Mercury transit: అక్టోబర్ నెలలో బుధుడి డబుల్ ధమాకా- వీరికి వ్యాపారంలో ఊహించని ఆర్థిక లాభాలు-mercury double transit in october month three zodiac signs get unexpected money benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Transit: అక్టోబర్ నెలలో బుధుడి డబుల్ ధమాకా- వీరికి వ్యాపారంలో ఊహించని ఆర్థిక లాభాలు

Mercury transit: అక్టోబర్ నెలలో బుధుడి డబుల్ ధమాకా- వీరికి వ్యాపారంలో ఊహించని ఆర్థిక లాభాలు

Gunti Soundarya HT Telugu

Mercury transit: బుధుడు అక్టోబర్ లో రెండు సార్లు రాశులను మార్చి తన ప్రభావం చూపించబోతున్నాడు. కొన్ని రాశుల వారికి వ్యాపారంలో విజయాన్ని అందిస్తాడు. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు అందించబోతున్నాడు. అది ఏ రాశులకు అనేది ఇక్కడ తెలుసుకోండి.

బుధుడి డబుల్ కదలిక

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాకుమారుడు బుధుడు అక్టోబర్ నెలలో రెండు సార్లు తన రాశిని మార్చుకుని కొందరికి వరాన్ని ప్రసాదించబోతున్నాడు. జ్ఞానం, తెలివితేటలు, వాక్కుకు కారకుడైన బుధుడు ఈ నెలలో రెండుసార్లు ప్రయాణిస్తాడు.

ముందుగా అక్టోబర్ 10 బుధుడు తులా రాశిలోకి ఉదయం 11.09 గంటలకు ప్రవేశిస్తాడు. అస్తంగత్వ దశలో ఉన్న బుధుడు అక్టోబర్ 22న తులా రాశిలో ఉదయిస్తాడు. అనంతరం అక్టోబర్ 29 రాత్రి 10:24 గంటలకు తులా రాశి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది.

ఈ కాలంలో కొన్ని రాశుల వాళ్ళు అత్యధిక ప్రయోజనాలు పొందుతారు. అపారమైన విజయాన్ని సొంతం చేసుకుంటారు. బుధ సంచారం వ్యాపార రంగం మీద విశేషమైన ఫలితాలు చూపిస్తుంది. మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. బుధుడి శుభ ప్రభావంతో ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు. జాతకంలో బుధ గ్రహం శుభ స్థానంలో ఉంటే వ్యాపార, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బుధుడి డబుల్ కదలిక కొన్ని రాశుల వారికి ఇబ్బందిని కలిగిస్తుంది. కానీ కొన్ని రాశులకు మాత్రం ఊహించని మేలు చేస్తుంది. ఏ రాశుల వారికి వరంగా మారుతుందో చూద్దాం.

తులా రాశి

బుధుడి తొలి సంచారం తులా రాశిలోనే జరుగుతుంది. బుధుడి డబుల్ కదలిక ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. తమ కెరీర్‌లో ఎదుర్కొనే కష్టాలన్నీ ఇప్పుడు ముగుస్తాయి. వ్యాపార వ్యక్తులు కూడా వివిధ ఒప్పందాల నుండి భారీ లాభాలను పొందుతారు. సంపద పెరుగుతుంది . కాలానుగుణంగా ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. ఒంటరి వ్యక్తులు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మీ ప్రసంగంలో మాధుర్యం పెరుగుతుంది. దీని కారణంగా వ్యాపారంలో రాణిస్తారు, మాటలతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు.

వృశ్చిక రాశి

బుధుడి సంచారం వృశ్చిక రాశి వారికి ఆర్థిక జీవితాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. డబ్బు ఆదా చేసుకుంటారు. పొదుపు బాగుండటం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. గతంలో వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అన్ని రకాల సౌకర్యాలు అనుభవిస్తారు. జీవితం మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీ కలలు నెరవేరే అవకాశం ఉండి. వృశ్చిక రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పురోభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి.

మకర రాశి

బుధ సంచారం మకర రాశి వారి జీవితం మీద సానుకూల ప్రభావం చూపుతుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఈ నెల మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార వ్యక్తులు గొప్ప విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ప్రమోషన్లు లభిస్తాయి. కార్యాలయంలో ఉద్యోగులు అండగా నిలుస్తారు. ఈ కాలంలో మీ ప్రయత్నాలకు తగిన విధంగా విజయాన్ని అందుకుంటారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.