Sai Dharam Tej Donation: వృద్ధాశ్రమానికి వెళ్లిన సాయి ధరమ్ తేజ్.. విరాళం ఇచ్చి మాటనిలబెట్టుకున్న మెగా యంగ్ హీరో: ఫొటోలు-sai dharam tej visits amma prema adarana old age home and donates 5 lakhs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sai Dharam Tej Donation: వృద్ధాశ్రమానికి వెళ్లిన సాయి ధరమ్ తేజ్.. విరాళం ఇచ్చి మాటనిలబెట్టుకున్న మెగా యంగ్ హీరో: ఫొటోలు

Sai Dharam Tej Donation: వృద్ధాశ్రమానికి వెళ్లిన సాయి ధరమ్ తేజ్.. విరాళం ఇచ్చి మాటనిలబెట్టుకున్న మెగా యంగ్ హీరో: ఫొటోలు

Published Sep 11, 2024 05:09 PM IST Chatakonda Krishna Prakash
Published Sep 11, 2024 05:09 PM IST

  • Sai Dharam Tej Donation: మెగా యంగ్ హీరో సాయి దుర్గ తేజ్ (సాయి ధరమ్ తేజ్) ఓ వృద్ధాశ్రమానికి వెళ్లి తన మాటను నిలబెట్టుకున్నారు. విరాళం ఇచ్చారు. వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడారు.

మెగా యంగ్ స్టార్, సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ (సాయి ధరమ్ తేజ్) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. విజయవాడలోని ఆమ్మ ప్రేమ ఆరాధన వృద్ధాశ్రామానికి నేడు (సెప్టెంబర్ 11) ఆయన వెళ్లారు. 

(1 / 5)

తాను ఆ వృద్ధాశ్రమానికి వెళతానని గతంలో ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకొని ఇప్పుడు నెరవేర్చారు సాయి తేజ్. అక్కడి వృద్ధులతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. 

(2 / 5)

ఆ వృద్ధాశ్రమానికి రూ.5లక్షలను విరాళంగా ఇచ్చారు తేజ్. చెక్‍ను నిర్వాహకులకు అందజేశారు.

(3 / 5)

అక్కడి వృద్ధుల బాగోగులను తెలుసుకున్నారు తేజ్. వారితో కొంత సమయాన్ని గడిపి ముచ్చటించారు. ఆయనను చూసి అక్కడి వృద్దులు చాలా సంతోషించారు.

(4 / 5)

అంతకు ముందు విజయవాడలో కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సాయి దుర్గ తేజ్ దర్శించుకున్నారు. తేజ్ ప్రస్తుతం రోహిత్ కేపీ దర్శకత్వంలో ఓ పీరియడ్ యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నారు. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు