October horoscope: అక్టోబర్ నెల ఈ రాశుల వారికి సమస్యలు ఇవ్వబోతుంది- పనుల్లో ఆటంకాలు, ఖర్చులు ఎక్కువే-how will the month of october be for the people check which zodiac signs get troubles in this month ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  October Horoscope: అక్టోబర్ నెల ఈ రాశుల వారికి సమస్యలు ఇవ్వబోతుంది- పనుల్లో ఆటంకాలు, ఖర్చులు ఎక్కువే

October horoscope: అక్టోబర్ నెల ఈ రాశుల వారికి సమస్యలు ఇవ్వబోతుంది- పనుల్లో ఆటంకాలు, ఖర్చులు ఎక్కువే

Gunti Soundarya HT Telugu
Oct 01, 2024 10:00 AM IST

October horoscope: అక్టోబర్ నెలలో ముఖ్యమైన పండుగలు వచ్చాయి. వాటితో పాటు గ్రహాల స్థానం మారడం కీలక పరిణామం. వీటి ప్రభావం ఏ రాశుల మీద ఉంటుంది. ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం.

అక్టోబర్ నెల రాశి ఫలాలు
అక్టోబర్ నెల రాశి ఫలాలు

October horoscope: గ్రహాలు, నక్షత్రాల స్థానాల పరంగా అక్టోబర్ నెల చాలా ప్రత్యేకమైనదిగా మారింది. వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అక్టోబర్‌లో అనేక గ్రహాలు, నక్షత్రాల స్థానాల్లో మార్పు ఉంటుంది. 

నెల ప్రారంభమే దేవి నవరాత్రులు ఉంటున్నాయి. అలాగే నవరాత్రులు మొదలయ్యే మొదటి రోజే అంటే అక్టోబర్ 3న న్యాయదేవుడిగా భావించే శని రాహువుకు చెందిన శతభిషా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 09  నుంచి దేవగురువు బృహస్పతి వృషభ రాశిలో తిరోగమన దశలో సంచరించబోతున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు బృహస్పతి ఇదే దశలో ఉంటాడు. 

అక్టోబర్ 10న గ్రహాల రాకుమారుడు బుధుడు కన్యా రాశిని విడిచి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం సొంత రాశిలో ఉన్న శుక్రుడు అక్టోబర్ 13న వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. నెలకు ఒకసారి రాశి మార్చే గ్రహాల రాకుమారుడు సూర్యుడు అక్టోబర్ 17న తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే తులా రాశిలో బుధుడు ఉండటంతో సూర్యుడితో కలయిక ఏర్పడుతుంది. ఇవి రెండూ కలిసి బుద్ధాదిత్య యోగాన్ని ఇస్తాయి. అక్టోబర్ 20న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహాల సంచారం ప్రభావం మొత్తం పన్నెండు రాశుల వారికి ప్రభావితం చేస్తుంది. ఈ విధంగా అక్టోబర్ నెల ప్రజలకు ఎలా ఉంటుందో జ్యోతిష్యుడి ద్వారా తెలుసుకోండి. 

అక్టోబర్ నెల ప్రజలకు ఎలా ఉండబోతుంది?

జ్యోతిష్య పండితులు చెప్పే దాని ప్రకారం అక్టోబర్ నెల ప్రజలకు ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించినప్పుడు క్షీణిస్తాడు.  అటువంటి పరిస్థితిలో ప్రజలు మితమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగ, వ్యాపారంలో చిక్కులు ఏర్పడతాయి. ఆదాయం మీద వాటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఖర్చులు ఎక్కువ అవుతాయి. అక్టోబర్ నెలలో ప్రజలకు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. పనిలో ఆటంకాలు ఉంటాయి. మేషం, మిథునం, సింహం, ధనుస్సు రాశుల వారికి బృహస్పతి వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. అంగారకుడి సంచారం వల్ల కర్కాటక రాశి వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. 

అక్టోబర్ నెల పండుగలు 

అక్టోబర్ నెలలో అనేక ఉపవాసాలు, పండుగలు మరియు ఖగోళ సంఘటనలు ఉంటాయి. సర్వ పితృ అమావాస్యతో మొదలై దీపావళి పండుగతో అక్టోబర్ నెల ముగుస్తుంది. సర్వ పితృ అమావాస్య అక్టోబర్ 2వ తేదీ వచ్చింది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 3 నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇదే రోజు నుంచి తెలుగు వారికి ఆశ్వయుజ మాసం ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 12న విజయదశమి పండుగతో ఇవి ముగుస్తాయి. ఈ సంవత్సరంలో రెండవ, చివరి సూర్యగ్రహణం కూడా అక్టోబర్ 3 న జరుగుతుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇక అక్టోబర్ 30వ తేదీ దీపావళి పండుగ జరుపుకోనున్నారు. దీపావళి తర్వాత శని తిరోగమన దశ నుంచి మళ్ళీ ప్రత్యక్ష మార్గాన సంచరిస్తాడు. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.