Ratha saptami 2024: రథసప్తమి రోజు ఈ శ్లోకాలు పఠించారంటే సకల బాధలు తొలగిపోతాయి
15 February 2024, 16:58 IST
- Ratha saptami 2024: రథసప్తమి రోజున పూజలు చేయడం కుదరని వాళ్ళు ఈ శ్లోకాలు, మంత్రాలు పఠించడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
రథసప్తమి రోజు పఠించాల్సిన శ్లోకాలు
Ratha saptami 2024: సమస్త జీవ ప్రాణికోటి క్షేమంగా ఉందంటే అందుకు సూర్య భగవానుడు కారణం. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే ఆదిత్యుడిని ఆరాధించడం వల్ల సర్వరోగాలు నయమవుతాయని అంటారు. అదితి, కశ్యప దంపతులకు పుట్టిన వాడు సూర్య భగవానుడు. ఆయన జన్మదినాన్ని సూర్య జయంతి, రథసప్తమి అని పిలుస్తారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 16న రథసప్తమి జరుపుకుంటారు. తెల్లవారుజామున నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. పవిత్రమైన రోజు పూజలు చేసేటప్పుడు, స్నానం ఆచరించేటప్పుడు కొన్ని శ్లోకాలు, మంత్రాలు పఠించాలి. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి.
సప్త సప్త మహా సప్త సప్తద్వీపా వసుంధరా
సప్తార్క వర్ణమాదాయ సప్తమీ రథసప్తమీ
రథసప్తమి సందర్భంగా ఈ శ్లోకాలు పఠించాలి
స్నానం చేసేటప్పుడు చదవాల్సిన శ్లోకం
నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే||
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మస్తు సప్తసు|
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ||
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్ |
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః||
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే|
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ||
అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఈ శ్లోకం చదవాలి
సప్త సప్తి వహప్రీతా సప్తలోక్ ప్రదీపనా|
సప్తమీ సహితొదేవా గృహాణర్ఘ్యం దివాకరా ||
రథసప్తమి రోజు పఠించాల్సిన మరికొన్ని శ్లోకాలు
అర్కపత్ర స్నాన శ్లోకాః|
సప్తసప్తిప్రియే దేవి సప్తలోకైక దీపికె|
సప్తజన్మార్జితం పాపం హర సప్తమి సత్వరమ్||
యన్మయాత్ర కరటం పాపం పూర్వం సప్తసు జన్మసు|
తత్సర్వం శోకమోహూ చ మాకరీ హంతు సప్తమీ ||
నమామి సప్తమీం దేవీం సర్వపాప ప్రణాశినిమ్|
సప్తార్క పత్రస్నానేన మమ పాపం వ్యాపోహతు||
పూజ చేసిన తర్వాత ఆదిత్య హృదయ పారాయణం, సూర్యాష్టకం, సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం వంటివి పఠించాలి. రథసప్తమి రోజు సూర్యుడికి ఎర్రటి పూలతో పూజ చేయాలి. సూర్యుడికి నీటిని సమర్పించే సమయంలో అందులో ఎర్ర చందనం కలుపుకోవాలి. సంతాన లేని వాళ్ళు రథసప్తమి రోజు వ్రతం ఆచరిస్తే ఫలితం దక్కుతుంది. పూజ చేసే సమయంలో ఇంటి పేరు, గోత్రనామాలు పలుకుతూ పూజ చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు.
సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ శ్లోకాలతో పాటు 12 మంత్రాలు పఠించాలి.
ఓం హామ్ మిత్రయా నమః
ఓం హ్రీం రవయే నమః
ఓం హమ్ సూర్యయా నమః
ఓం హ్రీం బానవే నమః
ఓం హ్రొం ఖయాగే నమః
ఓం హం పుషనే నమః
ఓం హరీ హిరణ్యగర్భయ నమః
ఓం అధిత్య నమః
ఓం సావిత్రే నమః
ఓం ఆర్కే నమః
ఓం భాస్కరాయే నమః
ఓం మేరీచీ నమః అనే మంత్రాలు పఠించాలి. ఇవి పఠించడం వల్ల శారీరక, అనారోగ్య, మానసిక, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు.