Shani Transit: శని గమనంలో మార్పు .. ఈ రాశుల వారికి చుక్కలే.. కలిసొచ్చేది కేవలం వీళ్లకు మాత్రమే
13 November 2024, 12:17 IST
నవంబర్ 15 నుండి శని తన కదలికలను మారుస్తున్నాడు. ఆరు నెలలుగా వక్రగతిలో ప్రయాణిస్తున్న శని రుజుమార్గంలోకి రానున్నాడు. శని గమనంలోని ఈ మార్పు ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. రాశుల పరిస్థితి ఎలా ఉండబోనుందో తెలుసుకోండి.
శని సంచారంలో మార్పు
గత ఆరు నెలలుగా వక్రమార్గంలో ప్రయాణిస్తున్న శని మళ్లీ రుజు మార్గంలో సంచరించనున్నాడు. శని గ్రహం నవంబర్ 15, 2024 రాత్రి 07.51 గంటలకు తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ఫలితంగా శని ప్రయాణించనున్న దిశ మొత్తం 12 రాశులపై తన ప్రభావాన్ని చూపనున్నాడు. కొన్ని రాశులవారు శని సంచార వల్ల మంచి ప్రయోజనం పొందుతారు, ఇంకొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే.
మేష రాశి: ఈ వారికి పురోభివృద్ధి, ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆగిపోయిన పనులలో ప్రయోజనకరమైన మార్పులు చేస్తారు. ఇప్పటికే ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి.
వృషభరాశి: శని మార్గంలో మార్పుతో ఈ రాశి వారికి మంచి ప్రయోజనాలు అందుతాయి. అదనపు ఛార్జీలు, మునుపటి పనికి ప్రశంసలు పొందుతారు. అదృష్టం కలిసి వచ్చి కొత్త బంధాలు ఏర్పడతాయి. గౌరవం, ఆదరణ మరింత పెరుగుతాయి.
మిథున రాశి: శని ప్రభావం కారణంగా వీరికి చెడు పనులు జరుగుతాయి. ఇది కొద్ది కాలమే ఉండొచ్చు. ఆఫీసు లేదా పని స్వభావంలో కాస్త మార్పు, ఇబ్బందులు రావచ్చు.
కర్కాటక రాశి: ఈ రాశిలో ఉన్నవారికి శని సంచార దిశ ఆరోగ్యాన్ని, సంబంధాలలో అస్థిరతను తీసుకురానుంది. ముఖ్యమైన పచచదదనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. తప్పుడు నిర్ణయాల కారణంగా నష్టాలు కలిగే అవకాశం ఉంది. అన్ని పనుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
సింహ రాశి: శని దిశ మార్పు కారణంగా వీరికి కొత్త భాగస్వామ్యాలు, నివాస కార్యాలయాల్లో మార్పుకు దారితీస్తుంది. మరమ్మతులు- ఆరోగ్యం పేరుతో ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబ సఖ్యత.. అదనపు శ్రమతో పెద్ద పనులు పూర్తి చేస్తారు.
కన్యారాశి: శని మార్గంలో మార్పు వల్ల ఈ రాశి వారు వివాదాస్పద విషయాల్లో విజయం సాధిస్తారు. అప్పులు, రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. పని ప్రాంతంలో ప్రయోజనకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అంచనాలు కరెక్ట్ గా వేసి పనులు సకాలంలో పూర్తి చేయగలరు కాబట్టి కొత్త పనుల్లో పెట్టుబడులు ఉంచడం మంచిది.
తులా రాశి: శని సంచార దిశ వీరికి ఆర్థిక ప్రయోజనాలను, కొత్త పనిలో నిమగ్నతను తెచ్చిపెడుతుంది. అకడమిక్ పనుల్లో ఉన్నవారు విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం కూడా ఉండవచ్చు.
వృశ్చిక రాశి: శని మార్గం మార్చుకోవడం కారణంగా ఈ రాశి వారికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఇంటి మరమ్మతులు, నిర్మాణ పనులపై ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంకా పనిప్రాంతం లేదా పని స్వభావంలో మార్పులు ఉండొచ్చు.
ధనుస్సు రాశి: వీరికి స్వల్పకాలిక ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. సమాజంలో, బంధువర్గంలో గౌరవం పెరుగుతుంది. కొత్త కొనుగోళ్లు వైపు ధ్యాస మళ్లుతుంది. కొత్త పనుల్లో నిమగ్నమవుతారు. సృజనాత్మక పనుల్లో విజయం సాధిస్తారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.
మకర రాశి: ఈ రాశి వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు. చరాస్తులు, స్థిరాస్తుల క్రయవిక్రయాలు కలిగే అవకాశం ఉంది. కొన్నాళ్లుగా నిలిచిపోయిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. నూతన ఉత్తేజంతో కొత్త పనుల్లో పెట్టుబడులకు మొగ్గు చూపుతారు.
కుంభ రాశి: పనిప్రాంతంలో ప్రయోజనకరమైన మార్పులు ఉన్నాయి. కానీ సంబంధాలలో అస్థిరత ఉండొచ్చు. పనిభారం పెరగడంతో పాటు పలుకుబడి కూడా పెరుగుతుంది. కొత్త భాగస్వామ్యాల కారణంగా చెడు పనులు జరిగే అవకాశం ఉంది.
మీన రాశి ఆరోగ్యం, ఇంటి మరమ్మతులకు ఖర్చు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలు చవిచూస్తారు. దీర్ఘకాలిక వ్యాధులు కూడా పరిష్కారమవుతాయి. సంయమనం పాటించడం అన్ని సందర్భాల్లో లాభదాయకంగా ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్