Today Horoscope : నేటి రాశిఫలాలు : ఆ రాశివారికి ఈరోజు అనుకూలంగా లేదు.. అప్పులు, ఖర్చులు పెరుగుతాయి..-today horoscope in telugu based on career and life for 9th september 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Horoscope : నేటి రాశిఫలాలు : ఆ రాశివారికి ఈరోజు అనుకూలంగా లేదు.. అప్పులు, ఖర్చులు పెరుగుతాయి..

Today Horoscope : నేటి రాశిఫలాలు : ఆ రాశివారికి ఈరోజు అనుకూలంగా లేదు.. అప్పులు, ఖర్చులు పెరుగుతాయి..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 09, 2022 11:49 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? సెప్టెంబర్ 9వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

<p>నేటి రాశిఫలితాలు</p>
<p>నేటి రాశిఫలితాలు</p>

Today Horoscope : నేటి రాశిఫలాలు (9-09-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశిఫలం

మేషరాశివారికి ఈరోజు అన్ని విధాలుగా లాభముగా ఉన్నది. చేసే ప్రతిపని అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవడం మంచిది. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. మేషరాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం మంచిది.

వృషభ రాశిఫలం

వృషభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. బృహస్పతి, శని అనుకూల స్థితివలన ప్రతీ పనియందు విజయాన్ని పొందుతారు. ఈ రాశివారు ఈ రోజు దుర్గాదేవిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.

మిథున రాశిఫలం

మిథునరాశివారికి ఈరోజు అనుకూలంగా లేదు. అప్పులు, ఖర్చులు పెరిగే స్థితి గోచరిస్తోంది. ఆరోగ్య విషయాలపై, కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ వహించాలి. ఈరోజు దశరథ ప్రోక్త శనిస్తోత్రం పఠించడం మంచిది.

కర్కాటక రాశిఫలం

కర్కాటకరాశివారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఈరోజు శివాభిషేకం చేసుకోవడం ద్వారా మరిన్ని శుభఫలితాలను పొందుతారు.

సింహ రాశిఫలం

సింహరాశివారికి ఈరోజు లాభదాయకంగా ఉంది. మీరు చేసే ప్రతిపనీ సత్ఫలితాలనిస్తాయి. జన్మరాశియందు రవి సంచారం చేస్తున్నాడు కాబట్టి.. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

కన్య రాశిఫలం

కన్యారాశివారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ధనలాభం కలుగును. ఆరోగ్యం అనుకూలించును. వీరు చేసే ప్రతి పనియందు విజయాన్ని పొందుతారు. తృతీయ స్థానమునందు కేతు సంచారము వల్ల ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. కన్యారాశివారు మరిన్ని శుభఫలితాల కోసం విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

తుల రాశిఫలం

తులరాశివారికి ఈరోజు చెడు ఫలితాలు ఉన్నాయి. ఈ రాశివారికి ఒత్తిడులు, మానసిక వేదన అధికముగా ఉండును. ప్రతీ పనిలో చికాకులు, అలసట అధికముగా ఉంటుంది. లక్ష్మీదేవిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగును.

వృశ్చిక రాశిఫలం

వృశ్చికరాశివారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. పనుల ఒత్తిడి అధికముగా ఉండును. కార్యములయందు ఇబ్బందులు ఏర్పడును. వృశ్చికరాశివారు మరిన్ని శుభఫలితాలను పొందడానికి ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది.

ధనుస్సు రాశిఫలం

ధనూరాశివారికి ఈరోజు మధ్యస్థము నుంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ధనూరాశి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. మరిన్ని శుభఫలితాలను పొందాలంటే ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం మంచిది.

మకర రాశిఫలం

మకర రాశివారికి ఈరోజు మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులు, వ్యాపారులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభఫలితాలను పొందుతారు.

కుంభ రాశిఫలం

కుంభరాశివారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఒత్తిడి అధికంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలి. కుంభరాశివారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

మీనం రాశిఫలం

మీనరాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసివస్తుంది. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మీనరాశివారు మరిన్ని శుభఫలితాలు పొందాలంటే దుర్గాదేవిని పూజించాలి.

<p>చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ</p>
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Email : chakri243@gmail.com

Contact : 9494981000

టాపిక్