Navratri Day 1 Pics | ఘనంగా మొదలైన నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి దర్శనం కోసం తరలుతున్న భక్తులు
తొమ్మిది రోజుల పాటు హిందువులు జరుపుకునే దసరా- నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 26న ప్రారంభమయిన ఉత్సవాలు, అక్టోబర్ 5 వరకు సాగుతాయి. ఈ నవరాత్రుల్లో దుర్గామాత తొమ్మిది అవతారాలలో దర్శనం ఇస్తుంది. సోమవారం, విజయవాడలోని కనక దుర్గమ్మ, జమ్మూ కాశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి మందిర్‌తో సహా వివిధ ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు.
(2 / 8)
నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు, సోమవారం నాడు రాజస్థాన్ రాష్ట్రంలోని బీవార్‌లో గల జ్వాలాముఖి మాత ఆలయంలో భక్తుల పూజలు.(PTI)
(3 / 8)
హోటళ్లలోనూ నవరాత్రి ప్లేటర్ పేరిట ప్రత్యేక భోజనం అందిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం, లక్నోలోని 'క్లార్క్స్ అవధ్' లో నవరాత్రి భోజనం.(HT Photo)
(4 / 8)
భోపాల్‌లో నవరాత్రి ఉత్సవాలకు ముందు నాడు కాళీ మాత విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్న ఓ కళాకారుడు.(ANI)
(6 / 8)
నవరాత్రి ఉత్సవాల మొదటి రోజున జమ్మూ నుండి 45 కిలోమీటర్ల దూరంలో రియాసి జిల్లాలోని కత్రా వద్ద కొండల్లో కొలువైన మాతా వైష్ణో దేవి మందిరం వైపు తరలుతున్న భక్తజనం(PTI)
(7 / 8)
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై విద్యుత్ వెలుగుల్లో కనకదుర్గమ్మ ఆలయం. బారులు తీరుతున్న భక్తజనం(twitter)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు