Debt Remedies Astrology : గంగాజలంతో ఇలా చేస్తే.. అప్పులనుంచి విముక్తి పొందుతారట
29 November 2022, 16:26 IST
- Debt Remedies Astrology : అప్పుల నుంచి విముక్తి పొందాలన్నా.. వివాహం ఆటంకాలు లేకుండా జరగాలన్నా.. గంగాజలంతో పరిహారం చేయాలి అంటున్నారు జ్యోతిష్యులు. అంతేకాకుండా ఈ గంగాజలంతో మీరు అనేక ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గంగా జలంతో ఇలాంటి పరిష్కారాలు చేయండి..
Debt Remedies Astrology : గంగా నదిని భారతదేశంలో అత్యంత పవిత్రమైన నదిగా పరిగణిస్తారు. ఇది గంగోత్రి హిమానీనదం నుంచి ఉద్భవించింది. గంగా నది మానవ జీవితంలో స్వచ్ఛతను తీసుకువస్తుందని చాలా మంది భక్తులు నమ్ముతారు. దాని పవిత్ర జలంతో స్నానం చేస్తే.. ఆ వ్యక్తి పాపాలు అన్ని తొలగిపోతాయని.. భావిస్తారు. ఈ నది స్వర్గంలో ప్రవహించిందని, భూమిని శుద్ధి చేయడానికి ఇక్కడకు వచ్చినట్లు హిందువులు నమ్ముతారు.
పరశివుడు తన తలపై గంగానదిని ప్రవహింపజేసి.. అక్కడ నుంచి ఏడు ఉపనదులుగా ప్రవహించేలా చేశాడని పురాణాలు చెప్తున్నాయి. గంగాజలాన్ని మతపరమైన, పవిత్రమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. బిడ్డ పుట్టినప్పటినుంచి.. మరణించిన వరకూ చాలా మంది గంగాజలంతో శుద్ధి అవుతారు. అయితే పలు సమస్యలకు పరిహారం గంగాజలంతో చేయవచ్చు అంటున్నారు జ్యోతిష్యులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అప్పులు తీరాలంటే..
మీకు చాలా అప్పులు ఉన్నట్లయితే.. ఇత్తడి పాత్రలో గంగాజలాన్ని తీసుకొని ఇంట్లో ఈశాన్య మూలలో గంగాజలాన్ని ఉంచండి. కలశం నోటిని ఎర్రటి గుడ్డతో కప్పండి. ఈ పరిహారం చేయడం ద్వారా.. మీరు క్రమంగా రుణ విముక్తులు అవుతారు. అలాగే రుణ చెల్లింపు కూడా క్రమం తప్పకుండా చేయాలి.
పనుల్లో ఇబ్బంది పడుతుంటే..
మీరు పని సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. గంగా జలంతో చేసే పరిహారం అనువైనది. వరుసగా 40 రోజులు.. ఒక ఇత్తడి పాత్రను సాధారణ నీటితో నింపి.. దానిలో 11 చుక్కల గంగాజలం వేసి పక్కన పెట్టండి. 5 గంటల తర్వాత శివలింగానికి సమర్పించండి. ఈ పరిష్కారం మీ పనిలోని అంతరాయాలను తొలగిస్తుంది.
వివాహానికి ఆటంకం కలిగితే..
ఎవరైనా మీ వివాహానికి ఆటంకం కలిగిస్తున్నారా? అయితే స్నానం చేసే నీటిలో గంగాజలం, చిటికెడు పసుపు వేసి.. ఆ నీటితో క్రమం తప్పకుండా 21 రోజులు స్నానం చేయండి. ఈ పరిహారం వైవాహిక జీవితంలోని అడ్డంకులను తొలగిస్తుంది.
ప్రతికూలతలు తొలగిపోతాయి..
గంగాజలం అత్యంత పవిత్రమైన జలంగా పరిగణిస్తారు. ఇది అనేక అద్భుత లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే ఇంట్లో గంగాజలాన్ని ఉంచితే.. ప్రతికూలత తొలగిపోతుందని భావిస్తారు. ఈశ్వరుడిని ఆశీస్సులు పొందడానికి.. ప్రతిరోజూ గంగాజలాన్ని సమర్పించాలని చూస్తారు.
Disclaimer : ఇది కేవలం జ్యోతిష్యానికి సంబంధించిన విషయం. అంతేకానీ దీనిని హెచ్ టీ తెలుగు ఏమాత్రం ధృవీకరించట్లేదు. ఈ విషయంలో మీరు మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే.. జ్యోతిష్య, ధర్మకర్మ నిపుణుల సలహాలు తీసుకోండి.