తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sukraditya Yogam: శుక్రాదిత్య యోగం.. ఉద్యోగంలో ప్రమోషన్, సంపద రెట్టింపుతో పాటు మరెన్నో ప్రయోజనాలు

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఉద్యోగంలో ప్రమోషన్, సంపద రెట్టింపుతో పాటు మరెన్నో ప్రయోజనాలు

Gunti Soundarya HT Telugu

06 May 2024, 18:11 IST

    • Sukraditya yogam: వృషభ రాశిలో సూర్యుడు, శుక్రుడు కలయిక వల్ల శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది. దీని వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. సంపద రెట్టింపుతో పాటు మరెన్నో ప్రయోజనాలు పొందబోతున్నారు. 
శుక్రాదిత్య యోగం
శుక్రాదిత్య యోగం (pixabay)

శుక్రాదిత్య యోగం

Sukraditya yogam: ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయం తర్వాత రాశిని మార్చుకుంటుంది. ఈ సమయంలో ఇతర గ్రహాలతో సంయోగం జరుగుతుంది. గ్రహాల కలయిక కారణంగా రాశి చక్రంలోని ప్రతి సంకేతం వారి జీవితంలో అద్భుతాలను, అశుభాలని ఇస్తుంది.

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

రెండు అదృష్ట గ్రహాలు ఒకే రాశి చక్రంలో ఉంటే రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటే మరికొందరికి ఇబ్బందిని కూడా కలిగిస్తాయి. మే నెలలో అనేక రాజయోగాలు ఏర్పడుతున్నాయి. వాటిలో ఒకటి శుక్రాదిత్య యోగం.

గ్రహాల రాజు సూర్యుడు మే 14న వృషభ రాశి ప్రవేశం చేస్తాడు. ప్రతి 28 రోజులకు ఒకసారి శుక్రుడు తన రాశి చక్రం మార్చుకుంటూ ఉంటాడు. అలా మేష రాశిలో ఉన్న శుక్రుడు మే 19న వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో వృషభ రాశిలో సూర్యుడు, శుక్రుడు సంయోగం కారణంగా శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రాదిత్య యోగాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ యోగం అనుకూలమైన ప్రభావం కారణంగా ప్రజల జీవితం శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం ఆకాశాన్ని అంటుతుంది. సమస్యలన్నీ అదృశ్యం అయిపోతాయి. శుక్రాదిత్య రాజ యోగం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూలమైన రోజులు ప్రారంభం కాబోతున్నాయి. అవి ఏవంటే..

వృషభ రాశి

వృషభ రాశిలోనే సూర్యుడు, శుక్రుడి కలయిక జరుగుతుంది. శుక్రాదిత్య యోగం వల్ల ఈ రాశి జాతకులు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ల కెరీర్ లో రాణిస్తారు. ఈ సమయంలో కుటుంబంలో ఆనందం, ప్రశాంతత ఉంటుంది. వివాహితులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు మీ సహచరులు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తారు. మీ భాగస్వామి అచంచలమైన ప్రేమకు మురిసిపోతారు. ఒంటరిగా ఉన్న వాళ్లకి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

కర్కాటక రాశి

సూర్యుడు, శుక్రుడు కలిసి కర్కాటక రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాల సృష్టి జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్ లో మంచి నిర్ణయాలు తీసుకుంటే విజయం సాధిస్తారు. పెట్టుబడులు ఇప్పుడు పెడితే భవిష్యత్తులో గణనీయమైన రాబడిని ఇస్తాయి.

మేష రాశి

శుక్రాదిత్య యోగం ప్రభావంతో మేషరాశి జాతకులు ఊహించని విధంగా ఆర్థిక లాభాలను పొందుతారు. పారిశ్రామికవేత్తలు కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారులకు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకునే కోరిక ఏదైనా ఈ సమయంలో నెరవేరుతుంది. శ్రేయస్సు ఆర్థిక విజయం సాధిస్తారు. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.

సింహ రాశి

ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారులకు ఈ సమయం అద్భుతం. అనేక రంగాలలో ఉన్నతాధికారులతో ఉద్యోగులకు సత్సంబంధాలు నెలకొంటాయి. జీవిత భాగస్వామితో రొమాంటిక్ టైమ్ గడుపుతారు.

ధనుస్సు రాశి

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కష్టపడి పని చేయడం వల్ల ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. కుటుంబ జీవితం మీరు కోరుకున్న దాని కంటే ఆనందంగా ఉంటుంది.

 

తదుపరి వ్యాసం