తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  2023 Vruschika Rasi Phalalu : 2023వ సంవత్సరం వృశ్చిక రాశి వారిపై శనిప్రభావం ఉంటుంది..

2023 Vruschika Rasi Phalalu : 2023వ సంవత్సరం వృశ్చిక రాశి వారిపై శనిప్రభావం ఉంటుంది..

31 December 2022, 10:30 IST

    • 2023 Scorpio Rasi Phalalu : ఆంగ్ల నూతన సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు బాగున్నాయని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 2023 వృశ్చిక రాశి ఫలాలు ఇక్కడ చూడండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

2023 Vruschika Rasi Phalalu : చిలకమర్తి పంచాంగ రీత్యా ధృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వృశ్చికరాశి వారికి 2023లో జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 2023 లో వృశ్చికరాశి వారికి ఏప్రిల్ 2023 వరకు శని 3వ ఇంట, గురుడు 5వ ఇంట మే 2023 నుండి శని 4యింట గురుడు 6వ ఇంట సంచరించుట చేత వృశ్చికరాశి వారికి 2023లో జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం. 2023లో వృశ్చికరాశి వారికి అర్థాష్టమి శని ప్రవేశం చేత శత్రు స్థానము నందు గురుడు సంచరించుటచేత వాగ్వివివాదములు అధికమగును. అనవసర సమస్యలు తెచ్చుకొనెదరు. కుటుంబమునందు సమస్యలు, మానసిక వేదనలు కలుగును. వృశ్చికరాశి వారు ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తలు వహించాలి.

లేటెస్ట్ ఫోటోలు

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

2023లో వృశ్చికరాశి వారికి ఏప్రిల్ వరకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. 2023 మే నుండి వృశ్చికరాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు రాజకీయ ఒత్తిళ్ళు, ఇబ్బందులు ఏర్పడును. 2023 వృశ్చికరాశి వ్యాపారస్తులకు వ్యాపారమునందు సమస్యలు అధికమగును. ప్రతీ విషయమునందు ఆచితూచి వ్యవహరించవలసినటువంటి సంవత్సరము. వృశ్చికరాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వలన ఆరోగ్య విషయములయందు, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. వృశ్చికరాశి స్త్రీలకు 2023 కఠిన సమయము. వృశ్చికరాశి విద్యార్థులకు 2023 కష్టపడి చదువవలసినటువంటి సంవత్సరం. 2023 వృశ్చికరాశి రైతాంగం వారికి మధ్యస్థ ఫలితములున్నాయి. వృశ్చికరాశి సినీరంగం వారికి అనుకూలముగా లేదు. మొత్తం మీద వృశ్చికరాశి వారికి 2023 మధ్యస్థము నుండి చెడు ఫలితములు అధికముగా ఉన్నాయి.

వృశ్చికరాశి వారు మరింత శుభఫలితాలు పొందాలంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, దశరథ పోక్త శని సోత్రము వంటివి పఠించడం, ఆదివారం రోజు ఆదిత్య హృదయం వంటివి పారాయణ చేయడం, గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం వలన మరింత శుభ ఫలితాలు పొందెదరు. వృశ్చికరాశి వారు పగడం ధరించడం మంచిది. వృశ్చికరాశి వారు 3 ముఖములు గల రుద్రాక్షను ధరించడం వలన మరింత శుభ ఫలితములు కలుగుతాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం