తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ayodhya Ram Mandir: శ్రీరాముడికి చెందిన ఈ మంత్రాలు పఠిస్తే సకల విఘ్నాలు తొలగిపోతాయి

Ayodhya ram mandir: శ్రీరాముడికి చెందిన ఈ మంత్రాలు పఠిస్తే సకల విఘ్నాలు తొలగిపోతాయి

Gunti Soundarya HT Telugu

22 January 2024, 15:00 IST

google News
    • Ayodhya ram mandir : రాముడి అనుగ్రహం పొందటం కోసం ఈ మంత్రాలు పఠించండి. మీకున్న సమస్యలు, సంక్షోభాలు తొలగిపోతాయి. జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. 
అయోధ్యలోని రామ మందిరంలో కొలువైన బాల రాముడు
అయోధ్యలోని రామ మందిరంలో కొలువైన బాల రాముడు (via REUTERS)

అయోధ్యలోని రామ మందిరంలో కొలువైన బాల రాముడు

Ayodhya ram mandir: సుగుణాల రాముడు, జగదభిరాముడు, ఏక పత్నీ వ్రతుడు ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీరామునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ భర్తలో రాముని లక్షణాలు ఉండాలని కోరుకుంటారు. ధర్మానికి, న్యాయానికి, ఇచ్చిన మాటకి కట్టుబడే వ్యక్తిగా, కర్తవ్యానికి ప్రతిరూపంగా రాముడు ప్రసిద్ధి చెందాడు. విష్ణువు ఏడో రూపం శ్రీరాముడిగా నమ్ముతారు.

రామ అనే రెండు అక్షరాలు పలకడం వల్ల మనసు పులకరించిపోతుంది. శ్రీరాముని ఆశీస్సులు పొందాలని అనుకుంటే ప్రతి రోజు ఈ మంత్రాలు పఠించడం వల్ల మేలు జరుగుతుంది. ఆర్థిక సంక్షోభం, ఇతర సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. రెండు అక్షరాలైన రామ్ అనే పదానికి ఎంతో మహిమ ఉందని భక్తులు నమ్ముతారు. ఈ మంత్రాలు పఠించడం వల్ల మీ కోరికలు తీరడం మాత్రమే కాదు సమస్యలు తీరిపోతాయి.

రామ్

అత్యంత శక్తివంతమైన మంత్రాలలో రామ్ నామ మంత్రం ఒకటి. రామ్ అనే పేరుని ఉచ్చరించడం వల్ల మనసు తేలికపడుతుంది. దైవిక శక్తిని సూచిస్తుంది. భక్తితో మనస్పూర్తిగా రామ్ అనే మంత్రాన్ని పఠించడం వల్ల మనసు, ఆత్మ శుద్ధి చేయడంతో సహాయపడుతుంది. మీ జీవితంలో శాంతి నెలకొంటుంది. రామ నామ మంత్రం భక్తులకి అపారమైన శక్తిని ఇవ్వడమే కాదు జీవితంలోని అన్ని అడ్డంకులని తొలగిస్తుంది. ప్రతిరోజు రామ నామాన్ని జపించడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు.

రక్షణ మంత్రం- శ్రీరామ శరణం మమ్

రాముడికి అంకితం చేయబడిన మరొక మంత్రం ఇది. శ్రీరాముడి శరణు కోరుతూ ఈ మంత్రాన్ని పఠిస్తారు. దీన్ని జపించడం వల్ల రాముడి రక్షణ, ఆశ్రయం కోసం విన్నవించుకోవడమని అర్థం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల రాముడి రక్షిత శక్తి మీకు లభించి ఎటువంటి హాని, ప్రతికూలతల వల్ల ఇబ్బందులు ఉండవని నమ్ముతారు. ఒత్తిడితో కూడినప్పుడు ఈ మంత్రం పఠించడం వల్ల మేలు జరుగుతుంది.

ఓం రాం రామాయ నమః- బీజ్ మంత్రం

సానుకులమైన, బలమైన ప్రకంపనలు సూచించే మంత్రం ఇది. అత్యంత శక్తివంతమైన ఓం శబ్దంతో ఈ మంత్రం ప్రారంభంఅవుతుంది. రాముడితో సంబంధం ఉన్న దైవిక శక్తుల్ని పొందేందుకు ఈ మంత్రం సహాయపడుతుంది. నిజమైన అత్యంత భక్తితో పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవడం కోసం సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఈ మంత్రం జపించడం వల్ల ప్రశాంతత, ఏకాగ్రత పెంచుకోవచ్చు.

రామ గాయత్రీ మంత్రం-

ఓం దశరథయే విద్మహే

సీతావల్లభాయ ధీమహి

తన్నో రామం ప్రచోదయాత్

రాముడికి చెందిన మరొక శక్తివంతమైన మంత్రం ఇది. ఇక్కడ రాముడిని కొడుకు, భర్తగా సంబోధిస్తారు. ఓం జపంతో మంత్రం ప్రారంభం అవుతుంది. దశరథ కుమారుడిగా, సీతమ్మ తల్లి భర్తగా రాముడిని ప్రార్థిస్తారు. జ్ఞానం, తెలివి కోసం భక్తులు ఈ మంత్రాన్ని జపిస్తారు. శారీరక, మానసిక శక్తుల్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. తన జీవితానికి సరైన మార్గాన్ని చూపించమని వేడుకుంటూ భక్తులు రాముడిని స్మరించుకుంటారు.

రామ మంత్రం- శ్రీ రామ జయ రామ కోదండ రామ

కోదండ అనేది శ్రీరాముడి విల్లు. ధైర్యం, పరాక్రమం, విజయానికి ఈ విల్లు చిహ్నంగా భావిస్తారు. జీవితంలో ధైర్యం, విజయం ఇవ్వమని కోరుతూ ఈ మంత్రం జపిస్తారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల దుష్ట శక్తులపై శ్రీరాముడు సాధించిన విజయాన్ని ప్రతీకగా చెప్తారు. ధైర్యం ఇస్తుంది. ధర్మానికి కట్టుబడి ఉంటే జీవితంలో అనేక సవాళ్ళని అధిగమించగలుగుతారు.

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

శ్రీ రాముడు విష్ణువు ఏడో అవతారంగా చెప్తారు. ఈ విష్ణు మంత్రం పఠించడం వల్ల భక్తులకి అపారమైన శక్తి వస్తుంది. ఇద్దరు దేవుళ్ళని ఒకే మంత్రంతో స్మరించుకోవడం ఈ మంత్రం ఉద్దేశం. అంకిత భావం, భక్తి శ్రద్ధలతో ఈ మంత్రం పఠించడం వల్ల రాముడు, విష్ణువు ఆశీర్వాదాలు అనుగ్రహం పొందుతారు.

ఓం రామాయ నమః

ఈ మంత్రాన్ని జపించడం వల్ల సకల కష్టాలు తొలగిపోతాయి. శ్రీరాముడి ఈ మంత్రం చాలా ప్రభావవంతమైనది. శక్తివంతమైనది.

ఓం రామచంద్రాయ నమః

ఈ మంత్రాన్ని జపించడం వల్ల రాముని ప్రత్యేక అనుగ్రహం మీరు పొందుతారు. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. శ్రీరాముడిని పూజించేటప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి. ఓం రామ భద్రాయ నమః అనే సిద్ధ మంత్రాన్న 108 సార్లు జపించడం వల్ల సకల విజ్ఞాలు తొలగిపోతాయి. శ్రీరాముని అనుగ్రహం పొందుతారు.

తదుపరి వ్యాసం