తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తే మీ కష్టాలు కడదేరుతాయి.. ఎందుకంటే

సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తే మీ కష్టాలు కడదేరుతాయి.. ఎందుకంటే

HT Telugu Desk HT Telugu

27 August 2023, 9:40 IST

google News
    • సుబ్రహ్మణ్యుని ఎందుకు ఆరాధించాలి? స్వామి పేర్ల అర్థాలేంటి? ఈ ధర్మ సందేహానికి ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ సమాధానం ఇచ్చారు.
కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (Pachaimalai murugan, CC BY-SA 4.0 , via Wikimedia Commons)

కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి

మానవునికి తన జీవితములో అనారోగ్య సమస్యలు ఏర్చడుతున్నాా వివాహము సమయానికి అవ్వకపోయినా, వివాహము అయిన వారికి జీవితములో ఘర్షణలు ఏర్పడుతున్నాా సంతాన సమస్యలు ఏర్పడినా ఈ సమస్యలన్నిటికి ఏకైక పరిష్కారం జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సుబ్రహ్మణ్యుని ఆరాధించడమే అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కష్టాలను తప్పించే సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి సర్పరూపుడు. కుజునకు అధిష్టాన దైవం. ప్రపంచంలోని నాగులందరికీ అధిపతి. సర్వశక్తిమంతుదైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం. ఎలాంటి కష్టాలనైనా తప్పించ గల దైవం.

సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్బరూపుడు కావడంవల్ల, సర్బగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య (గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా విశ్వసిస్తారు.

కుజుడు మనిషికి శక్తి, ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయని చిలకమర్తి తెలిపారు.

సుబ్రహ్మణ్యుని పేర్ల యొక్క అర్ధాలు 

ఆరు ముఖాలు గలవాడు కాబట్టి షణ్ముఖుడని, పార్వతి పిలచిన పిలుపును బట్టి స్కందుడు అని అంటారు. కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడని కాబట్టి కార్తికేయుడని, శూలము ఆయుధంగా గలవాడు కాబట్టి వేలాయుధుడని, శరములో అవతరించినవాడు శరవణభవుడు అని, గంగలోనుండి వచ్చినవాడు కాబట్టి గాంగేయుడు అని అంటారు.  దేవతల సేనానాయకుడు కాబట్టి సేనాపతి అని, శివునకు ప్రణవ మంత్రము అర్దాన్ని చెప్పినవాడు కాబట్టి స్వామినాధుడని, బ్రహ్మజానము తెలిపినవాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు అని ఈరకంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి ఈ పేర్లు ఉన్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మంగళవారం శుద్ద షష్టి, మృగళిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర, శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. దీనివల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. 

ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడం వల్ల ఇంకా మేలు జరుగుతుంది. ఇక జాతకంలో చాలామందికి కాలసర్ప దోషం ఉంటుంది. అలాగే రాహు, కేతు దోషాలు ఉంటాయి. అలాంటి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం సర్వదా శ్రేయస్కరం.

సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని మహిళలు పూజలుచేయడం తరచుగా మనం చూస్తూ ఉంటాం. 

పిల్లలను కోరుకునే స్త్రీలు వెండి సర్బానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను తాగితే వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ఉందని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

తదుపరి వ్యాసం