తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jupiter Transit: రాశి మారనున్న బృహస్పతి.. దేవ గురువు అనుగ్రహంతో ఈ ఐదు రాశుల భవిష్యత్ మారబోతుంది

Jupiter Transit: రాశి మారనున్న బృహస్పతి.. దేవ గురువు అనుగ్రహంతో ఈ ఐదు రాశుల భవిష్యత్ మారబోతుంది

Gunti Soundarya HT Telugu

22 February 2024, 16:58 IST

    • Jupiter Transit: దేవ గురువు బృహస్పతి మే నెలలో మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఫలితంగా ఐదు రాశుల జాతకుల భవిష్యత్ మారబోతుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోబోతున్నాయి. 
రాశి మారనున్న బృహస్పతి
రాశి మారనున్న బృహస్పతి

రాశి మారనున్న బృహస్పతి

Jupiter transit: నవగ్రహాలకు అధిపతిగా గురు భగవానుడిని పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. దేవ గురువు కృప ఉంటే ఒక వ్యక్తి అదృష్టం పెరగడం ఖాయం. జ్ఞానం, సంతానం, కుటుంబ సంతోషం, వివాహం, ధార్మిక, ఆధ్యాత్మిక, దాతృత్వం, సంపద, సద్గుణాలకు కారకుడిగా బృహస్పతిని భావిస్తారు.

లేటెస్ట్ ఫోటోలు

Budhaditya raja yogam: బుధాదిత్య రాజయోగం.. వీరికి పెళ్లి కుదురుతుంది, ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది

May 20, 2024, 05:54 PM

భద్ర మహాపురుష రాజ యోగంతో ఈ రాశుల జాతకులకు కొత్త అవకాశాలు, శుభ ఘడియలు

May 20, 2024, 05:31 PM

30 ఏళ్ల తరువాత అదృష్ట రాజయోగం.. ఈ 3 రాశులకు శుభ ఘడియలు

May 20, 2024, 11:30 AM

Gajalakshmi Yogam : గజలక్ష్మీ యోగం.. వీరికి అప్పులు తీరుతాయి.. వ్యాపారంలో లాభాలు!

May 20, 2024, 07:58 AM

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

జ్యోతిష్య శాస్త్రంలో నిర్ధిష్ట విరామం తర్వాత తమ రాశి చక్రాన్ని మార్చుకుంటాయి. గురు గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారేందుకు 12 నెలలు పడుతుంది. గతేడాది గురు భగవానుడు మేష రాశిలోకి ప్రవేశించాడు. ఈ ఏడాది మే నెల 1వ తేదీన దేవగురువు బృహస్పతి మేషం నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. 

27 నక్షత్రాలలో పునర్వసు, వైశాఖం, పూర్వ, భాద్రపద నక్షత్రాలకు బృహస్పతి అధిపతిగా వ్యవహరిస్తాడు. బృహస్పతి రాశి మార్పు ప్రభావం మొత్తం పన్నెండు రాశుల మీద పడుతుంది. కొందరికి అనుకూల ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశుల జాతకులకు ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. గురు గ్రహ సంచారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో చూద్దాం.

వృషభ రాశి

దేవగురువు బృహస్పతి రాశి మార్పు వృషభ రాశి వారిని ఆర్థిక సమస్యల నుంచి బయట పడేస్తుంది. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అత్యవసర సమయాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు మీకు పూర్తి మద్ధతు ఇస్తారు.

మిథున రాశి

గురు భగవానుడి అనుగ్రహంతో మిథున రాశి వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలు నుంచి విముక్తి కలుగుతుంది. ఈ సమయం ఒక వరం లాంటిది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు, హోదా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితంలో రొమాన్స్ ఉంటుంది. పురోభివృద్దికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. శుభవార్తలు వింటారు. వృత్తిలో కొత్త బాధ్యతలు పొందుతారు.

సింహ రాశి

బృహస్పతి స్థానం బలంగా ఉంటే సింహ రాశి వారి సంపద పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. విద్యారంగానికి సంబంధించిన వారికి శుభ ఫలితాలు పొందుతారు. కార్యాలయంలో ప్రతి ఒక్కరూ మీ పనిని ప్రశంసిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది.

కన్యా రాశి

గురు సంచారం సమయంలో కన్యా రాశి ఉద్యోగస్తులకు, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం పొందుతారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. పని చేసే ప్రదేశంలో తోటి వారి ప్రశంసలు దక్కుతాయి. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి బృహస్పతి సంచారం శుభ ఫలితాలు ఇస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. కొత్త వాహనం, ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.

 

తదుపరి వ్యాసం