Saturn transit: మీన రాశిలో శని సంచారం-2025లో ఈ రాశుల వారికి పండుగే, ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి
Saturn transit: శని వచ్చే ఏడాది తన రాశిని మార్చబోతున్నాడు. కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల మూడు రాశుల వారికి పండుగలాంటి సమయం వస్తుంది. ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి. సమస్యల నుంచి బయట పడతారు.
Saturn transit: వేద జ్యోతిష్య శాస్త్రంలో శనిని క్రూరమైన గ్రహాలలో ఒకటిగా పిలుస్తారు. శనిని న్యాయ దేవుడు అంటారు. ఎందుకంటే ప్రజలు చేసే పనులకు అనుగుణంగా ఫలితాలను అందిస్తాడు. కష్టపడి పని చేసే వారికి శని ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటాయి.
ప్రస్తుతం శని కుంభ రాశిలో తిరోగమన స్థితిలో సంచరిస్తున్నాడు. నవంబర్ 15 నుంచి శని నేరుగా తన ప్రయాణం ప్రారంభిస్తుంది. రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని తన రాశిని మారుస్తాడు. వచ్చే ఏడాది శని కుంభ రాశిని వీడతాడు. 29 మార్చి 2025ణ శని మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల మూడు రాశుల వాళ్ళు భారీగా ప్రయోజనం పొందుతారు. సంపద, వృత్తిలో అపారమైన విజయాన్ని కలిగిస్తుంది. కుంభ రాశి నుండి శని నిష్క్రమించినప్పుడు వివిధ ప్రయోజనాలను పొందుతారు.
మీన రాశిలో శని సంచారం ఎప్పుడు?
29 మార్చి 2025న శని గ్రహం కుంభం నుంచి మీన రాశిలోకి వెళుతుంది. అయితే 22 ఫిబ్రవరి 2025న శని గ్రహం ఉదయం 11:23 గంటలకు శని దహనం చేస్తుంది. అది మార్చి 29న దాని దహన స్థితిలో మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత 31 మార్చి 2025న శని గ్రహం ఉదయం 12:43 గంటలకు ఉదయిస్తుంది. 13 జూలై 2025న శని మీన రాశిలో ఉదయం 07:24 గంటలకు తిరోగమనం చెందుతుంది. ఆపై 28 నవంబర్ 2025న ఉదయం 07:26 గంటలకు ప్రత్యక్షంగా మారుతుంది. శని రాశి మారడం వల్ల ఎవరికి లాభం చేకూరుతుందో చూద్దాం.
మకర రాశి
శని కుంభం నుండి మీన రాశిలోకి వెళ్ళినప్పుడు మకర రాశి వారికి ఏలినాటి శని నుండి ఉపశమనం లభిస్తుంది. భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నట్లయితే వారు ఇప్పుడు దాని నుండి ఉపశమనం పొందుతారు. కార్యాలయంలో విజయవంతమైన గుర్తింపును సాధించుకుంటారు. అవసరాలకు అనుగుణంగా అన్నీ చక్కగా అమరుతాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ప్రస్తుతం శని దయ్యా కొనసాగుతోంది. మీన రాశిలోకి శని ప్రవేశించినప్పుడు వీరికి దీని నుంచి విముక్తి కలుగుతుంది. తమ కెరీర్‌లో విజయాన్ని పొందుతారు. కార్యాలయంలో వారి పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. సంతోషంగా ఉంటారు. అధికారుల నుండి పదోన్నతులు లభిస్తాయి. ఈ కాలంలో వారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కూడా అర్థాష్టమ శని కొనసాగుతోంది. మీన రాశిలోకి వెళ్ళడం వల్ల వీరికి కూడా దీని నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ కాలంలో వారు భారీ ఆర్థిక లాభాలను పొందవచ్చు. మానసిక ఒత్తిడి సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారులకు, లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను అందుకుంటారు.
శనిని ప్రసన్నం చేసుకునే మార్గాలు
శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు నలుపు రంగు బట్టలు ధరించాలి. పెద్దలను గౌరవించాలి. మద్యం, మాంసం తీసుకోవద్దు. శనివారం శని దేవుడి ఆలయాన్ని సందర్శించాలి. శనికి తైలాభిషేకం చేయాలి. రబ్బరు, ఇనుము సంబంధిత వస్తువులను శనివారం నాడు కొనుగోలు చేయకూడదు. అలాగే శని ఆశీస్సులు పొందటం కోసం శనివారం ఉపవాసం ఉండాలి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.