తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి

Today Rasi phalalu: నేటి రాశి ఫలాలు: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి

HT Telugu Desk HT Telugu

29 November 2024, 0:05 IST

google News
    • Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 29.11.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు: 29 నవంబర్ 2024
నేటి రాశి ఫలాలు: 29 నవంబర్ 2024 (Pixabay)

నేటి రాశి ఫలాలు: 29 నవంబర్ 2024

రాశిఫలాలు (నేటి రాశిఫలాలు) 29-11-2024

సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం, అయనము: దక్షిణాయనం,

మాసం: కార్తీకము, తిథి: బ.త్రయోదశి, వారం: శుక్రవారం, నక్షత్రం: స్వాతి

మేషం:

అనవసర ఖర్చులు పెడతారు. పొదుపు పాటించండి. శుభకార్య యత్నాలు చేపడతారు. మొహమాటంతో సమస్యలు ఎదుర్కొంటారు. వివాదాలు పరిష్కారమవుతాయి. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కలసివచ్చే రోజు. ఆందోళనలకు దూరంగా ఉండండి.

వృషభం:

ఆర్థిక ప్రగతి సాధిస్తారు. ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్య సమస్య తలెత్తవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వివాదాలు తలెత్తవచ్చు.

మిథునం:

శ్రమానంతర ఫలితం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. ఓర్పుతో వ్యవహరించండి.

కర్కాటకం:

ఆచితూచి అడుగేయండి. తొందరపాటు చర్యలు వద్దు. వ్యాపారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఘర్షణలకు తావు ఇవ్వవద్దు.

సింహం:

మీ ప్రతిభతో సమస్యలను పరిష్కరిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయం బాగుంటుంది. వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ చర్చించవద్దు. గొడవలకు దూరంగా ఉండండి. మాట అదుపులో ఉంచుకోండి. సహోద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు.

కన్య:

ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అంతా కలసివస్తుంది. రాబడి బాగుంటుంది. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. మనోధైర్యంతో వ్యవహరించండి. శుభకార్య యత్నాలు చేస్తారు. కష్టాల నుంచి గట్టెక్కుతారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

తుల:

అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. శుభసమాచారం అందుతుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టే యోచన చేస్తారు. అవరోధాలు తొలగుతాయి. పనిపై దృష్టి పెట్టండి. అశ్రద్ధ వద్దు. ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాలి.

వృశ్చికం:

ఆర్థికంగా బాగుంటుంది. అధికారుల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. నోరు అదుపులో ఉంచుకోండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండండి. భాగస్వాములతో గొడవలొద్దు.

ధనుస్సు:

స్వగృహంకోసం ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. అందరూ కలసివస్తారు. కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు. సంయమనంతో వ్యవహరించండి. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. కళాకారులకు, రాజకీయనాయకులకు కలసివస్తుంది.

మకరం:

కొత్తప్రయత్నాలు ఫలిస్తాయి. ఇబ్బందులు తొలగుతాయి. ఆదాయం బాగుంటుంది. పొదుపు చర్యలు చేపట్టండి. ఆత్మీయుల సహకారం అందుతుంది. ఈరోజు ఆనందంగా గడుపుతారు. అన్నింటా మీదే పైచేయిగా ఉంటుంది. తొందరపాటుగా వ్యవహరించవద్దు.

కుంభం:

ఉద్యోగులకు పదోన్నతి లభించవచ్చు. ఆర్థికపరిస్థితి బాగుంటుంది. వ్యాపారులకు కలసివస్తుంది. రాజకీయనాయకులు, కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మీకు గుర్తింపు లభిస్తుంది.

మీనం:

ఆర్థికంగా అంత బాగా ఉండదు. అనవసర ఖర్చులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. సమస్యలు తలెత్తుతాయి. అప్రమత్తంగా వ్యవహరించండి. ఘర్షణలకు దూరంగా ఉండండి. వివాదాల్లో తలదూర్చవద్దు. పనిపై శ్రద్ధ చూపండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం