తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bajrang Baan: బజరంగ్ బాన్ ప్రతిరోజు పఠించవచ్చా? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి

Bajrang baan: బజరంగ్ బాన్ ప్రతిరోజు పఠించవచ్చా? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి

Gunti Soundarya HT Telugu

23 July 2024, 12:19 IST

google News
    • Bajrang baan: హనుమంతుడి శక్తి సామర్థ్యాలను తెలిపేది బజరంగ్ బాన్. ప్రతిరోజు బజరంగ్ బాన్ పఠించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. 
బజరంగ్ బాన్ పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు
బజరంగ్ బాన్ పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు (pinterest)

బజరంగ్ బాన్ పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు

Bajrang baan: హనుమంతుడు సర్వశక్తిమంతుడు. భక్తుడు మనస్పూర్తిగా దైవాన్ని స్మరిస్తే వెంటనే ధైర్యాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు. మంగళవారం హనుమంతుడికి అంకితం చేసిన రోజు. అలాగే హనుమంతుడిని పూజించేందుకు కొన్ని శ్లోకాలు, మంత్రాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది హనుమాన్ చాలీసా. మరొకటి బజరంగ్ బాన్. ఇది అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు.

హనుమాన్ చాలీసా మాదిరిగానే ప్రతిరోజు బజరంగ్ బాన్ పఠించవచ్చా? లేదంటే నిర్ధిష్ట సమయాల్లో మాత్రమే పఠించాలా అనే దాని గురించి చాలా మందికి అనుమానం ఉంటుంది. మరికొందరు మాత్రం ప్రతిరోజు పఠించనప్పటికీ ఎటువంటి హాని ఉండదని నమ్ముతారు. బజరంగ్ బాన్ ను క్రమం తప్పకుండా జపించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.

అంతర్గత బలం ఇస్తుంది

బజరంగ్ బాన్ పఠించడం వల్ల హనుమంతుడి శక్తులు మనకు లభిస్తాయి. అంతర్గత బలం పెరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. అడ్డంకులను ధీటుగా ఎదుర్కోగలుగుతారు. కష్టసమయాల్లో మీరు ధైర్యంగా ఉండగలుగుతారు. మరింత శక్తివంతంగా మారతారు.

మానసిక శాంతి

పూర్తి ఏకాగ్రతతో బజరంగ్ బాన్ పఠించడం వల్ల మనసు శాంతపడుతుంది. ఇందులోని ప్రతి పదం మనస్సుపై శక్తివంతంగా పని చేస్తుంది. మనసులో నెలకొన్న అయోమయాలన్నీ పటాపంచలు అవుతాయి. ఏదైన ఒక విషయంలో పూర్తి స్పష్టతతో నిర్ణయం తీసుకోగలుగుతారు. జీవితంలో సమతులతను కాపాడుకోవడానికి మానసిక స్పష్టత చాలా ముఖ్యం.

సంకల్ప బలం

హనుమంతుడు సంకల్పం, దృష్టికి ప్రతిరూపం. బజరంగ్ బాన్ పఠించడంవల్ల జీవితంలో స్పష్టమైన ఉద్దేశంతో ముందుకు వెళతారు. మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. మీ సంకల్పం నెరవేరే వరకు వెనుకడుగు వేయకుండా నిరంతరం శ్రామిస్తారు. లక్ష్యాలకు కట్టుబడి ఉండగలుగుతారు. అద్భుతమైన జీవితాన్ని గడిపేందుకు ఇది సహాయపడుతుంది.

మెరుగైన ఆధ్యాత్మిక శక్తి

క్రమం తప్పకుండా బజరంగ్ బాన్ పఠించడం వల్ల హనుమంతుడి పట్ల మన భక్తి ఉన్నత శిఖరాలకు చేరుతుంది. అంజనేయుడి సద్గుణాలు తెలుసుకోగలుగుతారు. వాటిని ఆచరించాలనే భావన పెరుగుతుంది. ప్రతిరోజు బిగ్గరగా జపించడం వల్ల హనుమంతుడిపై మీకున్న విశ్వాసం రెట్టింపు అవుతుంది.

శారీరక, మానసిక ఆరోగ్యం

ప్రతిరోజు బజరంగ్ బాన్ పఠించడం వల్ల అధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండగలుగుతారు. హనుమంతుడి రక్షణ శక్తులు మీ చుట్టూ ఉన్న భావన కలుగుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. సానుకూల శక్తి ప్రసారిస్తుంది. అంతర్గత బలం మెరుగైన శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉండేందుకు సహాయపడుతుంది.

నిర్భయంగా జీవిస్తారు

హనుమంతుడు ధైర్యానికి ప్రతీక. బజరంగ్ బాన్ పఠించడం వల్ల భయమనేది ఎరుగరు. చెడు నుంచి రక్షణ కోరుతూ ప్రతికూల ప్రభావాలు, భయాల నుంచి హనుమంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. నిర్భయంగా జీవితాన్ని గడపగలుగుతారు.

ఎప్పుడు పఠించవచ్చు?

హనుమాన్ చాలీసా మాదిరిగా బజరంగ్ బాన్ ప్రతిరోజు జపించవచ్చు. దీని గురించి ఎటువంటి అపోహలు పెట్టుకోకూడదని పండితులు చెబుతారు. దీన్ని పఠించడం వల్ల అనేక దోషాలు, శని ప్రభావం కూడా తగ్గుతుందని అంటారు. హనుమంతుడి ఆశీస్సులు ఉంటే శని సైతం తన ఆశీర్వాదాలు కురిపిస్తాడు. అందుకే మనసులో ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా హనుమాన్ చాలీసా మాదిరిగానే బజరంగ్ బాన్ పఠించవచ్చు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం