తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ganga Pushkaralu 2023: పుష్కర సమయంలో చేయవలసిన 12 దానాలు ఇవే

Ganga Pushkaralu 2023: పుష్కర సమయంలో చేయవలసిన 12 దానాలు ఇవే

HT Telugu Desk HT Telugu

10 April 2023, 11:24 IST

google News
    • Ganga Pushkaralu 2023: గంగానది పుష్కరాలు 22 ఏప్రిల్ 2023 నుండి 3 మే 2023 వరకు ఉంటాయి. పుష్కర స్నానం ఆచరించడంతో పాటు చేయవలసిన దానాల గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
కాశీలో గంగా మాతకు హారతి ఇస్తున్న దృశ్యం (ఫైల్ ఫోటో)
కాశీలో గంగా మాతకు హారతి ఇస్తున్న దృశ్యం (ఫైల్ ఫోటో) (Rajesh Kumar)

కాశీలో గంగా మాతకు హారతి ఇస్తున్న దృశ్యం (ఫైల్ ఫోటో)

భారతదేశంలో అనేక పుణ్య నదులు ఉన్నాయి. ఈ పుణ్యనదులలో పుష్కరాలు జరిగేటటువంటి 12 నదులకు ప్రత్యేక స్థానమున్నది. అలాగే సనాతన ధర్మంలో గంగా నదికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉన్నది. గంగానదిలో ఏ మానవుడైనా సంకల్ప సహితముగా సమయముతో పనిలేకుండా స్నానం ఆచరిస్తే వారికి గంగానది అనుగ్రహముచేత పుణ్యము లభిస్తుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

గంగానది పుష్కరాలు 22 ఏప్రిల్ 2023 నుండి 3 మే 2023 వరకు ఉంటాయి. గంగా నదిలో స్నానమాచరించడం ఉ త్తమం. పుష్కర స్నానాన్ని భక్తి శ్రద్ధలతో మూడు మునకలతో ఆచరించడం ఉత్తమం. పుష్కర స్నానం అయిన తరువాత దేవతలకు, ఋషులకు, నదికి అర్ఘ్యము, తర్పణాలు వదలాలి. పురాణాలలో చెప్పినట్టుగా పుష్కర సమయంలో 12 రోజులు దానాలు చేయాలి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

గంగానది పుష్కర సమయంలో చేసేటటువంటి దానం, జపము, తపము, హెూమాలు, తర్పణాలు వంటి వాటికి విశేషమైనటువంటి ఫలితము లభిస్తుంది. గతించినటువంటి పితృ దేవతలకు గంగానది పుష్కరాలలో విడిచేటటువంటి తిలతర్పణాలకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది.

  1. మొదటి రోజు: సువర్ణం, రజతం, ధాన్యం, భూమి
  2. రెండవ రోజు: వస్త్రం, లవణం, రత్నం
  3. మూడవ రోజు: గుడం (బెల్లం), అశ్వశాఖ, ఫలాలు.
  4. నాల్గవరోజు: ఘృతం (నెయ్యి), తైలం (నూనె), క్షీరం (పాలు), మధువు (తేనె)
  5. ఐదవ రోజు: ధాన్యం, శకటం, వృషభం, హలం.
  6. ఆరవ రోజు: ఔషధం, కర్పూరం, చందనం, కస్తూరి
  7. ఏడవ రోజు: గృహం, పీట, శయ్య (మంచం)
  8. ఎనిమిదవ రోజు: చందనం, కందమూలాలు, పుష్పమాల.
  9. తొమ్మిదవ రోజు: పిండం, కన్య, దాసి, కంబళి.
  10. పదవ రోజు: శాకం, సాలగ్రామం, పుస్తక దానం చేయాలి.
  11. పదకొండవ రోజు: గజ దానం
  12. పన్నెండవ రోజు: తిల (నువ్వులు)

-పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
తదుపరి వ్యాసం