Saturn transit: శని సంచారంతో 2025 సంవత్సరంలో లాభపడే రాశులు ఇవే, వీరికి డబ్బు కొరత ఉండదు-next year saturn move meena rashi three zodiac signs never face financial problems ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Transit: శని సంచారంతో 2025 సంవత్సరంలో లాభపడే రాశులు ఇవే, వీరికి డబ్బు కొరత ఉండదు

Saturn transit: శని సంచారంతో 2025 సంవత్సరంలో లాభపడే రాశులు ఇవే, వీరికి డబ్బు కొరత ఉండదు

Gunti Soundarya HT Telugu
Sep 21, 2024 02:00 PM IST

2025 లో శని కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల మూడు రాశుల వారికి గొప్ప ప్రయోజనాలు దక్కుతాయి. వచ్చే ఏడాది వీరికి డబ్బు కొరత అనేది ఉండదు. విదేశాల్లో వ్యాపారం చేయాలనే కోరిక నెరవేరుతుంది.

శని సంచారంతో వీరికి డబ్బే డబ్బు
శని సంచారంతో వీరికి డబ్బే డబ్బు

Saturn transit: వేద జ్యోతిషశాస్త్రంలో, శని అత్యంత క్రూరమైన గ్రహాలలో ఒకటిగా భావిస్తారు. కానీ కర్మల ప్రకారం ఫలితాలను అందిస్తుంది. కష్టపడి ఎవరినీ మోసం చేయకుండా పనులు చేసుకుంటే శని అనుగ్రహం లభిస్తుంది. అదే చెడు పనులు చేస్తే శని ఆగ్రహం ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్రస్తుతం శని కుంభ రాశిలో ఉన్నాడు. 29 మార్చి 2025న, శని దేవుడు కుంభ రాశి నుండి బయటకు వెళతాడు. బృహస్పతి గ్రహానికి చెందిన రాశిచక్రం అయిన మీన రాశిలోకి వెళతాడు. మార్చి 29న శనిదేవుడు రాత్రి 10:07 గంటలకు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో మకర రాశి వారికి ఏలినాటి శని ముగుస్తుంది. మేష రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. శని మీన రాశిలోకి ప్రవేశించిన రోజున కూడా సూర్యగ్రహణం ఏర్పడుతోంది. మీన రాశిలో శని సంచారము వల్ల కొన్ని రాశుల వాళ్ళు చాలా ప్రయోజనాలను పొందబోతున్నారు. అవి ఏ రాశులో తెలుసుకుందాం.

వృషభ రాశి

వృషభ రాశి తొమ్మిది, పది గృహాలను శని పాలిస్తాడు. పదకొండవ ఇంట్లో సంచరిస్తాడు. దీని వల్ల వీరి జీవితంలో వివిధ అంశాలలో భారీ లాభాలను పొందే సూచనలు ఉన్నాయి. మీన రాశిలోకి శని సంచారం వారికి లాభదాయకంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఇప్పుడే పూర్తి చేయగలరు. మీ ప్రయత్నాలకు మీ ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ప్రతి రంగంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో వృషభ రాశి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు జీతాలు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు పని కోసం చాలా ప్రయాణం చేయాల్సి రావచ్చు. మీ డబ్బు చాలా కాలం పాటు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటేదాన్ని తిరిగి పొందుతారు. డబ్బు కొరత తీరుతుంది.

మిథున రాశి

శని దేవుడు మిథున రాశిలో ఎనిమిది, తొమ్మిదవ ఇంటికి అధిపతి. పదవ ఇంట్లో సంచరిస్తాడు. మిథున రాశికి అధిపతి బుధుడు. శని, బుధ గ్రహాల మధ్య స్నేహపూర్వక సంబంధం ఉంది. అందువల్ల ఈ సంచారం మిథున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తమ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. అనవసరమైన ఖర్చుల నుండి ఉపశమనం పొందుతారు. నాల్గవ, సప్తమ, పన్నెండవ గృహాల మీద శని చూపు ఉంటుంది. అందువల్ల కొద్ది రోజుల పాటు కుటుంబంలో విభేదాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో గొప్ప మెరుగుదలకు అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కోరిక చాలా కాలంగా నెరవేరకుండా ఉంటే అది ఇప్పుడు నెరవేరుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కెరీర్‌లో చాలా ప్రయోజనాలను పొందుతారు.

కుంభ రాశి

కుంభ రాశి పన్నెండవ ఇంటికి శని దేవుడు అధిపతి. రెండవ ఇంట్లో శని సంచారం జరుగుతుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ జరుగుతోంది. శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కుంభ రాశిలోని నాల్గవ, ఎనిమిదవ, పదకొండవ గృహాలలో శనికి ఒక అంశ ఉంటుంది. ఆర్థిక జీవితంలో అపారమైన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. కుటుంబాలతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది. విదేశాలలో ఉద్యోగం చేయాలనుకుంటే ఈ కాలంలో వారి కోరికలు నెరవేరుతాయి. విదేశాల్లో వ్యాపారం చేయాలనే వారి కల ఇప్పుడు నెరవేరనుంది. ఆస్తి క్రయ విక్రయాలు జరుగుతాయి. జులై, నవంబర్ మధ్య కాలంలో మాత్రం కుటుంబ సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ శని సంచార సమయంలో భారీ ఆర్థిక లాభాలు కలుగుతాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.