Jupiter retrograde: దసరా ముందు నుంచి వీరికి కష్టాలు ఆరంభం- ఆర్థిక, ఆరోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్త
05 October 2024, 10:41 IST
- Jupiter retrograde: బృహస్పతి మరో నాలుగు రోజుల్లో తిరోగమన స్థితిలోకి వెళ్లబోతుంటాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి దసరా ముందు నుంచే కష్టాలు రాబోతున్నాయి. ఆర్థిక పరంగా చిక్కులు, అనారోగ్య సమస్యలతో సతమతం అవుతారు.
బృహస్పతి తిరోగమనం
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని తర్వాత ఒక రాశిని మారేందుకు ఎక్కువ సమయం తీసుకునే గ్రహం దేవగురువు బృహస్పతి. ఒక రాశి చక్రం పూర్తి చేసేందుకు 13 నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం గురు గ్రహం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు.
మరికొద్ది రోజుల్లో గురు గ్రహం తిరోగమన దశలోకి వెళ్లబోతుంది. అక్టోబర్ 9 ఉదయం 10.01 గంటలకు వృషభ రాశిలో తిరోగమనం చెందుతాడు. ఇది అన్ని రంగాల మీద ప్రభావం చూపుతుంది. ఇతరులతో కమ్యూనికేట్ అవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్య రంగంలో పని చేస్తున్న వారికి సమస్యలు కలుగుతాయి. కొన్ని కీలకమైన విషయాలలో నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇతరులతో విభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితిని అదుపు చేయడం కష్టమవుతుంది. కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి. ఆధ్యాత్మికంగా మాత్రం ఈ సమయంలో బలపడతారు.
మేష రాశి
బృహస్పతి తిరోగమనం మేష రాశి వారి మీద గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఈ రాశి మూడో ఇంట్లో సంచరిస్తాడు. ఈ గృహం బృహస్పతికి అనుకులమైనది కాదు. ఇది హానికర ప్రభావాలను చూపిస్తుంది. పనులు కార్యరూపం దాల్చడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. బృహస్పతి 9, 12వ గృహాలను పాలిస్తుంది. ఈ రెండు గృహాలు జ్ఞానం, ఆధ్యాత్మికత, కొత్త ప్రదేశాలను అన్వేషించడం, భౌతిక సంబంధాల నుండి విడిపోవడాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో మీరు పయనిస్తారు. కానీ బృహస్పతి తిరోగమనంలో ఉన్నప్పుడు మీ వైవాహిక జీవితం దెబ్బతింటుంది.
వృషభ రాశి
వృషభ రాశి 8, 11వ గృహాధిపతి. రెండో ఇంట్లో తిరోగమనం చెందటం వల్ల వృషభ రాశికి ముఖ్యంగా హానికరం. ఆర్థిక విషయాలు, వ్యక్తిగత ఆస్తులకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. వ్యాపారం, ఫైనాన్స్ లో పెట్టుబడులు పెట్టె వాళ్ళు చాలా తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. పెట్టుబడులు పెట్టె ముందు చాలా ఆలోచించుకోవాలి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడితే వ్యాపార ఒప్పందాలలో వృద్ధి చెందుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి ఆరు, తొమ్మిదవ ఇంటికి గురు గ్రహం అధిపతి. పన్నెండవ ఇంట్లో తిరోగమనం చెందుతాడు. ఆర్థికపరమైన విషయాల్లో సవాళ్ళు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ కాలంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి అడ్డంకులు ఎదురవుతాయి. అదృష్టం లేకపోవడం వల్ల కొన్ని పరిస్థితులు చేజారిపోతాయి.
మకర రాశి
బృహస్పతి మూడో, పన్నెండు గృహాలకు అధిపతి. తిరోగమన స్థితిలో ఆరో ఇంట్లో ఉంటాడు. ఇది అత్యంత ప్రతికూలంగా ఉంటుంది. వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. ఆరో ఇంట్లో తిరోగమనం చెందడం వల్ల మీకు చర్మ అలర్జీలు, ఇతర పర్యావరణ అలర్జీలు, గొంతు లేదా శ్వాస సంబంధిత సమస్యలు రావచ్చు. బృహస్పతి బాగా లేకుంటే కొందరికి ప్రాణాంతకమైన ప్రమాదాలు సంభవించవచ్చు. ఆరోగ్యం పరంగా ఇది చాలా చెడ్డ స్థానం. మీరు ఊబకాయంతో కూడా ఇబ్బంది పడతారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.