Gemini Horoscope Today: మిథున రాశి వారికి మధ్యాహ్నం తర్వాత ఒక గుడ్ న్యూస్, ఇగోని కాస్త పక్కన పెట్టండి
17 September 2024, 5:43 IST
Mithuna Rasi Today: రాశి చక్రంలో 3వ రాశి మిథున రాశి. పుట్టిన సమయంలో మిథున రాశిలో సంచరించే జాతకుల రాశిని మిథున రాశిగా పరిగణిస్తారు. ఈరోజు సెప్టెంబరు 17, 2024న మంగళవారం మిథున రాశి వారి ప్రేమ, కెరీర్, ఆరోగ్య, ఆర్థిక జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
మిథున రాశి
Gemini Horoscope Today 17th September 2024: ఆఫీస్‌లో చిన్నచిన్న ఇగో సమస్యలు వచ్చినా వాటిని అధిగమించండి. ప్రేమ వ్యవహారంలో చిన్నచిన్న సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. ఈ రోజు ఆర్థిక పురోభివృద్ధి కూడా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. వాటిని పరిష్కరించుకోవడానికి ప్రేమికుడితో మాట్లాడటానికి సిద్ధంగా ఉండాలి. వృత్తి జీవితంలో చిన్నచిన్న సమస్యలు ఆఫీసు రాజకీయాల రూపంలో కూడా కనిపిస్తాయి.
ప్రేమ
షరతులు లేని ప్రేమను వ్యక్తపరచండి. మీ తల్లిదండ్రులు సంబంధానికి మద్దతు ఇస్తారు. ప్రేమ వ్యవహారాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లాలనుకునే వారు ప్లాన్‌ను ముందుకు తీసుకెళ్లవచ్చు. ఒంటరి మిథున రాశి మహిళలు లవ్ ప్రపోజల్‌ను ఆశించవచ్చు.
మాజీ ప్రేమికుడితో విభేదాలను పరిష్కరించడంలో మీరు అదృష్టవంతులు, పాత సంబంధానికి తిరిగి రావచ్చు. అయితే, వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి వివాహితులు ఈ మాజీ ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండాలి.
కెరీర్
పెద్ద వృత్తిపరమైన సవాలు ఈరోజు మిథున రాశి వారికి ఎదురపడవు. కానీ.. సంభాషణలో ప్రశాంతంగా ఉండాలి, ఒక సీనియర్ మీ పనితీరుపై వేలెత్తి చూపవచ్చు. ఆఫీసులో వాదనలకు దూరంగా ఉండండి. మేనేజ్‌మెంట్‌తో సానుకూలంగా ఉండండి.
కొంతమంది ప్రొఫెషనల్స్ సహోద్యోగులతో ఇగో సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇది మీ ప్రొడెక్టివిటీపై ప్రభావితం చూపుతుంది. విద్యార్థులు ఈ రోజు పరీక్షలో ఉత్తీర్ణులవుతారు, కొంతమంది ఉద్యోగార్థులకు ఈరోజు మధ్యాహ్నంపైన ఆఫర్ లెటర్ రావొచ్చు.
ఆర్థిక
కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనడం వంటి దీర్ఘకాలిక కలలను నెరవేర్చడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు అప్పులు లేదా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను తిరిగి చెల్లించవచ్చు. మధ్యాహ్నంపైన చారిటీకి విరాళంగా ఇవ్వడానికి లేదా స్నేహితుడికి సహాయం చేయడానికి ఎంచుకోండి. వ్యాపారస్తులు ఆత్మవిశ్వాసంతో కొత్త రంగాల్లో పెట్టుబడులు పెట్టే ప్రణాళికతో ముందుకు సాగుతారు.
ఆరోగ్యం
ఆరోగ్య పరంగా ఈరోజు మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది సీనియర్లకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు, వైద్యుడిని సంప్రదించడం మంచిది. మీరు వ్యాయామంతో రోజును ప్రారంభించవచ్చు. 20 నిమిషాలు నడవడం కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడానికి మంచి మార్గం. కొంత మందికి దంతాలకు సంబంధించిన సమస్యలు ఈరోజు తలెత్తవచ్చు.