Ayodhya Ram mandir: ప్రాణ ప్రతిష్ఠకి జనవరి 22 ఎందుకు ఎంచుకున్నారు? ఈ ముహూర్త ప్రత్యేకత ఏంటంటే..
22 January 2024, 11:08 IST
- Ayodhya ram mandir: అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకి జనవరి 22న ఎందుకు ఎంచుకున్నారనే దానికి చాలా సందేహాలు తలెత్తాయి. ఈ ముహూర్త ప్రాముఖ్యత ఏంటి అనేది జ్యోతిష్యులు వివరించారు.
అయోధ్య రామ మందిరం
Ayodhya ram mandir: దాదాపు 500 ఏళ్ల నిరీక్షణకి మరికాసేపటిలో తెరపడబోతుంది. భారతీయులందరూ ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభగంగా జరిగేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. అయోధ్యత్వ పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న అనేక రామాలయాల్లో కూడా మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి జనవరి 22 న ముహూర్తం పెట్టారు. అయితే ఆలయ నిర్మాణం పూర్తి కాకముందే ప్రాణ ప్రతిష్ఠ జరగడాన్ని పలువురు తప్పుబట్టారు. కానీ ప్రాణ ప్రతిష్ఠకి జనవరి 22ని ఎందుకు ఎంచుకున్నారు అనేదానికి ప్రముఖ జ్యోతిష్యులు వివరణ ఇస్తున్నారు.
ముహూర్త ప్రాముఖ్యత ఏంటంటే..
2024 పుష్య మాసంలో శుక్లపక్షం ద్వాదశి రోజున బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ ముహూర్తం మృగశిర నక్షత్రం రెండవ పాదంలో ఉంది. ఏ పనిలోనైనా లగ్నం చాలా ముఖ్యం. అయోధ్యలో శ్రీరామ చంద్రుని ప్రతిష్ఠకి దైవ బలం, నక్షత్ర శక్తి, గురుబలం, దీనబలం ఉన్నాయి. ఈ ఆలయం భారతదేశానికి మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి కేంద్ర బిందువుగా మారింది.
మృగశిర నక్షత్రం దేవతా ప్రతిష్ఠకి గొప్ప నక్షత్రం. సోమవారం నాడు ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం వల్ల ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందుతుంది. కొన్నేళ్ళ పాటు ఈ ఆలయం గురించి చెప్పుకుంటారు. శుక్ల పక్షం దేవతల ప్రతిష్ఠకి మేలు చేస్తుంది. కానీ కొన్ని మత గ్రంథాల ప్రకారం ద్వాదశి తిథి దేవతా ప్రతిష్ఠకి ఉపయోగపడదని అంటారు.
ఈనాటి యోగం బ్రహ్మ యోగం. మేష రాశి వారు భగవంతుడి ప్రతిష్ఠకి గొప్పదని అంటారు. సూర్యుడు కనిపించే నక్షత్రం నుంచి పగటి నక్షత్రం 12 వ నక్షత్రం అవుతుంది. ఇది ఈ ప్రదేశానికి ఊహించిన దాని కంటే ఎక్కువ శక్తి ఇస్తుంది. నవ గ్రహాలకి అధిపతిగా పరిగణించే బృహస్పతి లగ్న కుండలిలో నివసిస్తాడు. నవాంశ కుండలిలోని 10వ ఇంట్లో లగ్న స్థితిలో నివసిస్తాడు. దీని వల్ల ఈ ప్రదేశానికి గురు వృద్ధి లభిస్తుంది. పూజా కార్యక్రమాలు ఎప్పుడు సజావుగా సాగుతాయి.
రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో దుర్గామాత ఆలయం తెరిచే సూచనలు కనిపిస్తున్నాయి. 5 వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు 10 వ ఇంట్లో నివాసిస్తున్నాడు. దీంతో అయోధ్యకి వచ్చే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. శని అధిపతిగా ఉంటాడు. కుండలి ప్రకారం శని లాభ స్థానంలో ఉంటాడు. ఫలితంగా ఆదాయం పరంగా కూడా మొదటి స్థానంలో నిలిస్తుంది. ఈ స్థావరంలో అనేక దాతృత్వ కార్యక్రమాలు చేస్తారు.
జనవరి 22 మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరగనుంది. మొత్తం 84 సెకన్లలో ప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి ఈ వేడుకని చూసేందుకు వీలుగా ప్రాణ ప్రతిష్ఠని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. డీడీ దూరదర్శన్ ఛానెల్ లో లైవ్ టెలికాస్ట్ జరగనుంది.