Guava Benefits | బరువు తగ్గాలన్నా.. స్కిన్ కేర్కైనా.. జామకాయకు జై చెప్పాల్సిందే
అందంగా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా.. ఈ ఒక్క ఫ్రూట్ తినమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఏమిటా ఫ్రూట్ అనుకుంటున్నారా? అదేనండి.. ఏ సీజన్లోనైనా.. మనకు అందుబాటులో, అందుబాటు ధరల్లో దొరికే జామపండు. ఈ పండుతో వచ్చే లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టలేమనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Guava Benefits | అప్పుడప్పుడు మీల్స్ మధ్యలో స్నాక్స్ తినాలనిపిస్తుంది. కానీ డైట్ చేసే వారు ఏది పడితే అది తినలేరు. మరి ఆరోగ్యకరమైన హెల్తీ స్నాక్ ఏదైనా ఉందా అంటే అది మన జామపండే అంటున్నారు నిపుణులు. అవును మరి దీనిలో ఉండే పోషకాలు మీకు శక్తిని అందించడమే కాకుండా.. ఎక్కువ సేపు ఆకలికాకుండా మిమ్మల్ని ఉంచుతాయి. మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మ, ఆరోగ్య రక్షణనకు ఎక్కువ ప్రాధన్యత ఇచ్చేవారు.. రోజూ ఓ జామకాయ తినేయండి.
చర్మ ఆరోగ్యానికై..
జామపండులో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. విటమిన్ ఎ, సి, కెరోటిన్, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి. జామపండ్లలోని అధిక ఆస్ట్రింజెంట్ లక్షణాలు ముఖ కండరాలను కూడా బిగుతుగా చేస్తాయి. మీరు జామపండు, దాని ఆకులను చర్మానికి అప్లై చేస్తే కోల్పోయిన చర్మ కాంతిని తిరిగి పొందవచ్చు. పండులోని విటమిన్ కె చర్మం రంగు మారడం, నల్లటి వలయాలు, ఎరుపు, మొటిమల చికాకులను దూరం చేస్తుంది.
ఇమ్యూనిటీ బూస్టర్
చాలా పండ్ల మాదిరిగానే.. జామపండ్లలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఒక్క జామపండులోనే విటమిన్ సి.. నారింజ పండు కంటే రెట్టింపు ఉంటుంది. విటమిన్ సి జలుబును తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్‌లను చంపడానికి కూడా సహాయపడుతుంది. తద్వారా సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
మెరుగైన జీర్ణవ్యవస్థకై
మనకు రోజులో కావాల్సిన ఫైబర్‌లో జామపండు 12% ఇస్తుంది. ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జామ గింజలు కూడా మంచి భేదిమందుగా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు సహాయపడతాయి. మలబద్ధకంతో బాధపడేవారు జామపండ్ల వల్ల చాలా ప్రయోజనం పొందవచ్చు. జామ ఆకు సారం యాంటీమైక్రోబయల్, డయేరియాను కూడా నిరోధించడంలో సహాయం చేస్తుంది.
బరువు తగ్గడానికి..
జామ మీ జీవక్రియను నియంత్రించడమే కాకుండా.. బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన చిరుతిండి. ఇది మీ కడుపుని త్వరగా నిండేలా చేసి... ఆకలిని తగ్గిస్తుంది. అంతేకాకుండా జామపండ్లలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది కానీ కేలరీలు తక్కువగా ఉంటాయి. అనేక ఇతర పండ్లతో పోలిస్తే పచ్చి జామపండ్లలో చాలా తక్కువ చక్కెర ఉంటుంది. అందువల్ల ఇవి మధుమేహం ఉన్నవారికి కూడా అనుకూలమైనవి.
గుండెను ఆరోగ్యానికై..
జామకాయలు శరీరంలోని సోడియం, పొటాషియం సమతుల్యతను మెరుగుపరుస్తాయి. రక్తపోటుతో బాధపడేవారిలో రక్తపోటును నియంత్రిస్తాయి. ఈ పండ్లు గుండె జబ్బులకు మూలకారణమైన చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిని కూడా పెంచుతాయి. అధిక మొత్తంలో పొటాషియం, ఫైబర్ కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తుంది.
సంబంధిత కథనం