Mars jupiter conjunction: గురు కుజ కలయిక.. ఆగస్ట్ 26 వరకు ఈ నాలుగు రాశుల వారికి బాధలు తప్పవు
11 July 2024, 6:00 IST
- Mars jupiter conjunction: వృషభ రాశిలో కుజుడు-గురు కలయిక త్వరలో ఏర్పడుతుంది. కొన్ని రాశుల వారికి కుజుడు శుక్రుడు రాశిలోకి వెళ్లడం వల్ల సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. ఈ రాశుల గురించి తెలుసుకోండి.
వృషభ రాశిలో కుజుడు-గురు కలయిక
Mars jupiter conjunction: ప్రస్తుతం దేవ గురువు బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. మరో రెండు రోజుల్లో అన్ని గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు కూడా ఇదే రాశిలో ప్రవేశిస్తాడు.
సుమారు 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో కుజుడు, గురు గ్రహ కలయిక ఏర్పడబోతోంది. జూలై 12 న కుజుడు ఇప్పటికే బృహస్పతి ఉన్న వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు, గురు గ్రహాల కలయిక ఆగస్టు 26 వరకు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రెండు గ్రహాల కలయికను శుభప్రదంగా భావిస్తారు. అంగారకుడు, బృహస్పతి కలయిక కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. కుజుడు వృషభ రాశిలో 45 రోజుల పాటు ఉంటాడు. అప్పటి వరకు ఈ నాలుగు రాశుల వారికి మాత్రం ఇబ్బందికారంగా ఉంటుంది. గురు, కుజ కలయిక ఏ రాశుల వారికి కష్టకాలం తెస్తుందో తెలుసుకోండి.
వృషభ రాశి
ఈ రెండు గ్రహాల కలయిక వృషభ రాశిలోనే జరుగుతుంది. ఫలితంగా ఈ సమయం వృషభ రాశి వారికి బాధాకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపార సంబంధిత పనులలో అడ్డంకులు ఏర్పడవచ్చు. అయితే కాలక్రమేణా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఈ సమయంలో ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకపోవడమే మంచిది. లేదంటే మీరు ఇచ్చిన డబ్బు తిరిగిరాకపోవచ్చు.
మిథున రాశి
మిథున రాశి ఉన్నవారు ఈ కాలంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీ ఖర్చులు పెరగవచ్చు, ఇది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఆర్థిక బడ్జెట్‌ను అనుసరించని వారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు.
తులా రాశి
తులా రాశి వారు ఈ కాలంలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారవచ్చు. ఈ సమయంలో మీరు డబ్బు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీరు డబ్బు లావాదేవీలు చేస్తే నష్టపోయే అవకాశం ఉంది.
కుంభ రాశి
కుంభ రాశి వారు ఈ సమయంలో ప్రమాదాలకు దూరంగా ఉండాలి. వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించాలి. మీరు మీ కెరీర్‌లో మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు. డబ్బుకు సంబంధించిన విషయాలలో జాగ్రత్త అవసరం. మీరు ఊహించని విధంగా డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు.
గురు, కుజ కలయిక కొన్ని రాశుల వారికి మాత్రం మేలు చేస్తుంది. అనుకోకుండా ధనలాభం పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మేషం, ధనుస్సు రాశుల వారికి ఈ రెండు గ్రహాల అనుకూల ప్రయోజనాలు ఇస్తాయి. సంపద పెరిగే అవకాశాలు వీరికి పుష్కలంగా ఉన్నాయి. వృత్తి పురోభివృద్ధికి అనేక అవకాశాలు రావడంతో ఆనందంతో పొంగిపోతారు. ధార్మిక కార్యక్రమాల పట్ల అధిక ఆసక్తి కనబరుస్తారు. మతపరమైన ప్రదేశానికి ట్రిప్ కి కూడా వెళతారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.