తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Moon Eclipse 2024: 100 ఏళ్ల తర్వాత హోలీ రోజే చంద్రగ్రహణం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

Moon eclipse 2024: 100 ఏళ్ల తర్వాత హోలీ రోజే చంద్రగ్రహణం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

Gunti Soundarya HT Telugu

12 March 2024, 17:35 IST

    • Moon eclipse 2024: సుమారు వంద సంవత్సరాల తర్వాత హోలీ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కాబోతున్నాయి. 
హోలీ రోజు చంద్రగ్రహణం
హోలీ రోజు చంద్రగ్రహణం (pixabay)

హోలీ రోజు చంద్రగ్రహణం

Moon eclipse 2024: ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు. హిందూ మతంలో జరుపుకునే ప్రధాన పండుగలలో ఇది ఒకటి. దీపావళి తర్వాత అందరూ ఎక్కువగా జరుపుకునే పండుగ హోలీ. దీన్నే కాముని దహనం, డోలికోత్సవం అని కూడా పిలుస్తారు. కుల, మత భేదాలు లేకుండా దేశవ్యాప్తంగా హోలీ పండుగలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

లేటెస్ట్ ఫోటోలు

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

Mercury transit: వీరి మీద కనక వర్షం కురిపించబోతున్న బుధుడు.. అందులో మీరు ఉన్నారా?

May 16, 2024, 01:34 PM

Jupiter combust: అస్తంగత్వ దశలోకి గురు గ్రహం.. వీరికి అప్పులు, సమస్యలు, కష్టాలే

May 16, 2024, 01:11 PM

వృషభ రాశిలో సూర్యుడు: నెలపాటు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. ఈ ఇబ్బందులు కలగొచ్చు

May 16, 2024, 12:10 PM

Guru Aditya yoga: 12 ఏళ్ల తర్వాత గురు ఆదిత్య యోగం.. వీరికి గౌరవం, డబ్బు, అన్నింటా విజయం

May 16, 2024, 08:25 AM

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

ప్రేమ, సద్భావన, సోదర భావానికి చిహ్నంగా ఈ పండుగను భావిస్తారు. ఒకరి మీద ఒకరు రంగుల చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఈ ఏడాది హోలీ మార్చి 25వ తేదీన వచ్చింది. పంచాంగం ప్రకారం హోలీ రోజున చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. మార్చి 25న ఉదయం 10:23 గంటల నుంచి మధ్యాహ్నం 3.02 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

ఈ చంద్రగ్రహణం భారతలో కనిపించదు. అందువల్ల సూతక్ కాలం కూడా చెల్లదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సుమారు వంద సంవత్సరాల తర్వాత హోలీ రోజున వచ్చే చంద్రగ్రహణం కొన్ని రాశులపై శుభ ప్రభావం చూపుతుంది. మరి కొన్ని రాశుల వారికి జీవితంలో చిన్న చిన్న సమస్య ఎదురవుతాయి. హోలీ రోజున ఏర్పడే చంద్రగ్రహణం ఏ రాశుల వారికి మేలు చేస్తుందో చూద్దాం.

మేష రాశి

మేష రాశి వారికి ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం నుండి శుభ ఫలితాలు లభిస్తాయి. అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. పూర్వీకుల ఆస్తి పొందుతారు. చాలా కాలంగా బకాయి పడిన డబ్బు తిరిగి వస్తుంది. ఈ సమయంలో శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.

తులా రాశి

సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో పదోన్నతి లేదా ప్రశంసలు పొందుతారు. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. ఆస్తి నుంచి ధన లాభం పొందుతారు.

కుంభ రాశి

ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి అవకాశాలను లభిస్తాయి. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది. అనేక మార్గాల ద్వారా ధనాన్ని సంపాదిస్తారు. భాగస్వామి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. వృత్తిలో నూతన విజయాలు సాధిస్తారు. జీవితాన్ని సౌకర్యవంతంగా గడుపుతారు.

హోలీ రోజు చంద్ర గ్రహణంతో పాటు మీన రాశిలో సూర్యుడు, రాహువు, చంద్రుల కలయిక కూడా ఏర్పడుతుంది. ఈ మూడు గ్రహాల కలయిక వల్ల గ్రహణ యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ యోగాన్ని అశుభంగా పరిగణిస్తారు. హోలీ రోజున ఏర్పడే ఈ గ్రహణ యోగం వల్ల కొన్ని రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ధన నష్టం జరిగే అవకాశం ఉంది.

మకర రాశి

పాత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయి. చట్టపరంగా సమస్యలు ఎదుర్కొంటారు అధికారులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. గృహ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఏకాగ్రత లోపిస్తుంది. ఇతరుల చేతుల్లో మోసపోయే ప్రమాదం ఉంది.

మీన రాశి

మీన రాశిలో ఈ గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఫలితంగా ఆగిపోయిన పనులు మరింత వాయిదా పడతాయి. విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెట్టుబడులకు దూరంగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యంతో శ్రద్ధ వహించాలి. డబ్బులు తెలివిగా ఖర్చు చేయాలి.

తదుపరి వ్యాసం