తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Nava Panchama Raja Yogm: 500 ఏళ్ల తర్వాత అద్భుతమైన రాజయోగం.. ఈ రాశుల వాళ్ళు రాజభోగాలు పొందుతారు

Nava panchama raja yogm: 500 ఏళ్ల తర్వాత అద్భుతమైన రాజయోగం.. ఈ రాశుల వాళ్ళు రాజభోగాలు పొందుతారు

Gunti Soundarya HT Telugu

18 March 2024, 9:51 IST

google News
    • Nava panchama raja yogm: 500 ఏళ్ల తర్వాత బుధుడు, బృహస్పతి కలయిక వల్ల నవ పంచమ రాజయోగం ఏర్పడనుంది. ఫలితంగా కొన్ని రాశుల జాతకులు రాజభోగాలు అనుభవిస్తారు. 
500 ఏళ్ల తర్వాత అద్భుతమైన రాజయోగం
500 ఏళ్ల తర్వాత అద్భుతమైన రాజయోగం

500 ఏళ్ల తర్వాత అద్భుతమైన రాజయోగం

Navapanchama rajayogam: గ్రహాల రాకుమారుడు బుధుడు ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్నాడు. నవ గ్రహాలలో అత్యంత వేగంగా కదిలే గ్రహాలలో బుధుడు ఒకడు. 20 రోజులకు ఒకసారి తన రాశి చక్రం మార్చుకుంటూ ఉంటాడు.

హోలీ తర్వాత బుధుడు రాశి మారబోతున్నాడు. మార్చి 26న బుధుడు మీన రాశిని వదిలి మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఇప్పటికే దేవగురువు బృహస్పతి సంచరిస్తున్నాడు. మార్చి చివరి వారం మేష రాశిలో బుధుడు, బృహస్పతి కలయిక చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ యోగం చాలా శుభప్రదమైనది.

జాతకంలోని నవపంచమ రాజయోగం ఉంటే వారి జీవితంలో అదృష్టం, శ్రేయస్సు, విజయంతో పాటు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. 12 సంవత్సరాల తర్వాత మేష రాశిలో అద్భుతమైన గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనం చేకూరుతుంది. బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించడానికి ఏడాది సమయం పడుతుంది. బుధుడు, బృహస్పతి కలయిక వల్ల ఏ ఏ రాశుల వారు ధనవంతులు అవుతారో తెలుసుకుందాం.

మేష రాశి

హోలీ తర్వాత వచ్చే సమయం మేష రాశి వారికి ఎంతో శుభదాయకంగా ఉంటుంది ఈ రాశిలోనే బుధుడు, బృహస్పతి కలియక వల్ల నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఫలితంతో మీరు చేసే ప్రతి పనిలో ఆశించిన విజయాలు లభిస్తాయి. శారీర సౌకర్యాలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. కెరీర్ కి కొత్త అవకాశాలు లభిస్తాయి.

మిథున రాశి

బుధుడు రాశి మార్పు మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు మంచి పెట్టుబడిదారులు దొరుకుతారు. ప్రేమ జీవితంలోని ఒడిదుడుకులు ఉంటాయి కానీ వాటిని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. మీ ఎదుగుదలకు అనేక మార్గాలు కనిపిస్తాయి.

కర్కాటక రాశి

నవపంచమ రాజయోగం కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. జీవితంలో సానుకూలత ఉంటుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది

సింహ రాశి

నవపంచమ రాజయోగంతో సింహ రాశి వారికి సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా ప్రశంసలు లభిస్తాయి. మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. పనికి సంబంధించి విదేశీ ప్రయాణాలు చేస్తారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది.

తులా రాశి

మార్చి చివరి వారం నుంచి తులా రాశి వారికి మంచి రోజులు రానున్నాయి. శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో ఉన్నతాధికారులు సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ధనుస్సు రాశి

బుధుడి సంచారం వల్ల ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాపారంలో అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెడితే ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

తదుపరి వ్యాసం