వచ్చే నెల ఆరంభం నుంచి ఈ రాశుల వారికి కలిసి రానున్న అదృష్టం.. ధన లాభాలు, కుటుంబంలో సంతోషం!-lucky zodiac signs to get monetary and more benefits due to venus transit in december ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  వచ్చే నెల ఆరంభం నుంచి ఈ రాశుల వారికి కలిసి రానున్న అదృష్టం.. ధన లాభాలు, కుటుంబంలో సంతోషం!

వచ్చే నెల ఆరంభం నుంచి ఈ రాశుల వారికి కలిసి రానున్న అదృష్టం.. ధన లాభాలు, కుటుంబంలో సంతోషం!

Nov 09, 2024, 02:20 PM IST Chatakonda Krishna Prakash
Nov 09, 2024, 02:13 PM , IST

  • శుక్రుడి సంచారం వల్ల వచ్చే నెల డిసెంబర్‌లో మూడు రాశుల వారికి బాగా కలిసి రానుంది. ముఖ్యంగా ధనపరంగా లాభాలు ఉండే అవకాశం ఉంది. మరిన్ని ప్రయోజనాలు దక్కొచ్చు. ఆ వివరాలు ఇవే..

జ్యోతిషం ప్రకారం, శుక్రుడి సంచారం రాశులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. సంపద, అందం, వ్యాపారం, విలాసాలకు శుక్రుడు కారకుడు. శుక్రుడు వచ్చే నెల ఆరంభంలో రాశి మారనున్నాడు. 

(1 / 5)

శుక్రుడు డిసెంబర్ 2వ తేదీన మకర రాశిలోకి అడుగుపెడతాడు. ప్రస్తుతం ధనస్సు రాశిలో సంచరిస్తున్న శుక్రుడు వచ్చే నెల మొదట్లో రాశి మారతాడు. డిసెంబర్ 2వ తేదీన నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు మకర రాశిలో శుక్రుడు సంచరిస్తాడు. ఈ కాలంలో మూడు రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. 

(2 / 5)

కుంభం: మకరంలో శుక్రుడి సంచారం కుంభ రాశి వారికి కలిసి రానుంది. ఈ కాలంలో వీరికి ధన పరంగా సానుకూలంగా ఉంటుంది. చాలాకాలంగా రావాల్సిన డబ్బు వీరి చేతికి అందే అవకాశం ఉంది.  చాలా పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబాల్లో సంతోషం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో బంధం మరింత మెరుగవుతుంది. 

(3 / 5)

మకరం: ఈ కాలంలో మకర రాశి వారికి శుభప్రదం. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది. పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి సత్ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం కూడా అధికం అవుతుంది. ఇప్పటికే పెళ్లయిన వారికి వైవాహిక జీవితంలో మరింత ఆనందం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా కలిసి వస్తుంది. 

(4 / 5)

వృషభం: మకర రాశిలో శుక్రుడు సంచారించడం వల్ల వృషభ రాశి వారి అదృష్టం సానుకూలంగా మారుతుంది. పెట్టిన పెట్టుబడులపై ఈ కాలంలో రాబడి బాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో కలిసి రావొచ్చు. వ్యాపారులకు ఆదాయం పెరగడంతో పాటు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి సానుకూలంగా ఉంటుంది. (గమనిక: నమ్మకాలు, శాస్త్రాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల గురించి తెలుసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు