తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Maha Shivaratri Puja Vidhanam: మహా శివరాత్రి పూజా విధానం.. ఆరోజు నాలుగు సార్లు చేసే పూజ ప్రాముఖ్యత ఏంటి?

Maha shivaratri Puja Vidhanam: మహా శివరాత్రి పూజా విధానం.. ఆరోజు నాలుగు సార్లు చేసే పూజ ప్రాముఖ్యత ఏంటి?

Gunti Soundarya HT Telugu

07 March 2024, 13:12 IST

    • Maha shivaratri puja vidhanam: మహా శివరాత్రి నాలుగు దశలలో శివ పూజ చేస్తారు. నాలుగు సార్లు చేసే పూజా విధానం దానికున్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. 
మహా శివరాత్రి పూజ విధానం
మహా శివరాత్రి పూజ విధానం (pinterest)

మహా శివరాత్రి పూజ విధానం

Maha shivaratri puja vidhanam: మహా శివరాత్రి రోజు భక్తులు పొద్దునంత ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేస్తారు. చీకటి, అజ్ఞానాన్ని అధిగమించేందుకు మహాశివరాత్రి జాగరణ ఉపయోగపడుతుందని భక్తులు విశ్వాసం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పాలు, పండ్లు, గంగా జలం వంటి వాటిని శివుడికి సమర్పిస్తారు. ఈ ఏడాది మహా శివరాత్రి మార్చి 8వ తేదీ జరుపుకోనున్నారు.

మహా శివరాత్రి పూజ సమయం

మాఘ చతుర్దశి తిథి మార్చి 8 రాత్రి 9 57 గంటలకు ప్రారంభమవుతుంది.

చతుర్థి తిథి మార్చి 9 సాయంత్రం 6:17 గంటలకు ముగుస్తుంది.

మార్చి 8 అర్థరాత్రి 12.07 గంటల నుంచి 12.56 గంటల వరకు (తెల్లవారితే మార్చి 9) నిషిత కాల పూజ సమయం ఉంటుంది.

శివరాత్రి రోజు కుటుంబ సభ్యులందరితో కలిసి ఆధ్యాత్మిక భావంలో మునిగిపోతారు. శివుడిని స్మరించుకుంటూ పూజలు చేస్తారు. మహా శివరాత్రి రోజు పూజ నాలుగు దశల్లో ఉంటుంది. ఏ దశలో పూజ ఎలా చేయాలి? ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసుకుందాం.

మహాశివరాత్రి మొదటి జాము పూజ

మొదటి జాము పూజా ముహూర్తం సాయంత్రం 6. 27 గంటలకు ప్రారంభమై రాత్రి 9. 28 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో భక్తులు దేవాలయాలు లేదా ఇంట్లో శివునికి పూజలు నిర్వహిస్తారు. శివ మంత్రాలు పఠిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ సమయంలో శివుని ఆరాధించడం వల్ల మనసు శుద్ధి అవుతుంది. ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. మొదటి జామున పూజా సమయంలో శివలింగానికి నీరు, స్వచ్ఛమైన పాలు సమర్పిస్తారు.

రెండవ జాము ప్రార్థనా విధానం

రెండవ జాము అర్ధరాత్రి సమయంలో ప్రారంభమవుతుంది. పూజా సమయం రాత్రి 9. 29 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12. 31 గంటలకు ముగుస్తుంది. శివపూజ, ధ్యానం చేయడానికి ఇది అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఆధ్యాత్మిక శక్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. హృదయ పూర్వకంగా శివుని ఆరాధించడం వల్ల ఆధ్యాత్మికంగా బలపడతారు. అందుకే ఈ సమయంలో నిద్రపోకుండా జాగరణ చేస్తారు. శివనామాన్ని స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో ప్రజల శివుడిని ఆరాధిస్తారు. రెండవ జాము పూజ చేసేటప్పుడు శివలింగానికి నీరు, పెరుగు సమర్పిస్తారు. లేదా వాటితో అభిషేకిస్తారు.

మూడో దశ పూజా విధానం

రెండవ దశ పూర్తయిన తర్వాత మూడో దశ పూజా విధానం ప్రారంభమవుతుంది. ఇది తెల్లవారుజాము నుంచి మొదలవుతుంది. ఈ సమయంలో ఆధ్యాత్మిక వృద్ధి, జ్ఞానోదయం కోసం భగవంతుని ఆశీస్సులు కోరుతూ భక్తులు తమ ధ్యానాన్ని కొనసాగిస్తారు. మూడవ దశ పూజ రాత్రి 12. 32 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 3.34 గంటల వరకు కొనసాగుతుంది. అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి తమని తీసుకురమ్మని కోరుకుంటూ భక్తులు శివయ్యను వేడుకుంటారు. ఈ సమయంలో శివలింగానికి నీరు, నెయ్యి సమర్పించాలి.

నాలుగో దశ పూజా విధానం

నాలుగో దశ పూజ తెల్లవారకముందే ప్రారంభమవుతుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో ఈ పూజ చేస్తారు. ఈ సమయంలో దైవ శక్తి వాతావరణంలోకి ప్రవేశిస్తుందని లోతైన ధ్యానం ఆత్మ పరిశీలనకు అనువైనదిగా ఉంటుందని నమ్ముతారు. భక్తులు బ్రహ్మ ముహూర్తంలో శివుని స్మరించుకుంటూ ఆయన దీవెనలు కావాలని కోరుకుంటూ, తమను చల్లగా చూసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పూజ చేస్తారు. నాలుగో జామున పూజా సమయంలో శివలింగానికి తేనే, నీరు, పాలు సమర్పిస్తారు. వీటితోపాటు బిల్వపత్రాలు, తెల్లటి పూలు కూడా శివలింగానికి సమర్పించవచ్చు.

శివలింగానికి అభిషేకం చేసే సమయంలో “ఓం నమః శివాయ”, “మృత్యుంజయ మంత్రం” తప్పనిసరిగా పఠించాలి.

ధ్యానం ప్రాముఖ్యత

మహా శివరాత్రి సమయంలో ధ్యానం చేయడానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనల్ని మనం లోపల నుంచి శుభ్రపరచుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే మనిషిని శుద్ధి చేసుకోవడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. మనసు, శరీరం, ఆత్మ స్వచ్చంగా ఉంచుకునేందుకు భగవంతుని శక్తితో ఐక్యం కావడానికి సహాయపడుతుంది. నాలుగు దశలో పూజలు చేసే సమయంలో ధ్యానం మనల్ని పరమశివునితో అనుసంధానం అయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడుతుంది. మన కోరికలను నిజం చేస్తుంది. నిశ్చలమైన మనసుతో ధ్యానం చేసినప్పుడు దైవంతో సంబంధాన్ని ఏర్పరచుకుంటాము.

తదుపరి వ్యాసం