South Facing House- Vastu Tips । దక్షిణ ముఖ ఇల్లు వీరికి శ్రేష్ఠమైనది.. కీర్తి, సంపదలు పెరుగుతాయి!
05 January 2023, 15:42 IST
- South Facing House- Vastu Tips: చాలా మంది దక్షిణ దిశలో ఇల్లు ఉండటం మంచిది కాదని భావిస్తారు, కానీ ఇది అపోహే అని వాస్తు నిపుణులు కొట్టి పారేస్తున్నారు. కొంతమందికి దక్షిణ దిశలో ఇల్లు చాలా కలిసి వస్తుందని చెబుతున్నారు.
South Facing House- Vastu Tips
ఇంటి నిర్మాణం విషయంలో అత్యంత ప్రధానంగా చూసేది ఆ ఇంటి వాస్తు. ఈరోజుల్లో వాస్తు చూడకుండా ఇల్లు నిర్మాణం గానీ, కొనుగోలు గానీ చేయడం లేదు. ఎందుకంటే వాస్తు సరిగ్గా ఉంటే అది వ్యక్తులు అన్ని రకాలుగా ఎదగడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, సానుకూల శక్తిని ఆకర్షించడంలో సహాయపడుతుందని బలంగా నమ్ముతారు. అదేసమయంలో వాస్తులేని ఇంటికి వ్యతిరేక ప్రభావాలు ఉంటాయని విశ్వసిస్తారు. చాలా మంది స్థలం కొనుగోలు చేసేటపుడు గానీ, గృహ నిర్మాణం విషయంలో గానీ తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలలో ఉండే వాటినే కొనుగోలు చేస్తారు, దక్షిణ దిశలో ఉన్న ఇంటి స్థలం లేదా ఇల్లు ఉత్తమమైనది కాదని భావిస్తారు. ఇప్పుడు దీని గురించి చర్చించుకుందాం.
వాస్తు శాస్త్రం ఏదైనా ఒక దిశను పూర్తిగా మంచిది అని లేదా పూర్తిగా చెడుగా సూచించదు. నిజానికి అన్ని దిశలకు వాటివాటి అనుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయి. అవి వ్యక్తులను, వారి వృత్తులను బట్టి కూడా మారుతుంటాయి. ఈ క్రమంలో దక్షిణం దిశగా ఉన్న గృహాల గురించి ప్రజలకు చాలా భయాలు ఉన్నాయి. 'దక్షిణ ముఖంగా ఉన్న ఇంటిని ఎలా పరిష్కరించాలి?’ అనేది గూగుల్‌లో ఎక్కువగా అడిగిన వాస్తు ప్రశ్నలలో ఒకటి. ఈ భయాలు ఎందుకంటే పురాణాల ప్రకారం, మృత్యు దేవుడు అయిన యముడు దక్షిణ దిశ నుంచి ఉద్భవించాడు అని పేర్కొనడమైనది. అందుకే ఇటు ఫేస్ చేసిన ఇళ్లు తీసుకోకూడదు, ఇది దురదృష్టకరమైన దిశ అని నమ్ముతారు. కానీ ఇలాంటి భయాలు అర్థం లేనివి అని వాస్తు నిపుణులు చెబుతారు.
ఈ భయాలు నిరాధారమైనవని నిరూపించడానికి, ఏదైనా నగరంలో అత్యంత సంపన్నమైన, ప్రగతిశీల భాగాలను చూడవలసిందిగా సూచిస్తారు. దక్షిణ ఢిల్లీ, దక్షిణ ముంబై లేదా దక్షిణ మెల్బోర్న్ అయినా, ఈ ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా దక్షిణం వైపుకే శంషాబాద్ విమానాశ్రయం, హైటైక్ సిటీ వంటి ఐటీ కారిడార్లు ఉన్నాయి. అలాంటపుడు దక్షిణం ఎంత సంపన్నమైనదో అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే దక్షిణం వైపు ఉన్న ఇంటిని వాస్తు నియమాలతో కట్టుకుంటే సుసంపన్నంగా, శుభకరంగా ఉంటుందని సూచిస్తున్నారు.
Vastu Tips for South Facing House- దక్షిణ ముఖ ఇంటికి వాస్తు చిట్కాలు
- దక్షిణ దిశ ఇంటిని నిర్మించేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు, ముఖ్యంగా దక్షిణం వైపున ఉన్న ఇంటి గోడ పరిమాణాన్ని ఇంటి ఇతర వైపుల కంటే ఎత్తుగా , బలంగా ఉండేలా చూసుకోండి.
- ఇంటి ఈశాన్య భాగంలో పెద్ద పూల మొక్కలు లేదా చెట్లను నాటడానికి ప్రయత్నించండి, ఇది ప్రతికూల శక్తిని ఆకర్షించకుండా ఇంటిని కాపాడుతుంది.
Who Should Buy South Facing House- సౌత్ ఫేసింగ్ హోమ్ ఎవరికి కలిసి వస్తుంది
దక్షిణ దిశ సూర్యుడి నుండి చాలా శక్తిని పొందుతుంది, ఇది అధిక శక్తి జోన్‌గా పరిగణించవచ్చు. సౌత్ ఫేసింగ్ హోమ్ చాలా మందికి ఎంతో కలిసివస్తుంది.
- పబ్లిక్ రిలేషన్స్, మీడియా, ఫిల్మ్స్ వంటి రంగాలలో పనిచేసే వ్యక్తులకు సౌత్ ఫేసింగ్ హోమ్ కీర్తి, ప్రజాదరణ, సంపదను తీసుకువస్తుంది. . ఈ దిశ ఉత్పాదక శక్తిని పెంచుతుంది, ఇది మీకు కష్టపడి పని చేయడానికి , మీ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది.
- పోలీసు, IAS, న్యాయవ్యవస్థ వంటి పరిపాలనా సేవలలో నిమగ్నమైన వ్యక్తులకు దక్షిణం వైపు ఇల్లు ఉత్తమం.
- దక్షిణ దిశ భద్రతను సూచించే అగ్ని మూలకానికి సంబంధించినది కాబట్టి, దక్షిణం వైపు ఉన్న ఇల్లు సాయుధ దళాలు, పారామిలిటరీ బలగాలలోని వ్యక్తులకు సరైన ఎంపిక చేస్తుంది.
- మీ జాతకంలో అంగారకుడి బలమైన ఉనికి ఉంటే దక్షిణ ముఖంగా ఉన్న ఇల్లు మీ జీవితంలో చాలా శక్తిని అందిస్తుంది. వీరు దక్షిణ ముఖంగా ఉన్న ఇంటిలో వర్ధిల్లుతారు, ఆనందాన్ని పొందుతారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మీ మతవిశ్వాసాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులోని సమాచారం పూర్తిగా నిజం అని చెప్పలేం, అందుకు ఎలాంటి కచ్చితమైన ఆధారాలు కూడా లేవు.
టాపిక్