తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Swapna Shastram : కలలో శివుడు కనిపిస్తే అర్థమేంటి? జీవితంలో ఏం జరుగుతుంది?

Swapna Shastram : కలలో శివుడు కనిపిస్తే అర్థమేంటి? జీవితంలో ఏం జరుగుతుంది?

Anand Sai HT Telugu

16 June 2024, 19:30 IST

google News
    • Dreams and Meanings In Telugu : స్వప్నశాస్త్రం ప్రకారం కలలో కనిపించేవాటికి వివిధ అర్థాలు ఉంటాయి. వాటి ప్రకారం మనం ఏం చేయాలో తెలుసుకోవాలి. కలలో శివుడు కనిపిస్తే ఓ అర్థం ఉంది. అదేంటో తెలుసుకోండి..
కలలో శివుడు కనిపిస్తే అర్థమేంటి?
కలలో శివుడు కనిపిస్తే అర్థమేంటి? (pixabay)

కలలో శివుడు కనిపిస్తే అర్థమేంటి?

హిందూవులకు శివుడు అంటే చాలా ఇష్టం. భోళా శంకరుడిని పూజించడం వలన మంచి జరుగుతుందని చాలా నమ్మకం. అయితే స్వప్నశాస్త్రం ప్రకారం మనకు కలలో కొన్నిసార్లు శివుడు కనిపించవచ్చు. దీనిప్రకారం కొన్ని అర్థాలు ఉంటాయి. శివుడు లేదా శివలింగం మీకు కలలో కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెలుసుకోవచ్చు..

నిద్రపోయినప్పుడు మనకు కల వస్తుంది. ఇది మంచి లేదా చెడు కావచ్చు. అలాంటి కొన్ని కలలు మన జ్ఞాపకంలో ఉండిపోతాయి, కొన్ని గుర్తుండవు, కొన్ని కలలు మనల్ని ఆలోచింపజేస్తాయి. మరికొన్ని కలలు మన నిద్రకు భంగం కలిగిస్తాయి. ఈ కల ఎందుకు వచ్చింది? దాని అర్థం ఏంటి? అని చాలాసార్లు ఆలోచిస్తాం. కలలో శివుడు కనిపించడం గురించి తెలుసుకుందాం..

శివుడు, లేదా శివలింగం కలగడం మామూలు విషయం కాదు. అదృష్టం ఉన్నవారికి శివుడు కలలో కనిపించాడు అని నమ్ముతారు. నిత్యం శివుడిని పూజించే వారికి ఈ పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. పూర్వజన్మ కారణంగా శివుడు కలలో కనిపిస్తాడని అంటారు. శివుడు కలలో కనిపిస్తే భయపడాల్సిన పనిలేదు. శివుని అనుగ్రహం మీపై ఉంది.

కలలో శివలింగం దర్శనం చేసుకోవడం మోక్షానికి సంకేతమని పండితులు అంటున్నారు. శివుడిని దర్శించుకోవడానికి చాలా కిలోమీటర్లు ప్రయాణిస్తారు. కానీ శివుడు నేరుగా కలలో కనిపిస్తే అదృష్టమని చెబుతారు.

కలలో శివుడు కనిపిస్తే ఐశ్వర్యం పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇది శుభప్రదంగా పరిగణిస్తారు. ఆరోగ్యంగా, సంతృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. పడుకునే ముందు ఓం నమ:శివాయ అని జపిస్తే పీడకలలు రావు, మంచి కలలు వస్తాయని అంటారు.

కలలో శివలింగాన్ని చూడటం జీవితంలో సంతోషాన్నిస్తుంది. మీరు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా రాబోయే రోజుల్లో పరిష్కరించబడుతుంది. మీ జీవితంలో ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా దూరమవుతుందని విశ్వాసం.

మీరు శివలింగానికి అభిషేకం చేయాలనుకుంటే దానిని మీ పూర్వ జన్మ పాపానికి లేదా ఈ జన్మ పాపాలకు చిహ్నంగా భావించాలని పండితులు అంటున్నారు.

గర్భిణీ స్త్రీకి కలలో శివలింగం కనిపిస్తే ఆమెకు ఇష్టమైన బిడ్డ పుట్టబోతున్నాడని అర్థం. మీకు కలలో విల్లు ఆకులు కనిపిస్తే లేదా శివలింగానికి అభిషేకం చేస్తే, మీ ఆరోగ్యం చాలా బాగుంటుందని సంకేతం.

చెడిపోయిన నీటితో శివలింగానికి అభిషేకం చేయాలని కలలో వచ్చినా లేదా శివలింగం విరిగిపోయినట్లు కల వచ్చినా అది మంచి కల కాదు. రాబోయే రోజుల్లో ఆర్థిక ఖర్చులు, ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.

కలలో శివలింగంపై నాగుపాము కనిపించడం శుభప్రదం. ఇది రాబోయే రోజుల్లో మంచి డబ్బుకు సంకేతం. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయని నమ్ముతారు.

మీకు కలలో తెల్లని రంగులో ఉన్న శివలింగం కనిపిస్తే రాబోయే రోజుల్లో మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. మీకు కలలో శివలింగంతో కూడిన త్రిశూలం కనిపిస్తే, రాబోయే రోజుల్లో మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారని సంకేతం.

కలలో పార్వతీ పరమేశ్వరుడు కనిపిస్తే అర్థనాతీశ్వరుని అనుగ్రహం మీకు లభిస్తుందని అర్థం చేసుకోవాలి. మీ వైవాహిక జీవితంలో విభేదాలు, ఉద్రిక్తతలు ముగుస్తాయని దీని అర్థం. అయితే పార్వతీదేవికి జలాభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత శివాలయంలో తేనె సమర్పించి సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ప్రార్థించాలి.

తదుపరి వ్యాసం