తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dreams And Meanings: కలలో పులి కనిపిస్తే ప్రమాదకరమా? స్వప్న శాస్త్రం దీని గురించి ఏం చెబుతుంది

Dreams and Meanings: కలలో పులి కనిపిస్తే ప్రమాదకరమా? స్వప్న శాస్త్రం దీని గురించి ఏం చెబుతుంది

Ramya Sri Marka HT Telugu

14 November 2024, 20:45 IST

google News
    • Dreams and Meanings: పురాణాల్లో పులికి చాలా ప్రాముఖ్యత ఉంది. సాక్షాత్తు దుర్గాదేవి వాహనమైన పులిని సంరక్షణకు, సహజ శక్తికి ప్రతీకగా భావిస్తారు. మరి అలాంటి పులి కలలో కనిపిస్తే దానిని మంచిగా భావించాలా, లేదా ఏదైనా జరగకూడనిది జరగబోతుందని ఆందోళన చెందాలా.. ? తెలుసుకుందాం రండి.
కలలో పులి కనిపిస్తే అర్థం ఏంటి
కలలో పులి కనిపిస్తే అర్థం ఏంటి (istock)

కలలో పులి కనిపిస్తే అర్థం ఏంటి

ఆధ్మాత్మిక కథనాలను బట్టి చూస్తే చాలా దృఢమైన, శక్తివంతమైన జంతువు పులి.

ధ్యైర్యానికి, బలనికి సూచిక పులి అని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఆధ్మాత్మికంగా చూస్తే, సాక్షాత్తూ జగన్మాత దుర్గాదేవి పులిని వాహనంగా చేసుకున్నారు. క్రూరమైన జంతువు అయినప్పటికీ పురాణాల్లో చాలా చోట్ల పులికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. అలాంటి పులి కలలో కనిపిస్తే ప్రమాదమా.. లేక అదృష్టమా..? స్వప్న శాస్త్రం ప్రకారం కలలో పులి కనిపించడం దేన్ని సూచిస్తుంది.

దుర్గాదేవి పులి మీద ఆసీనమై ఉన్న ప్రతిమ లేదా చిత్రపటాన్ని చూసినపుడు శక్తికి ప్రతిరూపమైన అమ్మవారు, ధైర్యానికి ప్రతీక అయిన పులి ఒకింత కంగారు పుట్టిస్తారు. అంతటి క్రూర జంతువును తనకు వాహనంగా చేసుకోగలిగారంటే అమ్మవారి శక్తి ఏపాటిదోననే ఆలోచన కల్గుతుంది. సాధారణంగా ఈ రూపాన్ని చెడుపై చేసే పోరాటం సమయంలో బయటపెడతారు.

ఇంకా నిశితంగా పరిశీలిస్తే, పులిని కేవలం జంతువులా మాత్రమే చూడకుండా దృఢమైనదిగా, సంరక్షించే జంతువుగా పరిగణిస్తారని అర్థమవుతుంది. దుర్గాదేవీతో పాటు అయ్యప్ప స్వామి వాహనం కూడా పులియే. ఆ దేవుళ్లు ఎంత శక్తివంతులో వారి వాహనాలు కూడా అంతే శక్తివంతులు అని పురాణాలు చెబుతుంటాయి. సాక్షాత్తు ఆ దేవుళ్లే పులులను వాహనాలుగా చేసుకుని వాటికి ఆ గౌరవాన్ని కల్పించారు. ఆ రకంగా చూస్తే, పులికి, ఆధ్మాత్మిక శక్తికి చాలా దగ్గర సంబంధముందని హిందూ నమ్మకాల్లో స్పష్టం అవుతుంది.

ఇక కలలో పులి కనిపించడం విషయానికొస్తే,

పులిపై స్వారీ చేస్తూ చెడుపై పోరాడే దైవ శక్తి మనకు కలలో కనిపిస్తే ఏమవుతుంది. మంచి కోసం మనం చేసే పనుల్లో దైవానుగ్రహం ఉంటే అది మన మంచికే అవుతుంది. కానీ, చెడు కోసం కాదు. ఒకవేళ మనమేదైనా చెడు పని చేయబోతున్నామని తెలిసి కూడా చేయడానికి తలపెడితే అది ఒక హెచ్చరికగానే భావించాలి.

పులులు కలలో కనిపించిస్తే ఆ వ్యక్తి ఆధ్మాత్మికంగా ఎదిగేందుకు పోరాడాలని అర్థం. ఇందుకోసం ధైర్యం కూడగట్టుకుని మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది. ఏదైనా లక్ష్యం కోసం పోరాడే వారికి కలలో పులి కనిపిస్తే వారు మానసికంగా బలంగా ఉండాలనే సూచన ఇచ్చినట్లు భావించాలి. స్వప్న శాస్త్రం ప్రకారం పులి కలలో కనిపించడం మరో సంకేతాన్ని కూడా ఇస్తుంది. ఆ వ్యక్తి ఎదుర్కోనున్న కష్టాలను తీర్చేందుకు ఆ దేవుడే స్వయంగా రానున్నాడని అర్థం.

మరింత సాధారణ అర్థంలో చెప్పాలంటే, పులి కలలో కనిపిస్తే రాబోయే కష్టానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోవాలి. అడ్డంకులను అధిగమించే శక్తి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మీలో సంకల్పాన్ని దృఢపరిచేలా, విశ్వాసాన్ని పెంచేలా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి. మీలో విశ్వాసాన్ని రెట్టింపు చేసే పనుల్లో నిమగ్నమవ్వాలి. కలలో కనిపించగానే ఆందోళన చెందకుండా మీ జీవితంలో ఏం జరుగుతుందో ఆలోచించండి. ఈ కల మీకు సవాలుగా మారనుందా.. లేదా ఏదైనా సూచననిస్తుందా అని బేరీజు వేసుకోండి. కల అనేది ఎవరికి వారిది వ్యక్తిగతం కాబట్టి తమ గతాన్ని బట్టి కల అర్థం మారుతుందని తెలుసుకోండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

టాపిక్

తదుపరి వ్యాసం