తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Karthika Masam 2023 : ఈ కారణాలతో కార్తీక మాసం చాలా పవిత్రమైనది

Karthika Masam 2023 : ఈ కారణాలతో కార్తీక మాసం చాలా పవిత్రమైనది

Anand Sai HT Telugu

13 November 2023, 11:23 IST

google News
    • Karthika Masam 2023 : సంవత్సరంలో కార్తీక మాసం అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఏ నెలకు లేనంత పవిత్రత కార్తీక మాసానికి ఉందని నమ్ముతారు. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.
కార్తీక మాసం
కార్తీక మాసం

కార్తీక మాసం

కార్తీక మాసం హిందువులలో అత్యంత పవిత్రమైన మాసం. కార్తీక మాసంలో అనేక ముఖ్యమైన పండుగలు వస్తాయి. శివుడు, విష్ణువును ఆరాధించడానికి ఉత్తమమైనది. ఈ పవిత్ర మాసంలో శివుడు, విష్ణువు కలిసి ఉంటారని నమ్ముతారు. ఈ మాసాన్ని పురుషోత్తమ మాస అని కూడా పిలుస్తారు.

ఈ మాసంలో దీపారాధన, ఉపవాసం, రుద్రాభిషేకం, బిల్వపూజ, విష్ణుసహస్రనామ పారాయణం చేయడం వల్ల గొప్ప పుణ్యఫలం లభిస్తుందని, సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. అటువంటి పవిత్ర మాసం గురించి మరింత సమాచారం మీ కోసం ఇక్కడ ఉంది. కార్తీక మాసాన్ని ఎందుకు పవిత్రమైనది అని పిలుస్తారో చూద్దాం..

చాలా దేవాలయాల్లో దీపోత్సవాలు ఈ సమయంలోనే జరగడం గమనించవచ్చు. అలాగే దీపావళి కూడా అదే సమయంలో వస్తుంది. కార్తీక దీపోత్సవం అంటే దీపాలు వెలిగించడం. దీపం మన శరీరానికి ప్రతీక అయితే, కాంతి మన ఆత్మకు ప్రతీక. మనం దీపం వెలిగిస్తే, మన మనస్సు స్వచ్ఛంగా మారుతుందని, చీకటి, అజ్ఞానం, కోపం, దురాశ, అసూయ, ద్వేషం, పగ వంటి అన్ని ప్రతికూలతల నుండి విముక్తి పొందుతుందని నమ్ముతారు.

అంతర్గత ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఎదురుచూడడానికి, మంచి వ్యక్తులుగా ఎదగడానికి ఇది గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. నిజమైన ఆనందాన్ని అనుభవించడానికి మనస్సు, శరీరం, ఆత్మ స్వచ్ఛతను పాటించడం, మన స్పృహ స్థాయిని పెంచడం చాలా ముఖ్యం. కార్తీక మాసం వీటికి అనువైన సమయంగా చెబుతారు.

పవిత్ర కార్తీక మాసంలో జామకాయ చెట్టును పూజిస్తారు. కల్పవృక్షం, అమృతఫలం అని కూడా పిలువబడే ఈ చెట్టుకు శివపురాణంలో ప్రస్తావన ఉంది.

కార్తీక పూర్ణిమ నాడు, శివుడు భూమిపైకి దిగి, మొత్తం విశ్వంతో ఏకమవుతాడని నమ్ముతారు. ఈ రోజున 365 వత్తులతో నెయ్యి దీపాలు వెలిగిస్తే సంవత్సరంలో ప్రతిరోజు దీపాలు వెలిగించినదానితో సమానం. కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం, సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరం, మనస్సు శుభ్రపడతాయి. ఈ రోజున బ్రాహ్మణులకు అన్నం, బెల్లం, పండ్లు, పాల రూపంలో నైవేద్యాలు సమర్పించాలి.

ఓం నమః శివాయః మంత్రాన్ని పఠించడం మన మనస్సును ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. కార్తీక మాసంలో గుడిలో లేదా ఇంట్లో కూర్చొని ఈ మంత్రాన్ని జపించండి.

ఈ పవిత్ర మాసంలో దీపావళి, ఏకాదశి, గోపూజ వంటి వివిధ పండుగలు వస్తాయి. వీటిని భక్తితో పాటిస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది.

కార్తీక మాస ఆచారాలను పాటించడం ద్వారా వ్యక్తిగత క్రమశిక్షణ, సమాజం విలువలను పొందగలం. నదులు లేదా సరస్సుల దగ్గర సూర్యోదయానికి ముందు స్నానం చేయడం ద్వారా ఉదయాన్నే లేవడం నేర్చుకుంటాం. చల్లటి నీటితో స్నానం చేయడం ద్వారా శీతాకాలాన్ని ఎదుర్కోవచ్చు. నీటి కాలుష్యం, ఆరోగ్యం గురించి మనం తెలుసుకోవచ్చు. ఇలా కార్తీక మాసం చాలా పవిత్రమైనది, శుభమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో చాలామంది ఉపవాసాలు ఉంటారు. నాన్ వెజ్ తినరు.. తినకూడదు కూడా.

తదుపరి వ్యాసం