మే 6, నేటి రాశి ఫలాలు.. శివుడికి అభిషేకం చేస్తే ధనం, ఉన్నత పదవులు పొందుతారు-today rasi phalalu in telugu may 6th 2024 check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మే 6, నేటి రాశి ఫలాలు.. శివుడికి అభిషేకం చేస్తే ధనం, ఉన్నత పదవులు పొందుతారు

మే 6, నేటి రాశి ఫలాలు.. శివుడికి అభిషేకం చేస్తే ధనం, ఉన్నత పదవులు పొందుతారు

HT Telugu Desk HT Telugu
May 06, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ06.05.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మే 6వ తేదీ నేటి రాశి ఫలాలు
మే 6వ తేదీ నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 06.05. 2024

వారం: సోమవారం, తిథి : త్రయోదశి

నక్షత్రం : రేవతి, మాసం : చైత్రం,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం : ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఒంటరిగా ఏపని చేయటం మంచిది కాదని గమనించండి. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిత్రార్జిత ఆస్తిని అమ్మటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మేష రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు, ధనమును పొందెదరు.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సమర్థవంతంగా నడుపుతారు. ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు అదనపు సంపాదన దిశగా తమ ఆలోచనలు సాగిస్తారు. తరచూ దేవాలయ సందర్శనం చేస్తారు. సిమెంటు, ఇసుక వ్యాపారులకు పురోభివృద్ధి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. హోల్‌సేల్‌ వ్యాపారులు, రేషన్‌ డీలర్లకు అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి. అకాల భోజనం వల్ల మీ ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి. వ్యాపారాల్లో అనుభవం, ఆశించిన లాభాలు గడిస్తారు. మీ భర్తలో ఉన్నట్టుండి వేదాంతధోరణి కానవస్తుంది. మిథున రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. బంధువుల రాకతో గృహంతో సందడి కానవస్తుంది. ప్రస్తుత వ్యాపారాలపైనే శ్రద్ద వహించండి. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. స్టేషనరీ, ప్రింటింగ్‌ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. చేపట్టిన పనులలో నాణ్యతా లోపం వల్ల కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కర్కాటక రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన, పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఖర్చులు అధికమవుతాయి. మీ వాక్చాతుర్యంతో అందరిని కట్టుకోగలుగుతారు. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళకువ అవసరం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. స్త్రీలు టీవీ కార్యక్రమాల్లో రాణిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. బంధువులతో అభిప్రాయభేదాలు, పట్టింపులు తలెత్తుతాయి. సామూహిక దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ప్రతి విషయంలోను మౌనం వహించడం తప్పదు. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. ప్రేమికులకు తొందరపాటు తగదు. కన్యా రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన వ్యవహారాలు మీచేతుల మీదుగా సాగుతాయి. ఒక కార్య సాధన కోసం ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. గృహోపకరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ విషయంలో కూడ మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. అనవసర విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. తులా రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారాలలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన సత్ఫలితాలు సాధిస్తారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలం. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. పత్రికారంగంలోని వారికి, కళారంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలు కళాత్మక పోటీల పట్ల ఆసక్తి చూపిస్తారు. వృశ్చిక రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. మీ మనోభావాలు బయటికి వ్యక్తం చేసి సమస్యలు తీర్చుకోగలుగుతారు. పనులు హడావిడిగా సాగుతాయి. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పంతాలు, పట్టింపులకు ఇది సమయం కాదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలమైన కాలం. ధనూ రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.

మకర రాశి

మకరరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. భాగస్వాముల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశం తాత్కాలికమే అయినా సద్వినియోగం చేసుకోవటం మంచిది. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. పాతమిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం. వ్యాపారపరంగా ఓర్పు, నేర్పు చాలా అవసరం. కుంభ రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులు అధిక ఒత్తిడిని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. ఉద్యోగంలో కొత్త ప్రయోగాలకు అనుకూలమైన కాలం. ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీన రాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel