vastu tips to increase wealth in your home do not make these mistakes after eating ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  మీ ఇంట్లో సంపద పెరగాలంటే భోజనం తిన్నాక ఈ తప్పులు చేయకండి

మీ ఇంట్లో సంపద పెరగాలంటే భోజనం తిన్నాక ఈ తప్పులు చేయకండి

Feb 14, 2024, 07:24 PM IST Haritha Chappa
Feb 14, 2024, 07:22 PM , IST

  • Vastu Tips for Money: ఇంట్లో సంపద నిలవాలన్నా, పెరగాలన్నా... కొన్ని రకాల పనులు తప్పకుండా చేయండి. ముఖ్యంగా భోజనం తిన్నాక చేయకూడని పనులు కూడా ఉన్నాయి.

వాస్తు శాస్త్రంలో ఈ ఆహారం తినే పద్ధతిలో కొన్ని నియమాలు ఉన్నాయి.  వాస్తు శాస్త్రం ప్రకారం, ఆహారాన్ని వండేటప్పుడు, తినేటప్పుడు  సరైన దిశలో చేయాలి. సరైన దిశలో ఆహారం తీసుకోవడం వల్ల దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు. ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి. వాస్తు శాస్త్రంలో ఆహారానికి సంబంధించిన అనేక నియమాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. 

(1 / 5)

ఇంట్లో దక్షిణం వైపు స్టవ్ ను పెట్టి వంట చేయకూడదు. ఉత్తరం లేదా తూర్పు వైపు పెట్టి వండాలి. అంటే మీరు వండినప్పుడు మీరు చూపు తూర్పు లేదా ఉత్తరం వైపు చూసేలా ఉండాలి. ఇలా వంట చేయడం వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది. 

(2 / 5)

వంటగదిలో తాగునీరు ఉంచే చోట చీకటి ఉండకూడదు.  రాత్రిపూట కూడా లైట్లు ఉంచాలి. పెద్ద లైట్లు ఉంచలేకపోయినా చిన్న లైట్లు అయినా ఉంచాలి. లేదా నీటి పక్కనే దీపం వెలిగించడం చాలా ముఖ్యం. దీంతో  లక్ష్మి దేవి సంతోషిస్తుంది.

(3 / 5)

భోజనం తిన్నాక కొన్ని పనులు చేయకూడదు. వంటగదిని మురికిగా ఉంచవద్దు. ముఖ్యంగా రాత్రిపూట వంటగదిని మురికిగా ఉంచడం వల్ల వాస్తు దోషం వస్తుంది. దీంతో  లక్ష్మిదేవికి ఆగ్రహం వస్తుంది. రాత్రిపూట తినేసిన పాత్రలు వదిలేయడం వల్ల వాస్తు దోషం వస్తుంది. వెంటనే శుభ్రం చేసుకోవాలి.

(4 / 5)

చాలా మంది తిన్న తర్వాత ఆ పాత్రలో చేతులు కడుక్కుంటూ ఉంటారు. అలా చేయకూడదు. ప్లేట్‌లో చేతులు కడుక్కోవడం లక్ష్మీ దేవిని అసంతృప్తికి గురి చేస్తుంది. ఆహారాన్ని అగౌరవపరచినట్టు లక్ష్మీదేవి భావిస్తుంది. దీంతో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని నమ్ముతారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు