Maha Shivratri 2023 : దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 5 ప్రసిద్ధ దేవాలయాలు
Maha Shivratri 2023 : ఫిబ్రవరి 18న మహా శివరాత్రి. శివుడికి అత్యంత ఇష్టమైన రోజు. పురాణాల్లోనూ శివరాత్రికి ఎంతో విశిష్టత ఉంది. ఆ రోజున శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. అయితే దక్షిణ భారతదేశంలో తప్పకుండా దర్శించాల్సిన కొన్ని ఆలయాలు ఉన్నాయి.
భారతదేశం అనేక సంస్కృతులు, పండుగలతో ఉన్న విభిన్నమైన దేశం. దేశంలోని ప్రసిద్ధ పండుగలలో ఒకటి మహా శివరాత్రి(Maha Shivratri). అత్యంత వైభవంగా భక్తితో జరుపుకొంటారు. పురాణాల ప్రకారం, మహా శివరాత్రి మొదటిసారిగా శివుడు తాండవ నృత్యం చేసిన సందర్భాన్ని సూచిస్తుంది. ఈ రోజున శివుని ఆలయాలను సందర్శించడం, పూజించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ పండుగలో మీరు తప్పక సందర్శించాల్సిన దక్షిణ భారతదేశంలోని(South India) ప్రసిద్ధ దేవాలయాల జాబితాను ఇక్కడ ఉంది.
మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీశైలం
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున ఆలయం, శ్రీశైలం ఆలయం(Srisailam Temple) తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా ఫేమస్. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు భక్తలు వస్తుంటారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఈ ఆలయం దగ్గరలోనే కృష్ణమ్మ వెళ్తుంది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. ఆ దేవ దేవుడిని దర్శించుకుంటారు. శివరాత్రికి ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.
బృహదీశ్వరాలయం, తంజావూరు
ఇది తమిళనాడు(Tamil Nadu)లోని తంజావూరులో కావేరి నది దక్షిణ ఒడ్డున ఉన్న దేవాలయం. దీనిని సాధారణంగా తంజై కోవిల్, పెరువుడైయార్ కోవిల్ అని పిలుస్తారు. ఇది చోళుల కాళంలో నిర్మించబడింది. శిల్పకళ అద్బుతంగా ఉంటుంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన పిరమిడ్ దేవాలయం.
మురుడేశ్వర దేవాలయం, కర్ణాటక
మురుడేశ్వర్ ఆలయం(murudeshwar temple) ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివ విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. మురుడేశ్వర అనేది కోస్టల్ కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని భట్కల్ తాలూకాలోని ఉంటుంది. సముద్రం పక్కనే ఆ శివుడి విగ్రహం చూస్తే మనసుకు ఏదో తెలియని తృప్తి కలుగుతుంది. మంగళూరు, కార్వార్ హైవేపై ఉంది.
విరూపాక్ష దేవాలయం, హంపి
ఇది కర్ణాటకలో ఉంది. తొమ్మిది అంచెల తూర్పు ద్వారంతో, అందమైన స్తంభాలతో రూపొందించబడింది. ఈ ఆలయం చుట్టూ ముఖద్వారాలు, ప్రాంగణాలు, స్తంభాల గుట్టలు, చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడకు వెళ్తే.. ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది.
వడక్కునాథన్ ఆలయం, కేరళ
ఇది కేరళ(Kerala)లోని త్రిస్సూర్ నగరంలో ఉంది. దక్షిణ భారతదేశంలో శివునికి సంబంధింది పురాతన ఆలయం. ఈ ఆలయం నిర్మాణ శైలికి ఒక అద్భుతమైన ఉదాహరణ. అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. ఆలయానికి నాలుగు వైపులా స్మారక గోపురం ఉంది.
సంబంధిత కథనం